Goal : లక్ష్యసాధనలో అవరోధాలను అధిగమించటం ఎలాగంటే!…

మితిమీరిన కోపావేశాలు, అలజడుల ప్రకంపణలు మానశిక వ్యధలకి ,ఒక్కోసారి తీవ్రమైన తలనొప్పులకి, ప్రతిసారి బ్లడ్ ప్రెషర్ లెవెల్సు పెరగడానికి కారణం అవుతాయి.

Goal : లక్ష్యసాధనలో అవరోధాలను అధిగమించటం ఎలాగంటే!…

Target

Updated On : November 19, 2021 / 1:17 PM IST

Goal : ప్రతిఒక్కరికి జీవితంలో ఏదో సాధించాలన్న కోరిక,. తన తోటి వారికంటే ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోరిక ఉండటం సహజం. అయితే వాటిని అందుకునే క్రమంలో అనే అవరోధాలు, అవాంతరాలు ఎదురవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో చాలా మంది సమయస్పూర్తితో వ్యవహరించలేకపోవటం, వివిధ రకాల సమస్యల్లో చిక్కుకు పోవటంతో వారి ఆశలు, ఆశయాలు కలగానే మిగిలిపోతాయి.

ఇలాంటి సందర్భాల్లో అనేక మందిలో విచక్షణ, వివక్షణ, విజ్ఞతలు లోపిస్తాయి.. సృజనాత్మకత, భావుకతలపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఇలాంటి సందర్భాల్లో శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులు తలెత్తుతుంటాయి. చివరకు ఆనారోగ్యాలు తెచ్చిపెడుతుంటాయి. ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ జీవన పయనంలో సగభాగం నిద్రకి, మిగిలిన సగభాగంలో ఓ అర్ధ భాగం కోపంతోనే నేస్తం సాగిస్తున్నారు అని గణాంకాలు చెబుతున్నాయి. ఇది జీర్ణవ్యవస్థని, అంతర్గత వ్యవస్థలని బలహీన పరుస్తుంది. అల్సర్, కండరాల వాపులకి గురిచేస్తుంది.

మితిమీరిన కోపావేశాలు, అలజడుల ప్రకంపణలు మానసిక ఇబ్బందులకు కారణమౌతుంది. ఒక్కోసారి తీవ్రమైన తలనొప్పులకి, ప్రతిసారి బ్లడ్ ప్రెషర్ లెవెల్సు  పెరిగుతాయి.. వ్యాధినిరొధక వ్యవస్థని, బలహీనం చేస్తుంది. తరచుగా జలుబు, రొంప, మలబద్దకం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగని కోపావేశాలను, మదిలోని అలజడులను నీలో నీవే అదుపు చేసుకుంటే అది మనస్సుపై ప్రతికూల ప్రభావాన్నిచవిచూడాల్సి వస్తుంది.

కోపాన్ని, ఆవేశాలను పాజిటివ్ ఎనెర్జీస్ గా మలచుకోగలిగే సామర్ధ్యాన్ని మీరు పెంపొదించుకుంటే ఇక సాధించబోయే ఫలితాలు మిమ్మలని ఈ పోటి ప్రపంచంలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఆక్షేపణలు, అభిప్రాయాలను అవసరమైన సందర్బాలలో మృదుభాషణలోతప్పక తెలియజేయాలి, అప్పుడే అనుకున్నది సాధించడానికి వీలు అవుతుంది, అలా చేయకపొతే ముభావిగా మిగిలి పోయె ప్రమాదం ఉంది. పంచుకుంటే పెరిగేది, తరగనిది జ్ఞాపకాలా తీపి గుర్తులు. చిరకాల బాల్యమిత్రులను కలవటమో, ఫోన్ లో మాట్లాడటమో చేసి ఆనాటి మధూరానుభూతులను నెమరువేసుకోండి. అది మీకు మంచి రిలీఫ్ ని ఇస్తూ ప్రొయాక్టివ్ గా వుంచుతుంది.

సామర్ధ్యాన్ని సొంతం చేసుకోవడానికి మీ లోని అంతర్గత శక్తులని ప్రేరేపించాలి, వాటిని లక్ష్యదిశగా కేంద్రీకరంచి ముండడుగు వేయాలి. ఆండుకోసం సానుకూల భావనలతో చూడడం మొదలెట్టాలి. ఒకేసారి మల్టీ టాస్కులు తీసుకోవడం స్ట్రేస్సుని పెంచడానికి కారణం అవ్యుతుంది. అందుకే టాస్కులని ప్రయారిటీ పరంగా విభజించుకోవాలి. మనం తరచుగా టైం దొరకడం లేదు అనే మాట వింటుంటాము , అయితే మీరు మీకు తెలీకుండానే గంటలతరబడి టివీచూడడం లేదా ఇంటెర్ నెట్ బ్రౌజ్ చేయడం అలవాటు చేసుకొని ఉంటే ఆ వ్యసనాన్ని తగ్గించుకొని అందులో కొద్దిపాటి టైం డైలీ ఫ్యామిలి మెంబర్సుతో సరదాగా గడపండి.