Diet In Winter : శీతాకాలంలో బెల్లం, ఖర్జూరం, గుడ్లు ఆహారంలో చేర్చుకుంటే చాలు!

చలికాలంలో గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. గుడ్లు శరీరానికి అంతర్గత వేడి అందిస్తాయి. ఫలితంగా జలుబు, దగ్గు సమస్యలు తొలగిపోతాయి. గుడ్లు తినడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మజిల్స్ అభివృద్ధికి దోహదపడతాయి.

Diet In Winter : శీతాకాలంలో బెల్లం, ఖర్జూరం, గుడ్లు ఆహారంలో చేర్చుకుంటే చాలు!

Add jaggery, dates and eggs to your diet in winter!

Updated On : January 7, 2023 / 10:21 AM IST

Diet In Winter : చలికాలంలో కొన్ని వ్యాధులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. చలికాలం అంటే సహజంగానే అందరూ ఇష్టపడతారు. అదే సమయంలో ఇమ్యూనిటీ తగ్గడంతో వివిధ రకాల వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుంది. ఈ సీజన్‌లో జలుబు, ముక్కు మరియు గొంతులో వైరస్ ఇన్ఫెక్షన్ చాలా సాధారణం. ముక్కు కారటం, గొంతు నొప్పి, కఫం, దగ్గు, తుమ్ములు, జ్వరం మరియు అలసట వంటివి ఎదురయ్యే సమస్యలు. చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలన్నా శరీరంలో ఎనర్జీ కావాలన్నా శరీరాన్ని రక్షించే ఆహారాలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. బెల్లం ;

చలికాలంలో శరీరానికి శక్తిని ఇచ్చే నీరు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ బీ, ఐరన్, ఫాస్పరస్ వంటి మూలకాలు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. బెల్లంలో ఫాస్పరస్, కాల్షియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దాంతో చలికాలంలో బెల్లం తింటే మెరుగైన ఫలితాలు చూడవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు ఇబ్బందులుంటే బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. శెనగలతో పాటు బెల్లం తింటే..శరీరంలో ఐరన్ లోపం కూడా తొలగిపోతుంది. ఎనీమియా వంటి వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు. బెల్లం తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. లివర్ ను శుభ్రపరిచి ఆరోగ్యవంతంగా చేస్తుంది.

2. ఖర్జూరం ;

ఖర్జూరంలో కరిగే మరియు కరగని ఫైబర్స్ కూడా ఉన్నాయి, ఇవి జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. ఖర్జూరంలో కాల్షియం, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఖర్జూరం తింటే ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుంది. ఖర్జూరంలో పెద్ద మొత్తంలో ఉండే ఫైబర్ కారణంగా కడుపు సంబంధిత సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. ఖర్జూరం తినడం వల్ల శరీరం ఇమ్యూనిటీ పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు దరిచేరవు. చలికాలంలో చాలా మంది చలి సమస్యను ఎదుర్కోవటానికి 2-3 ఖర్జూరాలను నీటిలో వేసి మరిగించి, అందులో చిటికెడు మిరియాల పొడి, యాలకుల పొడి వేసి మరిగించి రాత్రి పడుకునే ముందు తాగాలి. దీంతో చలి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.

3. గుడ్లు ;

చలికాలంలో గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. గుడ్లు శరీరానికి అంతర్గత వేడి అందిస్తాయి. ఫలితంగా జలుబు, దగ్గు సమస్యలు తొలగిపోతాయి. గుడ్లు తినడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మజిల్స్ అభివృద్ధికి దోహదపడతాయి. ఎగ్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. శరీరంలోని అంగాలకు బలం చేకూరుస్తుంది. గుడ్లు రోజూ తినడం వల్ల శరీరంలో అంతర్గతంగా వేడి పెరుగుతుంది. గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి అనేది శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే పోషక పదార్ధాల వల్ల శరీరం పటిష్టంగా మారుతుంది.

వీటితోపాటు చలికాలంలో అల్లం ఎంతో మేలు చేస్తుంది. అల్లం ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. చలికాలంలో అల్లం టీ తాగడం వల్ల శరీరంలో చురుకుదనం వస్తుంది. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి. అల్లంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ ఫెక్షన్లు దరిచేరవు.