Prostate Gland : మూత్రపిండాలను పనితీరు ఎలాగంటే? ప్రొస్టేట్ గ్రంధి వాపుతో ఉన్న వారు కూర్చుని మూత్రమే మూత్రం పోసుకోవాలా?
ప్రొస్టేట్ గ్రంథి వాపుతో బాధపడుతున్న వారు మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కూర్చుని మూత్రం పోస్తే ఉపశమనం లభిస్తుందని, కూర్చోవడం ద్వారా విసర్జననాళంలో మూత్ర ప్రవాహం సాఫీగా సాగుతుందని ఒక అధ్యయనంలో స్పష్టమైంది.

How are the kidneys functioning? Should people with prostate gland swelling sit and urinate?
Prostate Gland : శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, మూత్రపిండాలు ఎల్లప్పుడూ పనిచేసేలా చూసుకోవాలి. శరీరంలోని ఎలెక్ట్రోలైట్లు మరియు పోషకాలను సమతుల్యతతో ఉంచడమే కాకుండా, మరెన్నో పనులను మూత్ర పిండాలు సమర్ధవంతంగా నిర్వహిస్తాయి. మూత్రపిండాలు కీలకమైన పని రక్తాన్ని నిరంతరం శుద్ధి చేయటం. ఆ వడపోత ప్రక్రియలో విడుదలయ్యే వ్యర్థ పదార్థాన్ని మూత్రంగా పిలుస్తారు. మూత్రం మూత్రాశయం లో నిల్వ ఉంటుంది. దీని సామర్ధ్యం 300 మి.లీ నుంచి 600 మి.లీ దాకా ఉంటుంది. మూడింట రెండొంతులు నిండగానే మనం దానిని ఖాళీ చేయాలన్న సంకేతాలు మెదడునుండి నాడుల ద్వారా అందుతాయి. బ్లాడర్‌ను పూర్తిగా ఖాళీ చేయాలంటే మనలో నాడుల నియంత్రణ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. అప్పుడే, టాయిలెట్‌కు ఏసమయంలో వెళ్ళాలో అన్న సంకేతాలు మనకు అందుతాయమి. టాయిలెట్ దగ్గరలో లేనప్పుడు మూత్రాన్ని ఆపుకునేందుకు వీలుకలుగుతుంది. మూత్ర విసర్జించేందుకు టాయిలెట్‌కు వెళ్లగానే మూత్రాశయం కండరాలు ముడుచుకుంటాయి. అప్పుడు అందులోని మూత్రం విసర్జననాళం ద్వారా బయటకు వచ్చేస్తుంది.
ప్రొస్టేట్ గ్రంధి వ్యాపుతో బాధపడుతుంటే ;
ప్రొస్టేట్ గ్రంథి వాపుతో బాధపడుతున్న వారు మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కూర్చుని మూత్రం పోస్తే ఉపశమనం లభిస్తుందని, కూర్చోవడం ద్వారా విసర్జననాళంలో మూత్ర ప్రవాహం సాఫీగా సాగుతుందని ఒక అధ్యయనంలో స్పష్టమైంది. ప్రోస్టేట్ సమస్యతో బాధపడుతున్న పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేసే సమయంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు.
అదే క్రమంలో కూర్చున్నప్పుడు మూత్రనాళాల్లో ఒత్తిడి తగ్గి చాలా సౌకర్యవంతంగా, త్వరగా మూత్ర విసర్జన చేయగలుగుతున్నారని ఆ పరిశీలనలో నిర్ధారణైంది. ఆరోగ్య వంతులైన పురుషులు నిలబడినా, కూర్చున్నా పెద్దగా తేడాను వారు గమనించలేదు. మూత్ర విసర్జన సమస్యలున్న పురుషులు కూర్చుని మూత్రం పోసేందుకు సౌకర్యవంతంగా, ప్రశాంతంగా ఉండే టాయిలెట్లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.