Overthinking : అతిగా ఆలోచించే పరిస్ధితినుండి బయటపడేందుకు అనువైన మార్గాలు !

మనం ఏసమయంలో ఏంచేయాలో ముందుగానే సమయం నిర్ధేశించుకోవాలి. కొన్నిసార్లు మెదడు కేవలం ఆలోచించాలని, విషయాలకు పరిష్కారాలను కనుగొనాలని కోరుకుంటుంది. అందుకోసం రోజులో ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి.

Overthinking : అతిగా ఆలోచించే పరిస్ధితినుండి బయటపడేందుకు అనువైన మార్గాలు !

overthinking

Overthinking : ఆందోళన,ఒత్తిడి తో ఉన్నప్పుడు, అతిగా ఆలోచించడం అనేది సర్వసాధారణం. ఇలాంటి పరిస్ధితి మనరోజువారి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదోఒక సందర్భంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. అతిగా ఆలోచించటాన్ని ఎలా నియంత్రించాలో చాలా మందికి అర్థం కాకపోవచ్చు. మనస్సులో పదేపదే మెదిలే విషయాలు ద్వారా అతిగా ఆలోచించటం అన్నది ప్రారంభం అవుతుంది.

READ ALSO : Pig Heart Transplant : పంది గుండె అమర్చిన రోగి మృతి.. ఆరు నెలల తర్వాత ఆర్గాన్ రిజెక్షన్

అతిగా ఆలోచించడం అన్నది మనిషిలో నిరుత్సాహన్ని కలిగిస్తుంది. ఇది అనేక మందిలో అపరిమితమైన ఒత్తిడి , ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిస్ధితిని ఎదుర్కోవటం అన్నది వాస్తవానికి చాలా క్లిష్టమైనది. అతిగా ఆలోచించటం అన్నది ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది. మానసిక ఆరోగ్యంపై దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. ఇలాంటి పరిస్ధితిని ఎదుర్కొనే వారు స్వీయ-అవగాహనతో ఆలోచనా విధానాన్ని మార్చుకోవటం కీలకం.

READ ALSO : CM KCR : కారు చీకట్లు.. ఏపీలో పరిస్థితులపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

అతిగా ఆలోచించటాన్ని తగ్గించే మార్గాలు ;

ఇతర పనులపై మనస్సును నిమగ్నం చేయటం : ఏదో ఒకపనిని ఎంచుకుని దానిపై మన దృష్టిని పూర్తిగా మళ్లించాలి. ఇది మన మనస్సును నిమగ్నం చేయడానికి సహాయపడుతుంది. మనల్ని పరధ్యానంలో పడకుండా , భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించకుండా చేస్తుంది. ఇందుకోసం అవసరమైతే కొత్త వంటకాలు నేర్చుకోవటం, వ్యాయామాలు చేయటం, పెయింటింగ్ వేయటం ఇలా పనులపై మనస్సును మళ్ళించుకోవాలి.

READ ALSO : వాట్సాప్ స్టేటస్‌లో వాయిస్ నోట్స్ పంపొచ్చు!

సమయం నిర్ధేశించుకోండి : మనం ఏసమయంలో ఏంచేయాలో ముందుగానే సమయం నిర్ధేశించుకోవాలి. కొన్నిసార్లు మెదడు కేవలం ఆలోచించాలని, విషయాలకు పరిష్కారాలను కనుగొనాలని కోరుకుంటుంది. అందుకోసం రోజులో ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి. మనం ముందుగా ఎంచుకున్న పనులు పూర్తి చేయటానికి సమయం నిర్ధేశించుకుని టైమర్ సెట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మెదడు ఆలోచనలు అన్నీ మన చేయాల్సిన పనులపై కేంద్రీకృతం చేసేందుకు అవకాశం ఉంటుంది.

READ ALSO : Heart Diseases : గుండె సంబంధిత వ్యాధులకు కారకాలు, నివారణ మార్గాలు !

శ్వాసప్రక్రియపై దృష్టి ; అతిగా ఆలోచించే వారు ప్రధానంగా శ్వాస ప్రక్రియపై సాధాన చేయాలి. కళ్ళు మూసుకుని గాఢంగా ఊపిరి పీల్చుకోవం..తిరిగి బయటకు వదలటం వంటి శ్వాస వ్యాయామాలు చేయాలి. ముక్కు ద్వారా గాల్చి పీల్చుకుని నోటి ద్వారా వదలటం, నోటి ద్వారా గాలి పీల్చుకుని ముక్కు ద్వారా వదలటం వంటివి అనుసరించాలి.

READ ALSO : Protect Heart Health : మధుమేహాం సమస్యతో బాధపడుతున్న వారు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏంచేయాలంటే !

వ్రాయటం : ఆలోచనలు విపరీతంగా పెరగినప్పుడు వాటి నుండి బయటపడేందుకు ఆసక్తి కరమైన విషయాలను చదవటం , వ్రాయటానికి ప్రయత్నించాలి. ఇలా చేయటం వల్ల మనస్సు తేలికగా మారుతుంది. అతిగా ఆలోచించే పరిస్ధితి నుండి బయటపడవచ్చు.

READ ALSO : Heart Health : ఎదుగుతున్న వయస్సు వారు తమ గుండె ఆరోగ్యాన్నిజీవితకాలం కాపాడుకోవటానికి వైద్యులు ఏంసూచిస్తున్నారంటే ?

శరీరంలో కదలికలు : వ్యాయామం చేయడం, నృత్యం చేయడం లేదా అవయవాలను కదిలించడం వంటివి చేయటం ద్వారా అనవసరమైన ఆలోచనల నుండి మనస్సు పక్కకు మళ్ళించవచ్చు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల్లో ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు,సలహాలు పొందగలరు.