KTR : కాంగ్రెస్‌లో ముగ్గురు నేతల మధ్య సీఎం సీటుకు ఒప్పందం కుదిరింది..పదవీ కాలాన్ని పంచేసుకున్నారు : కేటీఆర్

కాంగ్రెస్ లో ముగ్గురు నేతల మధ్య సీఎం సీటుకు ఒప్పందం కుదిరింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఒప్పందంలో భాగంగా ఒక్కొక్కరు సీఎం పదవీకాలాన్ని పంచుకున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

KTR : కాంగ్రెస్‌లో ముగ్గురు నేతల మధ్య సీఎం సీటుకు ఒప్పందం కుదిరింది..పదవీ కాలాన్ని పంచేసుకున్నారు : కేటీఆర్

Minister KTR

Minister KTR : కాంగ్రెస్ కర్ణాటక నుంచి తెలంగాణకు భారీగా డబ్బులు తరలిస్తోందని..ఇప్పటికే కోట్లాది రూపాయలు చేరారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కర్ణాటక నుంచి తెలంగాణకు తరలించడానికి సిద్ధంగా ఉన్న రూ.42 కోట్లు కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంట్లో దొరికాయని ఆరోపించారు. రూ.8 కోట్లు ఇంతకు ముందే కొడంగల్‌కు చేరినట్టు తమకు సమాచారం ఉందని అన్నారు. కాంగ్రెస్ లో ముగ్గురు నేతల మధ్య సీఎం సీటుకు ఒప్పందం కుదిరింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒప్పందంలో భాగంగా ఒక్కొక్కరు ఏడాదిన్నర కాలం సీఎం పదవీకాలాన్ని పంచుకున్నారు అంటూ వ్యాఖ్యానించారు. డబ్బులు ఇచ్చేవారికే టికెట్లు ఇస్తున్నారని టికెట్లు అమ్ముకుంటున్నారు అంటూ ఆరోపించారు. అటువంటి వారికి అధికారం ఇస్తే రాష్ట్రాన్నే అమ్మేస్తారని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మేలు చేసే పార్టీ ఏదో గుర్తించి ఓటు వేయాలని సూచించారు.

Revanth Reddy : 50శాతం సీట్లు కొలిక్కి, త్వరలోనే జాబితా విడుదల- అభ్యర్థుల ఎంపికపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలను వీడే నేతలు ఎక్కువయ్యారని..ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరింతమంది పార్టీకి గుడ్ బై చెబుతున్నారని అన్నారు. సీనియర్ నేతలు సైతం పార్టీని వీడుతున్నారు అంటే పార్టీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. 40 స్థానాల్లో అసలు కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరు అంటూ ఎద్దేవా చేశారు. పొన్నాల లక్ష్మయ్యాలాంటి బీసీ నేతలను కాంగ్రెస్ అవమానిస్తోందని అవమానాలు భరించలేకే పొన్నాల వంటివారు బయటకు వచ్చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ చేరాలని పొన్నాలను ఆహ్వానిస్తామని..బీఆర్ఎస్ లో బీసీలకు పెద్ద పీట వేస్తామని వెల్లడించారు. తమ కంటే మెరుగైన పాలనా నమూనా కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? అని అన్నారు. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని కోరారు.

Assembly Elections 2023: పొన్నాల లక్ష్మయ్య రాజీనామాపై కాంగ్రెస్ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ కె.మురళీధరన్ కామెంట్స్

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా పలు ప్రాంతాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఎన్నికల్లో హీట్ లో భాగంగా ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విమర్శలు ప్రతి విమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలతో ఆయా పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. అలాగే ఏ పార్టీలోంచి అయిన నేతలు బయటకు వస్తే వేరే పార్టీల వారు వారిని తమ పార్టీలో చేర్చుకుందుకు సిద్ధపడుతున్నారు. ఎన్నిల సమయంలో ఇటువంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయనే విషయం తెలిసిందే.