Indigestion : అజీర్ణ సమస్యలకు అద్భుతమైన చిట్కాలు..

పెరుగు తినడం కారణంగా మీరు అతిగా తిన్న ఆహారం అరిగిపోయేలా చేస్తుంది. తాజా పెరుగు తింటే మంచిది.

Indigestion : అజీర్ణ సమస్యలకు అద్భుతమైన చిట్కాలు..

Indigestion

Updated On : October 25, 2021 / 10:40 AM IST

Indigestion : ప్రస్తుత కాలంలో చాలామంది అజీర్ణ సమస్యలతో సతమతమవుతున్నారు. అజీర్తి, అజీర్ణం… పేరు ఏదైనా ఎక్కువమందిని వెంటాడుతున్న ఆరోగ్య సమస్య. మంచి ఆకలి మీద ఆహారాన్ని తీసుకున్నా… కొందరికి త్వరగా జీర్ణం కాదు. ఇలా జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. అందుకే జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న వాళ్లు… రోజూ తీసుకునే ఆహారంలో మార్పులు చేస్తే మంచిది. బిజీ లైఫ్ కారణంగా సరిగా తినకపోవడం మరియు ఇతర కారణాల వల్ల చాలామందికి సమస్యలు తలెత్తుతాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చును.

జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు పరగడుపున ఒకటి రెండు టీస్పూన్ల అల్లం రసం తీసుకుంటే మంచిది. అజీర్ణంతో పాటూ కడుపులో వికారం కూడా తగ్గిపోతుంది. అల్లం రసం తాగలేని వాళ్లు… కూరల్లో కలిపి తినొచ్చు. ప్రతిరోజూ పరగడుపున పుదీనా కొద్దీగా తీసుకుంటే చాలా ఆరోగ్యం. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు సెప్టిక్ గుణాలు ఉండటం కారణంగా మన జీర్ణ వ్యవస్థ సరిగా ఉంటుంది. అలాగే… జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి మజిల్స్ ను కూడా చాలా చాలా ఫ్రీ చేస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఉదయం పూట పుదీనా టీ తాగితే మంచిది.

పెరుగు తినడానికి చాలా మంది ఎక్కువగా ఇష్టపడరు. అయితే ప్రతి ఒక్కరు పెరుగు తినడం కారణంగా కడుపులో ఉండే సమస్యలన్నీ తగ్గుతాయి.  పెరుగు తినడం కారణంగా మీరు అతిగా తిన్న ఆహారం అరిగిపోయేలా చేస్తుంది. తాజా పెరుగు తింటే మంచిది. నిత్యం మనం పాలు వేడివేడిగా తాగుతాము. అయితే వీటిని ఇలా తాగకుండా చల్లటి పాలు తాగితే మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలకు పాల ద్వారా చెక్ పెట్టవచ్చు. పాలలో ఉండే కొన్ని పోషకాలు హైడ్రోక్లోరిక్ యాసిడ్ సెక్రిట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది.

ముడి బియ్యం, ఓట్స్, గోధుమలలాంటి తృణ ధాన్యాలతో జీర్ణ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వీటిలో ఉండే ఫైబర్… జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. అజీర్ణ సమస్యను తగ్గిస్తుంది. చాలామంది అన్నం తిన్న వెంటనే పడుకుంటారు. అయితే అలా చేయడం ముమ్మాటికి తప్పు. మనం అన్నం తిన్న తర్వాత కనీసం పదిహేను నిమిషాలపాటు నడవాలి. అలా నడవడం కారణంగా లోపల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం కాగలుగుతుంది. కాబట్టి ప్రతి రోజు అన్నం తిన్న తర్వాత నడవడం మంచిది.

రోజూ ఆహారంలో ఓ అరటి పండు తీసుకోవాలి. ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్ జీర్ణసమస్యలను దూరం చేస్తాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం పోతుంది. పాప్‌కార్న్ తీసుకున్నా మంచిదే. పాప్‌కార్న్‌లో ఉండే ఫైబర్… అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యలకు చెక్ పెడుతుంది.