Summer : వేసవిలో చర్మాన్ని తేమగా, జిడ్డు లేకుండా ఉంచటమెలా?
వేసవి కాలంలో మాయిశ్చరైజర్స్ కి దూరంగా ఉండటం మంచిది. జిడ్డు చర్మ కలవారు మాయిశ్చరైజర్స్ వాడటం వల్ల ముఖం మీద ఉన్న మొటిమల సమస్య మరింత ఎక్కువ అవుతుంది.

Summer
Summer : వేసవిలో సూర్యుడి ప్రతాపం చర్మంపై అధికంగా ఉంటుంది. అధిక వేడి వల్ల చర్మం పొడిబారి పోవటం, జిడ్డుగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. శరీరంలో తగినంత నీరు లేకపోవటం వల్ల కూడా ఈ తరహా పరిస్ధితులు ఏర్పడుతుంటాయి. వేసవి వేడి నుండి చర్మాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా కొన్ని చర్మ సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
తేనె,రోజ్ వాటర్ ; తేనె, పెరుగు, రోజ్ వాటర్ సమపాళ్లలో కలుపుని ముఖంపై ప్యాక్ గా వేసుకోవాలి. 15 నిమిషాలపాటు అలాగే ఉంచి ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల చర్మంపై పొడి తొలగి తేమ అందుతుంది. అంతే కాకుండా చర్మానికి చల్లదనం కలుగుతుంది. జిడ్డు రాకుండా వేసవి ఎండ నుండి రక్షణ కల్పిస్తుంది.
ఓట్స్, బాదం ప్యాక్ ; పది బాదంపప్పులను రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టి వాటిని ఉదయాన్ని ముద్దలా మెత్తగా చేసుకోవాలి. ఈ ముద్దకు ఒక చెంచా ఓట్స్, ఒక చెంచా తేనె, పెరుగు కలపాలి. దాన్ని ముఖం మీద అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయటం వల్ల చర్మం మీద పేరుకున్న అదనపు జిడ్డు తొలగిపోతుంది. బాదం చర్మానికి తేమను అందిస్తుంది.
బొప్పాయి, అరటి ప్యాక్ ; బొప్పాయి, అరటి గుజ్జును తగిన మోతాదులో తీసుకోవాలి. దానికి కొద్దిగా తేనెను చేర్చి ముఖానికి మూసుకోవాలి. 15నిమిషాలు అలాగే ఉంచిన తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మంపై జిడ్డు తొలగిపోతుంది. చర్మం కాంతి వంతంగా, మృధువుగా మారుతుందడి.
టమాటా, ఓట్స్ ; టమాటాలో కాస్త ఓట్స్ కలిపి మిక్స్ చేసిన మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసి 15 నిమిషాలు తర్వాత శుభ్రపరచాలి. జిడ్డు చర్మం ఉన్నవారికి టమోటాలు బాగా ఉపయోగపడతాయి. టమోటాని సగానికి కోసి ముఖనికి చేతులకు రుద్ది పావు గంట తర్వాత కడిగేయాలి. చర్మం శుభ్రపడుతుంది బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. చర్మ రంద్రాలు శుభ్రపడతాయి.
ముల్తానీ మట్టి, ద్రాక్ష ; ద్రాక్షపళ్ల రసంలో ముల్తానీమట్టి కలిపి ప్యాక్‌లా వేసుకుని, అరగంట తర్వాత కడిగేసుకుంటే జిడ్డుదనం పోతుంది.
వేసవి కాలంలో మాయిశ్చరైజర్స్ కి దూరంగా ఉండటం మంచిది. జిడ్డు చర్మ కలవారు మాయిశ్చరైజర్స్ వాడటం వల్ల ముఖం మీద ఉన్న మొటిమల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. వేసవిలో మాయిశ్చరైజర్స్ వాడకపోవడమే మంచిది.