Gongura : చలికాలంలో శరీరానికి వేడిని అందించే గోంగూర ! అంతేకాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు

జీర్ణశయ ఆరోగ్యాన్ని ధి కాపాడుతుంది. పేగుల కదలికను పెంచుతుంది. దీనిలో పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచటానికి ఉపకరిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరచటానికి ఇందులో ఉండే మెగ్నీషియం సహాయపడుతుంది.

Gongura : చలికాలంలో శరీరానికి వేడిని అందించే గోంగూర ! అంతేకాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Gongura

Updated On : December 17, 2022 / 5:59 PM IST

Gongura : పులుపు, వగరుతో మంచి రుచికరంగా ఉండే గోంగూర తెలుగు వారికి ఎంతో ప్రియమైనది. అరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలను ఇది అందిస్తుంది. పప్పుతోపాటు, మాంసాహారాలతో కలిపి దీనిని వండుకుని తినవచ్చు. దేనితో కలిపి తీసుకున్నా దీని యొక్క ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి.

గోంగూరతో ఆరోగ్య ప్రయోజనాలు ;

గోంగూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కంటి జబ్బులు దరిచేరకుండా చేసే విటమిన్ ఏ దీనిలో అధికంగా ఉంటుంది. కంటి చూపును గోంగూర దీర్ఘకాలంపాటు పదిలాగా ఉంచుతుంది. దీనికల్లా మీరు చేయాల్సింది వారంలో రెండు సార్లు గోంగూరను వివిధ రూపాల్లో తీసుకోవటమే.

గోంగూరలో ఐరన్ అధిక మోతాదులో ఉండటం వల్ల రక్తహీనత సమస్యను పోగొట్టటంలో దోహదపడుతుంది. అనీమియా సమస్యతో బాధపడుతున్న వారు దీనిని ఔషదంగా బావించవచ్చు. దీనిలో పిండి పదార్ధాలు అధికంగానే ఉంటాయి.

జీర్ణశయ ఆరోగ్యాన్ని ధి కాపాడుతుంది. పేగుల కదలికను పెంచుతుంది. దీనిలో పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచటానికి ఉపకరిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరచటానికి ఇందులో ఉండే మెగ్నీషియం సహాయపడుతుంది.

జుట్టు ఆరోగ్యానికి గోంగూర ఎంతో మంచిది. శరీరంలో చెడు కొవ్వులు పేరుకు పోకుండా చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో గోంగూరను తీసుకోవటం వల్ల శరీరంలో వేడిపుడుతుంది. తద్వారా చలి నుండి రక్షణ పొందవచ్చు.

గోంగూరను వారంలో రెండు సార్లు తీసుకోవటం వల్ల ఎముకలు పఠిష్టంగా ఉంటాయి. పెళుసుగా మారటం నివారించవచ్చు. దగ్గు ఆయాసం, సమస్యలు ఉన్న వారు గోంగూర తీసుకోవటం వల్ల వాటి నుండి బయటపడవచ్చు.