osteoporosis
Osteoporosis : ఎముకల్లో సమస్యలు తలెత్తితే తగిన మూల్యం చెల్లించక తప్పదు. కచ్చితంగా ఆరోగ్య సంరక్షణ కోసం నిపుణుల సలహా తీసుకోవాలి. కానీ అంతకుముందు ఈ సమస్య ఎలా తలెత్తుతుందో గమనించాలి.
READ ALSO : Black Rice : బ్లాక్ రైస్ ను ఆహారంగా తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వయసు పెరుగుతున్నా కొద్దీ ఎముకలు బలహీనపడుతుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే వయసుతో పని లేకుండా ఈ మధ్య కాలంలో ఎముకల సాంద్రతలో క్షీణత కనపడుతున్నది. ఎముకల్లో పగుళ్లకు దారి తీస్తున్నది. అందుకే ముందుగా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
తరుచుగా ఫ్రాక్చర్స్ :
బలహీనమైన ఎముకలు ఉంటే మామూలుగా కింద పడ్డా ఎముకల్లో పగుళ్లు ఏర్పడుతాయి. అంటే ఫ్రాక్చర్స్ అవుతాయన్నమాట. చిన్న ప్రమాదాలే పెద్ద సమస్యను తెచ్చి పెడుతాయి. అవి నయం కావడానికి కూడా చాలా సమయం పట్టొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉంటూనే డాక్టర్ ని తప్పక సంప్రదించాలి.
READ ALSO : Fish Food : చేపలకు ఆహారంగా గుమ్మడికాయలు
ఎత్తు తగ్గడం :
మీకు తెలియకుండా మీరు ఎత్తు తగ్గుతున్నారా? ఒకసారి బాగా గమనించుకోండి. ఎత్తు క్రమంగా తగ్గుతుంటే ఎముక పెళుసుదనానికి సూచికగా అర్థం చేసుకోవాలి. ఎముక సాంద్రత క్షీణించడం వల్ల వెన్నెముక కుదించబడుతుంది. దీనివల్ల మీరు పొట్టిగా అవ్వచ్చు. లేదా మీ శరీరంలోనే తెలియని మార్పు సంభవించవచ్చు.
నడుము నొప్పి :
తరుచుగా వెన్ను నొప్పి వస్తుంటే మీ ఎముకలు బలహీనంగా ఉన్నట్టే అని గుర్తించండి. ముఖ్యంగా వీపు మధ్య లేదా దిగువ ప్రాంతంలో నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి వెన్నెముక బలహీనపడడానికి సంకేతం అన్నమాట. కాస్త కదిలిన నొప్పి కలుగుతుంది. అందుకే సకాలంలో దీనికి తగిన ట్రీట్ మెంట్ తీసుకోవాలి.
READ ALSO : World Tribal Day 2023 : ఆదివాసీల ఆహారంలో ఎర్ర చీమల చట్నీ..
పెళుసు గోర్లు :
మన గోర్లు ఎముకల ఆరోగ్యం గురించి మనకు సమాచారం అందిస్తుందంటే నమ్మశక్యంగా లేదు కదా! కానీ ఇది నిజం. గోర్లు పెళుసుగా ఉన్నాయంటే మనలో కాల్షియం, విటమిన్ డి వంటి ఖనిజాలు తక్కువగా ఉన్నట్లు సూచన. అవి తక్కువ ఉన్నాయంటే ఎముకలు కూడా బలహీనపడ్డట్లే. కాబట్టి మీ గోర్లను చూసినప్పుడైనా అప్రమత్తంగా ఉండాలి. పోషకారలను తప్పకుండా మీ మెనూలో చేర్చుకోవాలి.
నిటారుగా నిలబడలేక:
నిలుచున్నప్పుడు నిటారుగా మనిషి కనడపడతాడు. అలాకాకుండా మీ శరీరాకృతి తేడాగా ఉంటే మీ ఎముకలు బలహీనంగా ఉండి వెన్నెముక అమరికను దెబ్బతీస్తాయి. దీనివల్ల మీ ఆకృతిలో మార్పులను వేగవంతం చేస్తాయి. కోర్ కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయడం వల్ల ఎముకల పై ఒత్తిడిని తగ్గించవచ్చు.
READ ALSO : Nutritious Food : చర్మ సహజ కాంతిని కోల్పోతున్నారా? అయితే పోషకవిలువలు కలిగిన ఆహారం తీసుకోవటం బెటర్ !
పట్టు కోల్పోవడం :
ఏదైనా పట్టుకుంటే పట్టు లేకుండా జారిపోవడం జరుగుతుంటుంది. ఇది మణికట్టులోని ఎముకలు బలహీనపడడాన్ని సూచిస్తుంది. వృద్ధాప్యం వల్ల కూడా కొన్నిసార్లు పట్టు కోల్పోవడం జరుగుతుంటుంది. ఆ సమయంలో కండరాల బలహీనత కారణం కావచ్చు. ఏది ఏమైనా ఏ వయసు వారైనా వ్యాయామాలు చేస్తే ఎముకల్లో బలాన్ని పెంచుకోవచ్చు.
ఇవి కాకుండా.. కాల్షియం, విటమిన్ పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామాలు చేయాలి. ధూమపానం, మద్యపానం వంటి హానికారకమైన అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇలా చేసినప్పుడు మీరు కలకాలం సంతోషంగా, ఆరోగ్యంగా జీవించగలరు.