Weight Loss : ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు…ఈ పప్పు బెస్ట్!…
బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, ఈ పప్పు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పప్పులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది.

Moong Dal
Weight Loss : వేడివేడి అన్నం, పప్పు కూరలో కమ్మటి నెయ్యి వేసుకుని తింటే ఆరుచే వేరు. చాలా మంది ఆహారప్రియులు ఈ వంటకాలను చాలా ఇష్టంగా తింటారు. రోజు వారి ఆహారంలో పప్పులేనిదే చాలా మందికి ముద్ద తిగదు. ముఖ్యంగా కందిపప్పును ఎక్కవ మంది పప్పు తయారు చేసుకునేందుకు వాడుకుంటారు. అయితే మరి కొందరు మాత్ర కందిపప్పు తింటే బరువు పెరుగుతామన్న ఉద్దేశంతో దానిని తినేందుకు ఆసక్తి చూపించరు. అయితే బరువు తగ్గాలనుకునే వారికి పెసర పప్పుతో తయారుచేసిన పప్పు వంటకం మంచిదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. పెసరపప్పును ఆహారంలో చేర్చుకోవటం ద్వారా ఆరోగ్యంగా కిలోల కొద్దీ బరువు తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. దీనికి తోడు పెసరపప్పుతో పప్పు వంటకాన్ని సిద్ధం చేసుకోవటం కూడా చాలా సులభం కావటంతో పాటో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.
పెసరపప్పులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజాలు సైతం ఇందులో ఉన్నాయి. పెసరపప్పును ఆహారంలో చేర్చుకోవటం ద్వారా బరువుతగ్గటానికి మంచి సహాయకారిగా పనిచేస్తుంది. పెసరపప్పు తక్కువ కేలరీలను కలిగి ఉండటంతోపాటు తేలికగా జీర్ణమౌతుంది. మలబద్ధకం సమస్యకూడా ఉండదు. ఒక కప్పు (200 గ్రాములు) పెసరపప్పులో కేలరీలు 212, కొవ్వు 0.8 గ్రాములు, ప్రోటీన్ 14.2 గ్రాములు, పిండి పదార్థాలు 38.7 గ్రాములు, ఫైబర్ 15.4 గ్రాములు ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఫోలేట్, మాంగనీస్, విటమిన్ బి1, ఫాస్పరస్, ఐరన్, కాపర్, పొటాషియం మరియు జింక్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచటానికి , అవయవాల సామర్థ్యాన్ని బలోపేతం చేయటానికి సహాయపడతాయి.
అధిక ప్రొటీన్ ను కలగిన పెసరపప్పును బియ్యంతో కలిపితే మనిషి ఆరోగ్యానికి మరింత మేలు కలిగేలా చేస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారికి ఈ ప్రోటీన్ వినియోగం వల్ల కండరాల నిర్మాణం మెరుగవుతుంది. ఇందులోని ప్రోటీన్ అనేది మాక్రోన్యూట్రియెంట్, ఇది కండరాలను నిర్మించటంతోపాటు సన్నబడేందుకు దోహదపడుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఎక్కువ సమయం ఆకలిలేకుండా కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. శరీరం ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ఇతర పప్పులతో పోలిస్తే పెసరపప్పును ఉడికించడం చాలా సులభం. త్వరగా ఉడికించవచ్చు.
బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, ఈ పప్పు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ పప్పులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది. ఇందులో ఉండే ట్రేస్ మినరల్స్ చర్మం పై ముడతలు పడకుండా,యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి సహాయపడుతుంది. మధుమేహం ,అధిక రక్తపోటు ఉన్న రోగులు సైతం పెసర పప్పును తీసుకోవచ్చు.
పెసరపప్పును అన్నం, చపాతీలతో తినవచ్చు. అలాగే పెసరను మొలకెత్తించి ఆహారంలో తీసుకోవచ్చు. అలాగే భారతీయ వంటకాల్లో వివిధ రూపాల్లో ప్రస్తుతం పెసరపప్పును తీసుకుంటున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి పెసరపప్పు అనేది ఒక మంచి ఎంపికని చెప్పవచ్చు.