Muscle Building : కండరాల నిర్మాణంలో సహాయపడే గుడ్లు !

గుడ్లు తినే విషయంలో కొంద మందిలో అనేక అపోహలు ఉన్నాయి. వాటిలో అధిక కొవ్వు ఆరోగ్యానికి హానికరమని బావిస్తారు. గుడ్డులోని తెల్లసొనలో కొవ్వు ఉండదు, అయితే పచ్చసొనలో 5 గ్రాముల కొవ్వు ఉంటుంది.

Muscle Building : కండలు తిరగిన బాడీని తయారు చేయడాన్ని చాలా మంది లక్ష్యంగా పెట్టుకుంటారు. రోజువారి వ్యాయామాలు చక్కటి రూపంలో కండరాలను తీర్చిదిద్దటానికి తోడ్పడతాయి. కండరాల నిర్మాణానికి వాటిని బలంగా ఉంచడంలో ప్రోటీన్‌ చాలా అవసరం. రోజువారీగా తినే ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోవటం వల్ల కండరాలు ధృఢంగా మారతాయి. రిబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్ , B12 తో సహా అనేక రకాల B విటమిన్లు , A, E , K విటమిన్లు ఉన్నాయి. దీంతోపాటుగా కాల్షియం, జింక్ వంటి ఖనిజాలకు మంచి మూలం.

READ ALSO : Bathukamma 2023 : తెలంగాణలో మొదలైన పూల సంబురం..మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆ పేరు ఎలా వచ్చింది..?

కండరాల నిర్మాణానికి గుడ్లు ;

కండరాల్లో సమస్యలను తొలగించటానికి, అవి పెరగడానికి ప్రోటీన్ అవసరమౌతుంది. ముఖ్యంగా గుడ్లు అధిక స్ధాయిలో ప్రోటీన్‌ ను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. రోజువారి కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేసేవారికి బాగా ఉపయోగపడతాయి.

కండర ద్రవ్యరాశి ఎంత ఎక్కువగా ఉంటే, విశ్రాంతి తీసుకునేటప్పుడు ఎక్కువ కేలరీలు బర్న్ చేయగలుగుతారు. కండర ద్రవ్యరాశిని సమర్ధవంతంగా నిర్మించడానికి, సరైన పోషకాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారంలో గుడ్లు వంటి పోషకవిలువలు కలిగిన అధిక ప్రోటీన్ ఆహారాలను తీసుకోవటం ప్రయోజనకరంగా ఉంటుంది. గుడ్లు, సమతుల్య ఆహారంలో భాగంగా, కండరాల పునరుద్ధరణకు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించడంలో సహాయపడతాయి.

READ ALSO : KTR : కాంగ్రెస్‌లో ముగ్గురు నేతల మధ్య సీఎం సీటుకు ఒప్పందం కుదిరింది..పదవీ కాలాన్ని పంచేసుకున్నారు : కేటీఆర్

గుడ్లు తినే విషయంలో కొంద మందిలో అనేక అపోహలు ఉన్నాయి. వాటిలో అధిక కొవ్వు ఆరోగ్యానికి హానికరమని బావిస్తారు. గుడ్డులోని తెల్లసొనలో కొవ్వు ఉండదు, అయితే పచ్చసొనలో 5 గ్రాముల కొవ్వు ఉంటుంది. పచ్చసొనలో 1.6 గ్రాముల సంతృప్త కొవ్వు (చెడు కొవ్వు) మాత్రమే ఉంటుంది. కండరాల పెరుగుదల కోసం ప్రయత్నిస్తున్న బాడీబిల్డర్లకు ఆహారంలో కొవ్వు అవసరం. గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచదు.

READ ALSO : Vijayashanti: కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవడంలో బీజేపీ విఫలం.. రగిలిపోతున్న విజయశాంతి!

కండరాల నిర్మాణం కోసం వ్యాయామాలు చేసేవారు ఆహారంలో ప్రోటీన్‌లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. అయితే, వర్కవుట్ తర్వాత షేక్స్ తాగడం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఉడికించిన గుడ్లను తింటూ షేక్స్‌ తీసుకోవటం ద్వారా అవసరమైన పోషకాల సమతుల్యతను పొందవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవటానికి, మెదడు పనితీరును మెరుగుపరుచుకోవటానికి జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు