Eating Is Good For Health : ఆహారం తీసుకునే సమయంలో కొన్ని నియమాలు పాటించటం ఆరోగ్యానికి మేలు!
మనం తినే ఆహారం మన శారీరక, మానసిక ఆరోగ్యాన్నిప్రభావితం చేస్తుంది. రుతువులకు తగినట్లుగా అందుబాటులో ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

Eating Is Good For Health :
Eating Is Good For Health : మనం ఆహారం తిసుకునేప్పుడు కొన్ని నియమాలు పాటించటం ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. ఆహారం తీసుకోవటంలో చేసే తప్పుల కారణంగా గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ , వాంతులు, కడుపునొప్పి వంటి సమస్యలకు దారితీస్తాయి. అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లతోపాటు తీసుకునే ఆహారంలో పోషకాలు లేకపోవటం, సరైన సమయ వేళలు పాటించక పోవటం కారణాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిపై రోజువారిగా శ్రధ్ధ చూపిస్తే ఆరోగ్య పరమైన సమస్యలను దరిచేరకుండా చూసుకోవచ్చు.
రోజువారిగా తీసుకునే పౌష్టికాహారం సరైన సమయంలో, తగిన పరిమాణంలో తీసుకోకపోతే ఆరోగ్యానికి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహారం తీసుకునేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కడుపు ఆరోగ్యంగా ఉండటంతోపాటు జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలను దూరంగా పెట్టవచ్చు.
1. నిద్రపోయే మూడు గంటల ముందుగా భోజనం చేయాలి. ఇలా చేయటం వల్ల నిద్రలో శరీరానికి, మెదడుకు విశ్రాంతి దొరకటంతో అవి పునరుత్తేజితం అవుతాయి. మన శరీరంలోని శక్తి మొత్తం జీర్ణక్రియకు కేటాయింపబడితే మెంటల్ హీలంగ్, ఫిజికల్ హీలింగ్ నిలిచిపోతుంది. అందుకే రాత్రిపూట నిద్రపోయే మూడు గంటల ముందే తేలికపాటి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
2. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మధ్యలో హెర్బల్ టీ తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. హెర్బల్‌టీ తాగితే చిరుతిండి తినాలన్న కోరిక తగ్గుతుంది. హెర్బల్‌టీ శరీరాని డీటాక్స్ చేస్తుంది. శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపుతుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. పగటి సమయంలో మన జీర్ణక్రియ వేగంగా పనిచేస్తుంది. భోజనం సమయంలో ఎక్కువగా తీసుకుంటే.. మన జీర్ణవ్యవస్థ తక్కువ శక్తితో పోషకాలను విచ్ఛిన్నం చేసి శరీరానికి అందిస్తుంది. కష్టంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను భోజనం సమయంలో తీసుకుంటే మంచిది.
3. మనం తినే ఆహారం మన శారీరక, మానసిక ఆరోగ్యాన్నిప్రభావితం చేస్తుంది. రుతువులకు తగినట్లుగా అందుబాటులో ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
4. నీటి పరిమాణం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నీటిని మరీ ఎక్కువ తాగొద్దు, అలాగనీ తక్కువ కూడా తాగొద్దు. తగినంత తాగాలి. ఉష్ణోగ్రత మార్పులు, వయస్సు, వైద్య పరిస్థితులు, శ్రమ ఆధారంగా నీటిని తీసుకోవాలి.
5. తినే ఆహారంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. పప్పులు, పనీర్, టోఫు, చికెన్, చేపలు లేదా మాంసం మొదలైన వాటిల్లో ప్రొటీన్లు పుష్కలంగా దొరుకుతాయి. గింజలు, పలుకులు, విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని రోజూ మితంగా తీసుకోవాలి.
6. ప్రాసెస్ చేసిన మైదా పిండికి బదులు తృణధాన్యాలు, మిల్లెట్లు, బ్రౌన్ రైస్ వంటి ధాన్యాలతో చేసిన పిండిని ఉపయోగించాలి. వీటిలో కార్బోహైడ్రేట్‌లు తక్కువ ఉంటాయి, ఫైబర్ ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి.