Eggs vs Paneer
Eggs vs Paneer : పనీర్ మరియు గుడ్లు మనలో చాలా మంది ఆహారంగా తీసుకునే రెండు ప్రధాన ప్రోటీన్ వనరులు. ఈ రెండింటిలో పోషక విలువలు ఎక్కువగా ఉన్నందున వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పనీర్ మరియు గుడ్లు రెండింటినీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆహారంగా తీసుకుంటున్నారు. పనీర్ తేలికపాటి క్రీము , నీటి రుచిని కలిగి ఉంటుంది, అయితే గుడ్లు కొంచెం ఉప్పగా, బలమైన రుచులను కలిగి ఉంటుంది. శాకాహారులకు పనీర్ మాత్రమే ప్రోటీన్ యొక్క మూలం, అయితే మాంసాహారులు అటు పనీర్ తోపాటు, గుడ్డును రెండింటిని
ఎంచుకోవచ్చు. అయితే బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమైనదన్న దానిపై చాలా మందిలో సందేహాలు ఉన్నాయి.
READ ALSO : Diet In Winter : శీతాకాలంలో బెల్లం, ఖర్జూరం, గుడ్లు ఆహారంలో చేర్చుకుంటే చాలు!
మనలో చాలామంది ప్రోటీన్ కోసం పనీర్, గుడ్లు తీసుకుంటారు. అవి మంచి పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని సూపర్‌ఫుడ్‌లుగా చెప్పవచ్చు. వ్యాయామానికి ముందు వ్యాయామం తరువాత భోజనంలో వీటిని తీసుకుంటారు. శాకాహారులు ప్రోటీన్‌లను పొందడానికి పనీర్‌ను తీసుకుంటారు. అయితే మాంసాహారులు శరీర నిర్మాణానికి అవసరమైన పోషకాల కోసం గుడ్లు
, చికెన్‌ని తీసుకుంటారు.
గుడ్డులోని పోషకాలు ; ఒక ఉడికించిన గుడ్డు సుమారు 44 గ్రాములు ఉంటే దానిలోని పోషకాల విషయానికి వస్తే , ప్రోటీన్ 5.5 గ్రా, మొత్తం కొవ్వు 4.2 గ్రా, కాల్షియం 24.6 మి.గ్రా, ఐరన్ 0.8 మి.గ్రా, మెగ్నీషియం 5.3 మి.గ్రా, భాస్వరం 86.7 మి.గ్రా, పొటాషియం 60.3 మి.గ్రా, జింక్ 0.6 మి.గ్రా, కొలెస్ట్రాల్ 162 మి.గ్రా, సెలీనియం 13.4 మైక్రోగ్రాములు (mcg), ఉంటాయి.
ప్రొటీన్ లో పోషకాలు ; 40 గ్రాముల తక్కువ కలిగిన పనీర్ లో ప్రోటీన్ 7.54 గ్రా, కొవ్వు 5.88 గ్రా, పిండి పదార్థాలు 4.96 గ్రా, ఫోలేట్స్ 37.32 మైక్రోగ్రామ్, కాల్షియం 190.4mg, భాస్వరం 132 మి.గ్రా, పొటాషియం 50 మి.గ్రా ఉంటాయి.
READ ALSO : Eggs : గుడ్లు అదేపనిగా తినేస్తున్నారా! అయితే జాగ్రత్త
గుడ్లు చౌకగా లభిస్తాయి. అవి మన రోజువారీ జీవితంలో శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రొటీన్‌తో పాటు శరీరం దాని సాధారణ పనితీరును నిర్వహించడానికి అవసరమైన అనేక ఇతర పోషకాలను కలిగి ఉంటుంది. గుడ్లు అనేక విధాలుగా తీసుకోవచ్చు. ఆమ్లేట్, గుడ్డు కూర, ఉడికించిన గుడ్లు, వేయించిన గుడ్లు ఇలా వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. గుడ్డు పచ్చసొనలోని అధిక కొవ్వు పదార్ధం కారణంగా చాలా మంది తెల్లని పదార్దాన్ని మాత్రమే తీసుకుంటారు. అయితే పసుపు భాగంలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి.
పనీర్ లేదా కాటేజ్ చీజ్ విషయానికి వస్తే, ఇది భారతదేశంలో ప్రసిద్ధ పాలతో తయారు చేయపడ్డ ఉత్పత్తి. కాల్షియం, విటమిన్ బి12, సెలీనియం, విటమిన్ డి మరియు రిబోఫ్లావిన్‌లో చాలా సమృద్ధిగా ఉన్న పనీర్‌ను సలాడ్‌లో చేర్చవచ్చు, పనీర్ కూరగా తయారు చేసుకోవచ్చు. పాలవిరుగుడు నుండి పెరుగులను వేరు చేయడం ద్వారా కాటేజ్ చీజ్ పాల నుండి తయారు చేయబడుతుంది.
READ ALSO : Viral News: వింత కోడిపుంజు.. గుడ్లు పెట్టి పిల్లలను పొదుగుతుంది!
పాల ఉత్పత్తులు మరియు గుడ్లలో విటమిన్ B-12 మరియు విటమిన్ D పుష్కలంగా ఉన్నాయి, ఈ రెండు పోషకాలు మొక్కల ఆధారిత ఆహార ఉత్పత్తులలో అరుదుగా కనిపిస్తాయి. రెండింటినీ ఆహారంలో ప్రత్యామ్నాయంగా చేర్చుకోవచ్చు. బరువు తగ్గాలని ప్రయత్నించే శాఖాహారులు పనీర్ , గుడ్లు తినటం వల్ల మేలు జరుగుతుంది. గుడ్లు , పనీర్ కాకుండా, ప్రోటీన్ కోసం చికెన్, చీజ్, బీన్స్, ముంగ్ బీన్స్, బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్ , బ్రోకలీ వంటివాటిని ఎంపిక చేసుకోవచ్చు.