Eating Strawberries : శీతాకాలంలో స్ట్రాబెర్రీలు తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలే!

స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో తోడ్పడతాయి. పళ్లలోని పీచు పదార్ధాలు, వర్ణకాలు, రక్త కణాలపైన, మెదడుపైనా ప్రీరాడికల్స్‌ ప్రభావం చూపి చురుకుగా పనిచేసేట్లు చేస్తుంది.

Eating Strawberries : శీతాకాలంలో స్ట్రాబెర్రీలు తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలే!

Eating strawberries in winter is good for heart health!

Updated On : November 25, 2022 / 9:37 AM IST

Eating Strawberries : శీతాకాలంలో స్ట్రాబెర్రీ లు తినడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. స్ట్రాబెర్రీల్లో ఆంథోసైనిడిన్‌లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండె జబ్బుల నివారణలో సహాయపడతాయి. స్ట్రాబెర్రీలో విటమిన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇందులో పాలీఫెనాల్స్ తో పాటు పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అంటువ్యాధుల నుండి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. స్ట్రాబెర్రీలను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

స్ట్రాబెర్రీలో ఉండే ఫైబర్ కూడా ఉదర సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. స్ట్రాబెర్రీలలో విటమిన్-బి, సి పుష్కలంగా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలో ఉండే పొటాషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, అయోడిన్ ఎముకలు, కీళ్ల నొప్పిని దూరం చేస్తుంది. టైప్-2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో తోడ్పడతాయి. పళ్లలోని పీచు పదార్ధాలు, వర్ణకాలు, రక్త కణాలపైన, మెదడుపైనా ప్రీరాడికల్స్‌ ప్రభావం చూపి చురుకుగా పనిచేసేట్లు చేస్తుంది. బెర్రీ పండ్లను తీసుకుంటే నోటి దుర్వాసనతో పాటు దంత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. స్ట్రాబెరీలో ఉండా పొటాషియం రక్త ప్రసరణను క్రమబద్దం చేయడానికి సహాయపడటంతోపాటు, హైబ్లడ్ ప్రెజర్ కు గురికాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.