Gastric Cancer : కడుపులో ఇన్ఫెక్షన్ సమస్యలు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కు దారితీస్తాయా ?

గ్యాస్ట్రిక్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా వైద్యులు కొన్ని మందులను సిఫార్సు చేస్తారు. ఈ మందులు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించటంలో సహాయపడతాయి. క్యాన్సర్ సంబంధించి కణితిని తొలగించేందుకు కొన్ని సందర్భాల్లో వైద్యులు శస్త్రచికిత్సను సిఫార్సు చేస్తారు.

Gastric Cancer : కడుపు క్యాన్సర్ ను గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. మనదేశంలో అత్యంత సాధారణ క్యాన్సర్ లలో ఈ తరహా క్యాన్సర్ 4వస్ధానంలో ఉంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లో ప్రధానంగా నాలు రకాలు ఉన్నాయి. ఎడెనోక్యార్సినోమా, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ స్ట్రోమల్ ట్యూమర్స్, కార్సినోయిడ్ కణితులు, లింఫోమా వంటి రకాలు ఉన్నాయి.

READ ALSO : Cervical Cancer : గర్భాశయ క్యాన్సర్ ను ముందస్తు వ్యాక్సిన్ తో అరికట్టవచ్చా ?

గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కు కారణాలు ;

పొట్టలో అంతర్లీనంగా ఇన్ ఫెక్సణ్ ఉన్పప్పుడు క్యాన్సర్ కణాల పెరుగుదలకు దారితీస్తుంది. దీర్ఘకాలంలో యాసిడ్ ఫిప్లక్స్ సమస్య అజీర్ణం, కడుపునొప్పి సమస్యలు తలెత్తుతాయి. ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవటం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. కణాల డిఎన్ ఎలో మార్పుల వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యకు కారణవుతాయి.

సంకేతాలను ఎలా గుర్తించాలి ;

అజీర్ణం ; అజీర్ణం అనేది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలలో ఒకటి. బొడ్డు ఎగువ భాగంలో నొప్పి కనిపిస్తుంది. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వల్ల ఆహారం జీర్ణం కాదు. అజీర్ణం, కడుపు నొప్పి వంటి ఇతర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

READ ALSO : sweet potatoes health benefits : వీటిని తింటే క్యాన్సర్ తో సహా దీర్ఘకాలిక వ్యాధులనుండి రక్షణ పొందొచ్చు తెలుసా !

వాంతులు ; వాంతులు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సంకేతాలలో ఒకటి. అజీర్ణం ,బొడ్డు పైభాగంలో నొప్పి వల్ల వాంతలు అవుతాయి. తిన్న ఆహారం జీర్ణం కాక వాంతి రూపంలో శరీరం నుండి బయటికి వస్తుంది.

ఆహారంలో మింగటం ఇబ్బందులు ; అన్నవాహికలో వాపు కారణంగా ఆహారాన్ని తినటానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. జీర్ణం చేసుకోవటం కష్టంగా ఉంటుంది. మింగడంలో ఇబ్బంది కలుగుతుంది. కడుపులోని క్యాన్సర్ కణాల వల్ల కణితి ఏర్పడుతుంది.

ఇతర లక్షణాలు ;

గుండెల్లో మంట
బలహీనత
వికారం , అలసట
కడుపు ఉబ్బరం

READ ALSO : Pancreatic Cancer : ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఇవే !

గ్యాస్ట్రిక్స్ క్యాన్సర్ కు ప్రధాన కారకాలు ;

గ్యాస్ట్రిక్స్ సమస్యకు కారకాలు అనేది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. ధమపానం , పండ్లు, కూరగాయలను ఆహారంలో తక్కువగా తీసుకోవటం, కడుపులో హెలియోబాక్టర్ పైలోరి ఇన్ఫెక్షన్, దీర్గకాలికంగా యాసిడ్ రిప్లక్స్ , కుటుంబ చరిత్ర, అధారంగా గ్యాస్ట్రిక్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ుంటాయి.

చికిత్స ;

గ్యాస్ట్రిక్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా వైద్యులు కొన్ని మందులను సిఫార్సు చేస్తారు. ఈ మందులు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించటంలో సహాయపడతాయి. క్యాన్సర్ సంబంధించి కణితిని తొలగించేందుకు కొన్ని సందర్భాల్లో వైద్యులు శస్త్రచికిత్సను సిఫార్సు చేస్తారు. అవసరమైతే కిమోథెరపీ వంటి విధానాలను అనుసరిస్తారు.

READ ALSO : Air Pollution : వాయు కాలుష్యం వల్ల హార్ట్ పేషెంట్, లంగ్ క్యాన్సర్ , బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో ఎక్కువగా ఇబ్బంది పడేది ఎవరంటే?

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం అందించటమైనది. కేవలం అవగాహాన కోసం మాత్రమే . ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు