కార్ కొనాలనుకుంటున్నారా.. అంతకుమించి రేట్ పెట్టొద్దు

అమెరికన్లకే కాదు.. ప్రజెంట్ జనరేషన్లో చాలా మందికి కార్లపై మోజు చాలా ఎక్కువ. అత్యంత ఖరీదైన ప్రోపర్టీల్లో ముందుగా ఇల్లు ఉంటే దాని తర్వాత కార్ ఉంటుంది. మరి కార్ కొనుగోలు చేయాలనుకునే వారికి బడ్జెట్ కు తగ్గట్లు ఏ కార్ బాగుంటుంది. ఎక్కువగా పెట్టుబడి కొనేస్తున్నామా అని చెక్ చేసుకున్నారా.. అసలు కార్ కొనడానికి ఎంత ఖర్చు పెట్టాలి. దాని కోసం ఎంత వెచ్చించాలనే దానిపై ఓ ఫైనాన్షియల్ అడ్వైజింగ్ ఎక్స్‌పర్ట్ ఏమంటున్నారో తెలుసా..
చాలాసార్లు మనం వాస్తవికతను దూరం పెట్టేసి కార్లు కొనుక్కుంటూ ఉంటాం. బడ్జెట్ కంటే ఎక్కువ వెచ్చించి కొనేస్తే ఆ తర్వాత గానీ, చూపించదు దాని ఎఫెక్ట్. ఇలాంటి కాస్ట్లీ మిస్టేక్ జరగకుండా ఉండేందుకు చేయాల్సిందేంటంటే.. ఉన్న పది రూల్స్ లో చివరిదేంటంటే.. ఎప్పుడూ కార్ కోసం కేటాయించే అమౌంట్ జీతంలో 10శాతానికి మించి ఉండకూడదట.
ఎందుకంటే.. కార్ ఖరీదు మాత్రమే మనం చెల్లించడం లేదు. మన బడ్జెట్ రేంజ్ ను మనమే తగ్గించేసుకుంటున్నాం. అది కాస్తా మన సేవింగ్స్ పై ఎఫెక్ట్ చూపెడుతుంది. మీ నెలసరి ఆధాయం 42వేల రూపాయలు అయితే అందులో కేవలం 4వేల 200 మాత్రమే ఖర్చు చేసుకోండి. ఒకవేళ 62వేల ఆదాయం వస్తుంటే అందులో నుంచి 6వేల 200మాత్రమే కార్ కొనేందుకు కేటాయించండి.
అలా ఎందుకు కేటాయించాలో తెలుసుకోవాలంటే ఈ విలువైన సలహాలు చదవాల్సిందే.
1. మెయింటెనెన్స్ తో పాటు ఇతర ఖర్చులు సేవింగ్స్ పై ఎఫెక్ట్ చూపిస్తాయి.
2. భవిష్యత్ లో లాభం తెచ్చిపెట్టే ఆస్తులపై అనుకున్నంత స్థాయిలో పెట్టుబడులు పెట్టలేం.
3. దీని గురించి ఆలోచిస్తూ చాలా ఒత్తిడి ఎదుర్కోవాలి.
4. ఇంకా కార్ కోసం అదనంగా పెట్టాల్సి వస్తుంది.
5. ప్రతి సారీ ఈఎమ్ఐ కట్టేటప్పుడు కడుతున్న అమౌంట్ చూసి సిగ్గేస్తుంది.
మీ వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని మీరే తలదన్నుకోకుండా ముందుగానే జాగ్రత్తగా ఉండండి. లగ్జరీ వెహికల్ తీసుకోవాలని అందరికీ ఉన్నా.. అందుబాటులో ఉన్న దానిని మాత్రమే ఎంచుకోండి.