హోండా సిబి350 వచ్చేసింది: బుల్లెట్, జావా, బెనల్లీకి దెబ్బపడినట్లేనా?

Honda H’ness CB350 VS Bullet, Jawa, Benelli: 350సిసి బైక్ సెగ్మెంట్‌ని కింగ్‌లా ఏలుతున్న royal enfield classic 350ను దెబ్బతీయడానికి చాలాకాలంగా చాలా కంపెనీలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇదో పెద్దమార్కెట్. యూత్ మెచ్చిన మార్కెట్.
లెటేస్ట్‌గా మిడ్‌సైజ్ 350-500cc సెగ్మెంట్‌లోకి ఎంటరైంది హోండా. న్యూబ్రాండ్ H’ness – CB350 లాంచ్ చేసింది. 350 సిసి పవర్, 4స్ట్రోక్ ఎయిర్‌కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో ఈ క్రూయిజ్ బైక్ మార్కెట్‌లోకి వచ్చింది. ఒక విధంగా హోండా లేటు ఎంట్రీ. అయినా torque of 30 Nm@3000 rpmతో ఈ సెగ్మెంట్ లోనే టాప్ పవర్‌ను ఇస్తోంది. exhaust note సూపర్. యూత్ నచ్చే బిటింగ్. ఇక Exhaust pipes డబుల్ స్కిన్డ్. అందువల్ల విజువల్ అపీల్ ఏళ్లకొద్ది అలాగే ఉంటుంది. కలర్ మారదు.
హ్యాండిల్ బార్స్, సస్సెన్షన్, లార్జ్‌వీల్స్‌తో H’ness, CB350 ఫ్యూయల్ టాంక్ డబుల్ టోన్‌తో హోండా వారసత్వాన్ని కొనసాగించింది. ఇక 7Y షేప్ స్పోక్‌వీల్ మోడర్న్ లుక్ నిచ్చింది. ఇండియన్ మెంటాలిటీకి తగ్గట్టుగా క్రోమ్ కోటింగ్ ఎక్కువగా వాడింది.
H’ness – CB350 రెండు వేరియంట్స్‌లో వస్తోంది. CB350 DLX, CB350 DLX PRO. ఈ హోండా క్రూయిజర్ రేటు రూ. 1.90 లక్షలు (ఎక్స్ షోరూమ్) H’ness CB350 Deluxe Pro రేటు ఇంకాస్త ఎక్కువ.
Royal Enfield CLASSIC 350 ఇండస్ట్రీ లీడర్. పదేళ్లుగా తిరుగులేదు. హోండా రాకతో సెగ్మెంట్‌లో కాంపిటేషన్ మొదలైంది.
Royal Enfield:
సింగిల్ సిలండర్, 4స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్oled engine
పవర్: 346 సీసీ
5స్పీడ్ గేర్ బాక్స్
ఫ్రంట్ సస్పెన్షన్ టెలిస్కోపిక్
JAVA 42:
కొత్తతరంకోసం ఆనాటి Jawa 42 మళ్లీ మార్కెట్లోకి వచ్చింది.
ధర: 1.65 లక్షలు
ఇంజిన్: 293సీసీ
సింగిల్ సిలండర్, 4 స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్
Benelli 400:
Benelli కొత్త బైక్ Imperiale 400 100 కిలోమీటర్ల స్పీడులోనూ స్మూత్ రైడింగ్ ఎక్స్ పీరీయన్స్ ఇవ్వగలదు. ఈ Imperiale 400 సింగిల్ సిలండర్, ఫోర్ స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పవర్ ఇస్తుంది. ఇన్ ఫీల్డ్ కన్నా లాంగ్ వీల్ బేస్, గ్రౌండ్ క్లియరన్స్ ఎక్కువ. బైక్‌కున్న double cradle frameతో పాతికేళ్లయినా దిట్టంగా ఉంటే బైక్ అన్న పేరుతెచ్చుకుంది. క్రోమ్, రెట్రోస్టైల్ హెడ్ లైట్స్‌తో సూపర్‌గా కనిపిస్తుంది. కాకపోతే ఫ్యూయల్ ట్యాంక్ చిన్నది.
వచ్చేది పండగ సీజన్. అందుకే కంపెనీలన్నీ కొత్త బైక్‌లతో మార్కెటను నింపేయనున్నాయి.