Eating Spicy Foods : కారం అధికంగా ఉండే ఆహారలు తిని ఇబ్బందులు పడుతున్నారా? ఈ చిట్కాలు అనుసరిస్తే..

అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం తిప్పలు తప్పవు. కారంతోపాటు మ‌సాలాలు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటే క‌డుపులో అల‌జ‌డి మొద‌ల‌వుతుంది. విరేచ‌నాలు అవుతాయి. తీవ్ర‌మైన మంట క‌లుగుతుంది.

Eating Spicy Foods : కారం అధికంగా ఉండే ఆహారలు తిని ఇబ్బందులు పడుతున్నారా? ఈ చిట్కాలు అనుసరిస్తే..

Having trouble eating spicy foods? If these tips are followed..

Eating Spicy Foods : రోజువారి ఆహారంగా తీసుకునే కూరల్లో కారం అధికంగా ఉంటే చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడుపులో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి. కొంత మంది కారం తక్కువ మోతాదులో ఉండే ఆహారాలను ఇష్టపడితే మరి కొందరు మాత్రం కారం అధికంగా ఉండే స్పైసీ ఆహారాలను తీసుకుంటుంటారు. కారం మంట లేకపోతే కొంత మందికి అసలు ముద్దే దిగదు. తక్కువ మోతాదులో కారాన్ని వాడే వారు కొన్ని సందర్భాల్లో కారం ఎక్కవగా ఉన్న ఆహారాలు తిని గ్యాస్, అజీర్తి, మంట వంటి సమస్యలను చవిచూస్తుంటారు.

అయితే మిర‌ప‌కాయ‌ల్లో ఉండే క్యాప్సెయిసిన్ స‌మ్మేళ‌నం అధిక బ‌రువు త‌గ్గించ‌డంలో తోడ్పడుతుంది. అలాగే వాపుల‌ను కూడా తగ్గిస్తుంది. త‌ల‌నొప్పి, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు కారం తింటే ఆయా నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం తిప్పలు తప్పవు. కారంతోపాటు మ‌సాలాలు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటే క‌డుపులో అల‌జ‌డి మొద‌ల‌వుతుంది. విరేచ‌నాలు అవుతాయి. తీవ్ర‌మైన మంట క‌లుగుతుంది.

కారం క‌లిగించే ఈ ఇబ్బందుల‌ను సుల‌భంగా తొల‌గించుకోవటానికి కొన్ని చిట్కాలు అనుసరిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కారం ఎక్కువగా తిన్నవారు ఆమ్ల స్వ‌భావం క‌లిగిన నిమ్మ‌, నారింజ‌, స్ట్రాబెర్రీ, పైనాపిల్ వంటి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల కూడా కారం ప్ర‌భావం త‌గ్గుతుంది. కారం వ‌ల్ల కలిగే ఇబ్బందుల‌ను తొల‌గించేందుకు పాలు అమోఘంగా ప‌నిచేస్తాయి. అయితే వెన్న తీయ‌ని హోల్ మిల్క్‌ను తాగాలి. గోరు వెచ్చ‌గా ఉన్న పాల‌ను తాగ‌డం వ‌ల్ల క‌డుపులో కారం వ‌ల్ల క‌లిగే అల‌జ‌డి త‌గ్గుతుంది. ఎండుకారంలో ఉండే క్యాప్సెయిసిన్‌ను పాలు త‌ట‌స్థ పరుస్తాయి. కారం వ‌ల్ల ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయి. కారం తిన్న‌త‌రువాత ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఐస్‌క్రీమ్‌ను కూడా తీసుకోవ‌చ్చు.అలాగే ఒక టీస్పూన్ చ‌క్కెర లేదా 2 టీస్పూన్ల తేనె తీసుకోంటే మంట తగ్గుతుంది.