Egg Benefits : రోజు వారి ఆహారంలో గుడ్డును చేర్చుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మంచి కంటిచూపుకు, ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన “ఎ” విటమిన్లు గుడ్డులో అధికంగా ఉన్నాయి. మంచి ఆకలిని పుట్టించడానికి, ఆరోగ్యదాయక నరాల సత్తువకు అవసరమైన విటమిన్‌ బి సముదాయమంతా గుడ్డులో ఉంది.

Egg Benefits : ప్రకృతి ప్రసాదించిన అత్యంత పోషక విలువలు కలిగిన కల్తీలేని అహారం కోడిగుడ్డు. సహజ సిద్ధంగా ప్యాక్‌ చేయబడిన స్వచ్ఛమైన కోడిగుడ్డు నందు ఎంతో విలువైన విటమిన్లు, కార్పోహైడ్రేట్స్‌, మినరల్స్‌, అమినోయాసిడ్స్‌ లభిస్తాయి. వీటిలో 13 శాతం మాంసకృత్తులు, 10-12 శాతం కొవ్వు పదార్థాలు, విటమిన్‌-ఎ, వి-1, వి-2, బి-8, బి-5, బి-6, బి-12 మరియు డి విటమిన్లు కలవు. విటమిన్‌-డి కోడిగుడ్లలో మాత్రమే లభిస్తుంది.

READ ALSO : Diabetes : మధుమేహ నియంత్రణకు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?..

గుడ్లు తింటే వేడి చేస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. ఏ కాలంలోనైనా, ఏ వయసు వారైనా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, బాలింతలు, అనారోగ్యం నుండి కోలుకుంటున్నవారు తీసుకోదగిన బలవర్ధక ఆహారం కోడిగుడ్డు. క్రమం తప్పకుండా గుడ్డు వాడేవారు వైద్యుల వద్దకు వెళ్ళే అవసరం కలుగదు. ఇన్ని రకాలుగా కోడిగుడ్డు అనేక పోషక విలువలు కలిగి అతి చౌకగా దొరికే సమతుల్య ఆహారం.

గుడ్డు దాని పోషక విలువలు :

ప్రొటీన్లు:

అత్యుత్తమ శ్రేణికి చెందిన ప్రొటీన్లు ఒక్కొక్క గుడ్డులో 7 గ్రాములు ఉంటాయి. వీటిలో పెరుగుదలకు అవసరమైన 8 అవినో యాసిడ్లు ఉన్నాయి. చిన్న పిల్లలకు అవి చాలా అవసరం. గర్భిణీ స్త్రీలకు గుడ్డలోని ప్రొటీన్లు చాలా అవసరం. కడుపులోని బిడ్డ పెరుగుదలకు తోడ్పడతాయి. తల్లికి గర్భాశయం, పాలిండ్లు, జఠయువు, ఇతర నిల్వలను వృద్ధి చేస్తాయి.

READ ALSO : Black Rice : బ్లాక్ రైస్ ను ఆహారంగా తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్స్:

మంచి కంటిచూపుకు, ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన “ఎ” విటమిన్లు గుడ్డులో అధికంగా ఉన్నాయి. మంచి ఆకలిని పుట్టించడానికి, ఆరోగ్యదాయక నరాల సత్తువకు అవసరమైన విటమిన్‌ బి సముదాయమంతా గుడ్డులో ఉంది. బలమైన దంతాలకు, ఎముకలకు అవసరమైన విటమిన్‌ “డి” కూడా
గుడ్డులో ఉంది.

ఖనిజాలు :

మాననిక, శారీరక శక్తి సామర్థ్యాలకు మూలం శారీరక రసాయనికాలు, గుడ్డులో 11 ఖనిజాలు లభ్యమౌతాయి. మెదడును, నరాలను ఉత్తేజపరచే భాస్వరం (ఫాస్పరస్‌), ఆరోగ్యకరమైన రక్తం, మంచి శ్వాసకు అవసరమైన ఇనుము (ఐరన్‌), కాల్షియం, సోడియం, క్లోరిన్‌, పొటాషియం, సల్ఫర్‌ (గంధకం), మెన్నీషియం, జింక్‌, రాగి ఇంకా అయోడిన్‌ వంటివి మన దేహం సర్వ సామాన్యంగా పనిచేసేందుకు కావలసినవి ఎన్నో ఇందులో ఉన్నాయి.

కొవ్వువదార్థాలు :

ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి వారికి కొంత కొవ్వు ఉండాలి. సిఫారసు చేసిన గరిష్ట వరిమితిలో గుడ్డు నుండి లభించే కొవ్వు పదార్ధం ఆరు శాతం మాత్రమే ఉంటుంది. గుడ్డు సులభంగా అరిగిపోయి, ఆహారంలో ముఖ్యభాగంగా తోడ్పడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకూ, అనారోగ్యానికి గురై కోలుకుంటున్న వారికి, వృద్ధులకు గుడ్డు బాగా ఉపకరిస్తుంది.

READ ALSO : Daily salt intake : ఆహారంలో ఉప్పు వినియోగం అధికమైతే అనర్ధాలు తప్పవా ?

గుడ్డు – పాలలోని పోషక విలువల్లో పోలిక :

సమగ్ర పోషక విలువలు కలిగిన ఆహారానికి ఉదాహరణంగా పాలను పేర్కొంటున్నారు. ఈ కారణాలవల్లనే శిశువులు సాంప్రదాయ ఆహారాన్ని తీసుకునేందుకు సిద్ధమయ్యేవరకు వారికి పాలను ఇవ్వడం ద్వారా వారి జీవనానికి ఆధారంగా ఉపయోగిస్తున్నారు. అదే విధంగా ప్రకృతి ప్రసాదించిన పోషక పదార్థాల్లో కోడిగుడ్డు కూడా ఒకటి. ఎదుగుతున్న శిశువుకు మొత్తం జీవన విధానానికి కూడా గుడ్డు ఉపయోగపడుతుంది.

రెండు పెద్ద గుడ్లలో 160 కాలరీలు లేదా ఒక మహిళ సగటున సమకూర్చుకునే కాలరీల్లో 9 శాతం కోడిగుడ్ల ద్వారానే లభిస్తుంది. అదే నమయంలో మనిషికి రోజుకు అవసరమైన ప్రోటీన్‌, విటమిన్‌-ఎ, రిబోఫ్లావిన్‌, ఇనుము, విటమిన్‌-డి, ఫాలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి-12, ఫాస్ఫరస్‌, అయోడిన్‌, పాంటోధినిక్‌ యాసిడ్‌లలో 9 శాతానికి పైగా గుడ్డు ద్వారానే లభ్యమవుతుంది. ఈ కారణాల వల్ల గుడ్లు పోషక పదార్థాలతో నిండిన ఆహారంగా పేర్కొనవచ్చు. బడ్జెట్‌ పరంగా కూడా గుడ్లు అందరికీ అందుబాటులో ఉండే పోషకాహారమే.

READ ALSO : Fish Food : చేపలకు ఆహారంగా గుమ్మడికాయలు

గుడ్డులో లభించే విటమిన్‌-డి వల్ల కలిగే లాభాలు :

ఎముకల వ్యాధిని నివారించుకోవచ్చు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ని తగ్గిస్తుంది. చర్మ సంబంధ వ్యాధులను నివారిస్తుంది. వయసు పెరగడం వల్ల చర్మంలో వచ్చే మార్పులను నివారిస్తుంది. సూర్యకాంతిని నేరుగా చూడవచ్చు.

లివర్‌, కిడ్నీ వ్యాధుల నుండి కాపాడుతుంది. చిన్న పిల్లల్లో గర్భిణీ స్త్రీలలో ఎముకల పటిష్టతకు దోహదపడుతుంది. హై కొలస్ట్రాల్‌ క్యాన్సర్‌, గుండె జబ్బుల నుండి రక్షణ పొందవచ్చు. వయసు పై బడిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆహారంలో గుడ్డు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.

 

ట్రెండింగ్ వార్తలు