Phone to the washroom : టాయిలెట్‌కి సెల్ ఫోన్ తీసుకెళ్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
సెల్ ఫోన్ చేతిలో లేకపోతే బుర్ర పనిచేయనంతగా అందరూ ఫోన్‌కి అడిక్ట్ అయిపోయారు. ఆఖరికి బాత్రూంకి వెళ్లినా చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే. టాయిలెట్‌లోకి సెల్ ఫోన్ తీసుకు వెళ్లడం ఎంత ప్రమాదమో తెలుసా?

Phone to the washroom
Phone to the washroom : ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి నైట్ నిద్రలోకి జారుకునే వరకూ చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే. అంతగా సెల్ ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. ఆఖరికి బాత్రూంకి వెళ్తున్నా సెల్ ఫోన్ చేతిలో వదలని వారున్నారు. టాయిలెల్‌కి వెళ్లేటపుడు సెల్ ఫోన్ వాడకం ఎంత ప్రమాదమో తెలుసా?
Leafy Vegetables : వర్షాకాలం ఆకు కూరలు తినడానికి సరైన సమయం కాదట
ఒకప్పుడు సెల్ ఫోన్ లేకపోయినా వ్యక్తులు తమ రోజూవారి కార్యకలాపాలు కొనసాగించేవారు. కానీ ఇప్పుడు ప్రతి సెకను చేతిలో సెల్ చూసుకోవాల్సిందే. ఆఖరికి బాత్రూంలోకి వెళ్లినా వెంట సెల్ ఫోన్ ఉండాల్సిందే. టాయిలెట్‌కి వెళ్తూ సెల్ ఫోన్ తీసుకెళ్లడం ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? గుర్గావ్‌లోని పరాస్ హాస్పిటల్స్‌లోని సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఆర్‌పి వెంకట కృష్ణన్ ప్రకారం మనలో చాలా మంది టాయిలెట్‌కి వెళ్తూ సెల్ వెంట తీసుకెళ్తాము. అలా తీసుకెళ్లడం ద్వారా మీ సెల్ ఫోన్‌కి సూక్ష్మక్రిములు అంటుకునే ప్రమాదం ఉంది. టాయిలెట్‌లో సీటు, పేపర్ రోల్, డోర్ నాబ్ ఇలా ప్రతి చోట సూక్ష్మక్రిములు ఉంటాయి. వాటివల్ల అతిసారం, ప్రేగు సంబంధ వ్యాధులు, యూరినల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందట.
వాష్ రూం నుంచి బయటకు వచ్చినపుడు మీ ఫోన్ ద్వారా సూక్ష్మక్రిములు ఇంట్లో ఉన్న వస్తువుల మీదకు క్యారీ అవుతాయి. అక్కడితో ఆగదు మీ ఫోన్ ఎక్కడికి వెళ్తే అక్కడకి ఈ జెర్మ్స్ క్యారీ అవుతాయి. ఇక టాయిలెట్‌లో నార్మల్ గా 10 నిముషాల మించి ఎవరు ఉండరు. సెల్ చేతిలో ఉండటంతో ఎక్కువ సమయం అక్కడ ఉంటారు. దాంతో అది మలబద్ధకానికి కారణమవుతుందట. ఎక్కువ సమయం కూర్చుని ఉండటం వల్ల ఒత్తిడికి గురవుతారు. టాయిలెట్‌కి వెళ్లిన ఆ కాస్త సమయంలో కూడా మెదడుకి బ్రేక్ ఇవ్వడం మిస్ అవుతుంది. ఎల్లప్పుడూ సెల్ మీదనే దృష్టి పెట్టడంతో అది మిమ్మల్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది.
Stay Fit During Monsoons : వర్షాకాలంలో ఫిట్‌గా ఉండేందుకు సహాయపడే ఆహారపు అలవాట్లు ఇవే !
ఫోన్‌ని వాష్‌రూమ్‌కి తీసుకెళ్లడం వల్ల సమయం ఆదా అవుతుంది అని మనలో చాలా మంది అనుకుంటారు, కానీ వాస్తవానికి ఇది సమయం వృధా అవుతుంది. ఐదు నిమిషాల్లో చేయగలిగేది చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక పొరపాటున ఫోన్ టాయిలెట్‌లో పడిపోతే మీ ఫోన్ పాడయ్యే ప్రమాదం కూడా ఉంది. మీ ఫోన్ యాక్సెస్‌ను కూడా కోల్పోతారు. ఏది ఏమైనా బాత్రూంకి వెళ్లే ఆ పది నిముషాల వ్యవధిలో ఫోన్‌కి బ్రేక్ ఇవ్వండి. సూక్ష్మక్రిములను ఫోన్ ద్వారా క్యారీ చేసి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకండి.