Cholesterol : రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదు ఏ స్ధాయికి చేరితే ప్రమాదకరం?
శరీరంలోపల ఉండే కాలేయం కొంత కొవ్వులను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలోని కణాలు ఆరోగ్యంగా ఉండటానికి , హార్మోన్ల తయారీకి జీర్ణప్రక్రియకు అవసరమైన పైత్యరసం ఉత్పత్తికి కొలెస్ట్రాల్ ఉపయోగపడుతుంది.

Man's Hand Holding Excessive Belly Fat, Overweight Concept.
Cholesterol : శరీరానికి కొలెస్ట్రాల్ అన్నది ఎంతో అవసరం. అయితే చాలా మంది దీనిని హానికలిగించేదిగా భావిస్తారు. వాస్తవానికి ఒక రకమైన కొవ్వుపదార్ధము వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. మనం తీసుకునే కొన్ని రకాల ఆహారాల ద్వారా కొలెస్ట్రాల్ శరీరానికి అందుతుండగా, అయితే శరీరంలోపల ఉండే కాలేయం కొంత కొవ్వులను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలోని కణాలు ఆరోగ్యంగా ఉండటానికి , హార్మోన్ల తయారీకి జీర్ణప్రక్రియకు అవసరమైన పైత్యరసం ఉత్పత్తికి కొలెస్ట్రాల్ ఉపయోగపడుతుంది. అయితే రక్తంలో కొలెస్ట్రాల్ అన్నది తగిన మోతాదులో మాత్రమే ఉండాలి. రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోమని వైద్యులు సూచిస్తుంటారు.
కొలెస్ట్రాల్ శరీరంలో ఎంత స్ధాయిలో ఉండాలి ;
టోటల్ కొలెస్టిరాల్ :200 మి.గా% వరకు ఉండటం ఆరోగ్యానికి మంచిది. 200 – 239 % కొంతవరకు రిస్క్ ,240 – కంటే ఎక్కువగా ఉంటే హై రిస్క్ గా చెప్పవచ్చు.
ఎల్ డీఎల్ : 100 లోపు ఉండటం మంచిది ,100-129 ఉండవచ్చు ,130-159కొంతవరకు రిస్క్ ,160అంతకంటె ఎక్కువగా ఉంటే హై రిస్క్,
హెచ్ డీఎల్ : 50 మి.గ్రా% ఉండటం మంచిది ,50- 35 కొద్దిగా రిస్క్ ,35 కంటే తక్కువ ఉంటే హై రిస్క్ గా పరిగణిస్తారు. ఈ సమయంలో గుండె జబ్బులు వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది.