Regular Coffee Consumption : క్రమం తప్పకుండా కాఫీ తాగడం వల్ల ఎత్తు పెరుగుదల నిరోధించటంతోపాటు, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందా?

రోజువారీగా ఎక్కువ సార్లు కాఫీ తీసుకుంటే గుండెపై ఒత్తిడిని కలిగిస్తోందని ఆందోళన చెందుతున్నారా? భయపడాల్సిన పనిలేదు. కాఫీ మితంగా తీసుకోవటం వల్ల వాస్తవానికి కొన్ని హృదయనాళ ప్రయోజనాలను కలిగి ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

Regular Coffee Consumption : మీరు కాఫీ ప్రియులా.. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి తాజాగా తయారుచేసిన ఒక కప్ కాఫీని సేవిస్తున్నారా? అలా అయితే, కాఫీ తాగడం వల్ల మీ ఎత్తు ఎదుగుదల కుంటుపడుతుందనే పాతకాలపు పెద్దలమాటలను మీరు వినే ఉంటారు. కాఫీ తాగే అలవాటు విషయంలో చాలా మందిలో ఇలాంటి అనేక అపోహలు ఉన్నాయి. ఈ వాదనలో ఏదైనా నిజం ఉందా అనే విషయం గురించి చర్చిద్దాం..

READ ALSO : Cotton and Soya Crops : పత్తి,సోయాలో ఎరువుల యాజమాన్యంలో చేపట్టాల్సిన చర్యలు

రోజువారీ కప్పు కాఫీ మీ ఎత్తు పెరుగుదలను అడ్డుకుంటుందా?

అపోహ #1: కాఫీ మీ పెరుగుదలను అడ్డుకుంటుంది

కాఫీ గురించి చాలా విస్తృతమైన అపోహలలో ఒకటి. ముఖ్యంగా పిల్లలు మరియు యుక్తవయస్సులో ఉన్న వారిలో వారి పెరుగుదలను అడ్డుకుంటుంది. కానీ దీనికి మద్దతు ఇవ్వడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. రోజువారీ మోతాదు కెఫీన్ మీ పూర్తి ఎత్తు సామర్థ్యాన్ని చేరుకోకుండా ఎలాంటి అవాంతరాలు కలిగించదు. వాస్తవానికి, అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, కాఫీ వినియోగం కౌమారదశలో ఉన్నవారి ఎత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపదని తేలింది. కాబట్టి, మీ ఎదుగుదల గురించి చింతించకుండా కాఫీని ఆస్వాదించండి.

READ ALSO : Healthy Eating : రోగాలకు దూరంగా ఉండాలంటే.. వీటిని ఆహారంలో చేర్చుకోండి !

అపోహ #2: కాఫీ బోలు ఎముకల వ్యాధికి కారణమవుతుంది

కాఫీ వినియోగం బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుందనేది చాలా మందిలో నెలకొన్ని ఆందోళన. అధిక కాఫీ వినియోగం కాల్షియం శోషణకు అంతరాయం కలిగిస్తుంది. ఇది తప్పనిసరిగా పురుషులు లేదా స్త్రీలలో బోలు ఎముకల వ్యాధి ప్రమాదానికి దారితీయదు. రోజూ ఎక్కువ సార్లు కాఫీ తీసుకునే వారు తగ్గించడం మంచిది. రోజుకు రెండు నుండి మూడు కప్పులు ఆస్వాదించడం వల్ల ఎముకలకు హాని కలిగించే అవకాశం లేదు, ప్రత్యేకించి మీరు క్యాల్షియంతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటుంటే దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.

READ ALSO : Black Rice : బ్లాక్ రైస్ ను ఆహారంగా తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అపోహ #3: కాఫీ గుండెను ఒత్తిడికి గురిచేస్తుందా

రోజువారీగా ఎక్కువ సార్లు కాఫీ తీసుకుంటే గుండెపై ఒత్తిడిని కలిగిస్తోందని ఆందోళన చెందుతున్నారా? భయపడాల్సిన పనిలేదు. కాఫీ మితంగా తీసుకోవటం వల్ల వాస్తవానికి కొన్ని హృదయనాళ ప్రయోజనాలను కలిగి ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. కొన్ని అధ్యయనాలు కాఫీ దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది. అయినా కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల గుండె దడ, రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి కాఫీ తాగే అలవాటును అదుపులో ఉంచుకోవటం మంచిది.

READ ALSO : Nutritious Food : చర్మ సహజ కాంతిని కోల్పోతున్నారా? అయితే పోషకవిలువలు కలిగిన ఆహారం తీసుకోవటం బెటర్ !

చివరగా కాఫీ విషయంలో అనేక అపోహలు, వాస్తవాల విషయంలో చూసుకుంటే మితమైన కాఫీ వినియోగం సాధారణంగా సురక్షితంగా పరిగణించబడుతున్నప్పటికీ అధిక మోతాదులో తీసుకుంటే దానిలోని కెఫిన్ ప్రభావం అంతర్లీన ఆరోగ్య పరిస్ధితులపై పడే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు