Hangover : హ్యాంగోవర్ ను తగ్గించే తేనె!
అతిగా మద్యం సేవించటం వల్ల అనేక అసౌకర్య లక్షణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిని హ్యాంగోవర్ గా పిలుస్తారు. తలనొప్పి, వికారం, మైకం, వంటి లక్షణాలు హ్యాంగోవర్ స్ధితిలో కనిపిస్తాయి. తేనె శరీరంలోని చక్కెరను జీవక్రియకు అందించడం ద్వారా ఆల్కహాల్‌ను వేగంగా శోషించేందుకు సహాయపడుతుంది.

Hangover (1)
Hangover : ఆరోగ్యవంతమైన ఆహారాలలో తేనె ముఖ్యమైనది. తేనెలో ఎన్నో ఔషద విలువలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యంలో తేనెకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తేనెలో సహజ చక్కెరలు లభిస్తాయి. తేనెలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ స్ధాయిలో ఉంటుంది. సాధారణ కార్బోహైడ్రేట్లతోపాటు తీపిదనాన్ని ఇచ్చే ఫ్రూక్టోజ్ ను కలిగి ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులకు తేనె చక్కని ఔషదంగా పనిచేస్తుంది. తేనెలో ఉండే ఫాలిఫెనోల్స్ గుండె వ్యాధుల చికిత్సలో ఉపయోగకరంగా ఉంటాయని అధ్యయనాల్లో తేలింది.
రక్తపోటును తగ్గించటంలో సైతం ఇది బాగా ఉపకరిస్తుంది. జీర్ణశయ సమస్యలను తగ్గించటం, అతిసారాన్ని నివారించటంలో సహాయపడుతుంది. బ్యాక్టీరియా కారణంగా వచ్చే అంటు రోగాలను నివారించటంలో తోడ్పడుతుంది. కాలిన గాయాలను నయం చేయటంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది. తేనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉబ్బసం ఉన్నవారిలో వాపును తగ్గిస్తుంది. మధుమేహుల్లో తేనె వాడకం వల్ల ఇన్సులిన్ స్ధాయిలని పెంచి రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలను తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది.
ఇదిలా వుంటే ముఖ్యంగా మద్యం తాగే అలవాటు ఉన్నవారికి తేనె ఎంతో సహాయకారిగా ఉపయోగపడుతుంది. అతిగా మద్యం సేవించటం వల్ల అనేక అసౌకర్య లక్షణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిని హ్యాంగోవర్ గా పిలుస్తారు. తలనొప్పి, వికారం, మైకం, వంటి లక్షణాలు హ్యాంగోవర్ స్ధితిలో కనిపిస్తాయి. తేనె శరీరంలోని చక్కెరను జీవక్రియకు అందించడం ద్వారా ఆల్కహాల్‌ను వేగంగా శోషించేందుకు సహాయపడుతుంది.
తేనెను తీసుకోవడం ద్వారా ఇందులో ఉండే సహజ స్వీటెనర్, హ్యాంగోవర్ యొక్క విష ప్రభావాలను ఎదుర్కోవటానికి సహాయపడుతుందని అధ్యయనాల్లో సైతం తేలింది. తేనెలోని ఫ్రక్టోజ్ శరీరానికి ఆల్కహాల్‌ను హానిచేయని ఉప ఉత్పత్తులుగా విభజించడంలో సహాయపడుతుంది. ఆల్కహాల్‌ను ఎదుర్కోవటానికి శరీరానికి సహాయపడుతుంది. దీంతో త్వరగా హ్యాంగోవర్ పరిస్ధితి నుండి బయటపడవచ్చు.