Happy Diwali 2023: : దీపావళి బాణసంచా కాల్చే సమయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు !

Diwali Safety Tips: బాణా సంచాల కాల్చే సమయంలో ముంస్తుగా ఒక బకెట్ తో నీళ్ళు సిద్ధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మంటలు వ్యాపించినప్పుడు వాటిని ఆర్పేందుకు నీరు అవసరమౌతుంది. మండే పదార్థాలకు దూరంగా బహిరంగ ప్రాంతాన్ని ఎంచుకోవాలి.

Diwali Precautions : దీపావళి పండుగంటేనే సరదాల పండుగగా చెప్పవచ్చు. విజయానికి ప్రతికగా ఆనందోత్సహాల మధ్య ఈ పండుగను చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు. అమావాస్య చీకట్లను పారద్రోలుతూ టపాసుల మోతలు, వెలుగులతో పండుగ సంబరాలను అంబరాన్ని అంటుతాయి. అనందంగా జరుపుకునే ఈ పండుగలో జాగ్రత్తలు పాటించటం కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవటం తప్పనిసరి.

READ ALSO : Muscle Cramps : రాత్రిసమయంలో కండరాల తిమ్మిరి,పట్టుకుపోవటం వంటి సమస్యలతో బాధపడుతున్నారా ? సమస్యను తగ్గించే అద్భుతమైన ఆహారాలు మీకోసం !

బాణసంచా కాల్చే సమయంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలు ;

1. బాణా సంచాల కాల్చే సమయంలో ముంస్తుగా ఒక బకెట్ తో నీళ్ళు సిద్ధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మంటలు వ్యాపించినప్పుడు వాటిని ఆర్పేందుకు నీరు అవసరమౌతుంది. మండే పదార్థాలకు దూరంగా బహిరంగ ప్రాంతాన్ని ఎంచుకోవాలి. బాణాసంచా కాల్చేటప్పుడు పిల్లలు వాటికి కొంచెం దూరంగా ఉండేలా చూసుకోవాలి.

2. మనం కాల్చే బాణా సంచా పర్యావరణ హితమైన పదార్ధాలతో తయారు చేసిన వై ఉండే విధంగా చూసుకోవాలి. లేదంటే వాటి వల్ల వెలువడే కాలుష్య కారకాలు మనతోపాటు, ఇతరులకు హానికలిగించే ప్రమాదం ఉంటుంది. అందుకే గ్రీన్ కాకర్స్ ను ఎంచుకోవటం మంచిది.

READ ALSO : Overthinking : అతిగా ఆలోచించే పరిస్ధితినుండి బయటపడేందుకు అనువైన మార్గాలు !

3. దీపావళి టపాసులు కాల్చే వారు వారు ధరించే దుస్తుల విషయం జాగ్రత్తలు పాటించాలి. సాధ్యమైనంత వరకు టీ షర్టులు, జీన్స్ వంటి దుస్తులు కాకుండా బాగా వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవటం మంచిది. క్రాకర్స్ పొడులు పడటకుండా కళ్ళకు అద్దాలి ధరించాలి.

4. పెద్ద పెద్ద బాణా సంచాలను కాల్చే సమయంలో చిన్నాల వెన్నంటే పెద్దలు ఉండటం మంచిది. పెద్దల సమక్షంలోనే వారు వాటిని కాల్చేలా చూసుకోవాలి. వారికి కావాల్సిన సహాయం పెద్దలు అందించాలి. ఒంటరిగా వదిలి వేసే ప్రయత్నం చేయొద్దు.

READ ALSO : Anti Aging Foods : వృద్ధాప్య ప్రభావం మీ మెదడుపై పడకుండా ఆరోగ్యంగా ఉంచడానికి 5 ఆహారాలు !

5. టపాసులు కాల్చే సమయంలో పాదరక్షలు ధరించాలి. ఏమైన గాయాలు అయితే వెంటనే సమీపంలోని వైద్యుల వద్దకు వెళ్ళి చికిత్స పొందాలి. నాణ్యతకలిగిన, లైసెన్సు కలిగిన దుకాణాల్లో మాత్రమే దీపావళి మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేయాలి.

6. బాణా సంచా కాల్చేసమయంలో ఒకరిని చూసి మరొకరు పొటీపడి కాల్చటం మంచిది కాదు . కొన్ని సందర్భాల్లో ఇలాంటివే ప్రమాదాలు చోటుచేసుకోవడానికి కారణంగా మారతాయి.

READ ALSO : Benefits of Makhanas : గుండె ఆరోగ్యం, మధుమేహ నియంత్రణలో మఖానాస్ తో కలిగే 10 అద్భుతమైన ప్రయోజనాలు

7. మద్యం సేవించి బాణా సంచా కాల్చరాదు. మద్యం సేవించడం వల్ల మెదడు సరిగ్గా కండిషన్ లో ఉండదు. ఆ సమయంలో టపాసులు కాలిస్తే.. ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంటుంది.

8. గాలు బాగా విస్తున్న సమయంలో టపాసులు కాల్చటం అంతమంచిది కాదు. ఎందుకంటే గాలి వీస్తున్న సమయంలో టపాసులు కాల్చితే నిప్పురవ్వలు సమీపంలోని గుడిసెలపై, గడ్డి వాములపై, ఇళ్ళపై పడి అగ్రిప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉంటుంది.

9. చర్మంపై నిప్పురవ్వలు పడినా, కాలిన గాయాలైన వైద్యుల వద్దకు వెళ్ళి చికిత్స పొందాలి. సొంతవైద్యం ఏమాత్రం మంచిది కాదని గుర్తుంచుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు