Hair Loss : జట్టురాలే సమస్యా?…చర్మవ్యాధి నిపుణుల సూచనలు ఇవే…

జుట్టును బిగుతుగా, ఎత్తైన పొనీటెయిల్స్ స్ట్రైల్స్ లో కట్టుకోవటం ఏమాత్రం సరైంది కాదు. ఇలా చేయటం వల్ల జుట్టుకు రాపిడి పెరుగుతుంది.

Hair Loss : జట్టురాలే సమస్యా?…చర్మవ్యాధి నిపుణుల సూచనలు ఇవే…

Befunky Photo (1)

Updated On : February 16, 2022 / 4:43 PM IST

Hair Loss : జుట్టు రాలిపోవటం అన్నది సాధారణ సమస్య…ఇది చాలా మందిలో కనిపిస్తుంది. ఈ సమస్యను మగవారు పెద్దగా పట్టించుకోక పోయిన ఆడవారు మాత్రం జుట్టురాలిపోతుందంటే ఎంతో ఆందోళన చెందుతారు. జుట్టు ఊడిపోకుండా కాపాడుకునేందుకు అనేక చిట్కాలను ఫాలో అవుతుంటారు. అయితే జుట్టు రాలే సమస్య పరిష్కారానికి ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా కొన్ని సూచనలను, చిట్కాలను తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు.

రోజుకు 50 నుండి 100 వెంట్రుకలు రాలిపోవటం అన్నది సర్వసాధారణమని ఆమె చెబుతున్నారు. అయితే అంతకంటే అధికంగా వెంట్రుకలు రాలిపోతుంటే మాత్రం జుట్టుకు తీవ్రమైన నష్టం జరుగుతున్నట్లుగా భావించాలని సూచించారు. తన వద్దకు జుట్టు రాలే సమస్యలతో వచ్చే మహిళలను పరిశీలించిన మీదట డాక్టర్ గుప్తా జుట్టు రాలడాన్ని నియంత్రించటానికి నిపుణులచే ఆమోదించబడ్డ చిట్కాలను సూచిస్తున్నారు. జుట్టు రాలే సమస్య ఉత్పన్నమైన సందర్భంలో వైద్యులు సిబిసి, విటమిన్ డి3, బిఆర్2 వంటి పలు రక్తపరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షా ఫలితాల ద్వారా జుట్టురాలటానికి కారణాలను కనుగొనవచ్చు. అధిక మొత్తంలో జుట్టు రాలటాన్ని నిలువరించటానికి కొన్ని పాటించాల్సిన అవసరం ఉంది.

జుట్టును బిగుతుగా, ఎత్తైన పొనీటెయిల్స్ స్ట్రైల్స్ లో కట్టుకోవటం ఏమాత్రం సరైంది కాదు. ఇలా చేయటం వల్ల జుట్టుకు రాపిడి పెరుగుతుంది. అదే క్రమంలో బిగుతుగా ఉండటం వల్ల జుట్టు అధికంగా రాలిపోయేందుకు అవకాశం ఉంటుంది. జుట్టు కట్టుకోవాల్సి వస్తే సిల్క్ పిల్లో కవర్ ని ఉపయోగించాలి. ఇలా చేయటం వల్ల జుట్టు రాపిడి తగ్గటంతోపాటు జుట్టు చిట్ల కుండా ఉంటుంది.

జుట్టుకు వివిధ రకాల స్టైల్స్ తో కూడిన ఎయిర్ బాండ్స్ వాడరాదు. అలాగే జుట్టు మెరుపుకోసం, తెల్లబడ్డ వెంట్రుకలను నల్లబర్చేందుకు వివిధ రకాల కెమికల్స్ తో తయారైన వాటిని అప్లై చేయటం నిలుపుదల చేయాలి. జుట్టుకు అనువైన, శ్రేయస్కరమైన షాపులను, కండీషనర్లను మాత్రమే వినియోగించాలి. ఒత్తిడి లేని జీవనశైలి, రాత్రి ప్రశాంతమైన నిద్ర జుట్టు రాలే సమస్యను తగ్గించటానికి సహాయపడతాయి.

https://www.instagram.com/reel/CZJxeIFI1lG/?utm_source=ig_web_copy_link