Diabetes In Children : పిల్లల్లో టైప్ 2 డయాబెటిస్ ను అధిగమించటం ఎలా?
తక్కువ కొవ్వు ఉండే సలాడ్‌లు, సూప్‌లు తినేలా పిల్లలను ప్రోత్సహించాలి. వైట్ షుగర్, క్యాండీలు, చాక్లెట్లు, షుగర్ ఫుడ్స్ తినటం మానుకోవాలి. ఆపిల్, పియర్, బొప్పాయి, కస్తూరి పుచ్చకాయ, నారింజ, జామ, నిమ్మ, దానిమ్మ వంటి పండ్లు, గింజలు తినాలి.

Type 2 Diabetes In Children
Diabetes In Children : ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో మధుమేహ వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరుగుతుంది. పెద్ద వయస్సు వారితోపాటు, పిల్లల్లు సైతం దీని బారిన పడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, చక్కెర అధికంగా ఉండే ఆహారం, శారీరక శ్రమలేకపోవటం చిన్నవయస్సు పిల్లలు టైప్ 2 డయాబెటీస్ బారిన పడుతున్నారు. కొన్ని రకాల చిట్కాలు పాటించటం ద్వారా పిల్లలు టైప్ 2 డయాబెటిస్ ను సులభంగా అధికమించవచ్చు.
పిల్లలు తమ రోజు వారి ఆహారంలో ఆరోగ్యకరమైన పోషకమైన ఆహారాన్ని తీసుకునేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. బ్రెడ్, బిస్కెట్లు, కుకీలు, కేకులు మరియు మిఠాయి వంటి తెల్లటి పిండితో తయారు చేసిన ఉత్పత్తులను పిల్లలకు అందిచకుండా ఉండాలి. మాంసకృత్తులు, విటమిన్లు, మినరల్స్ , ఫైబర్ అధికమొత్తంలో లభించే ఆహారాలను పిల్లలకు ఇవ్వాలి. పాలకూర, బ్రోకలీ, మెంతి ఆకులు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కాలే, టొమాటో, ఓక్రా, సీసా పొట్లకాయ, చేదు పొట్లకాయ, క్యాప్సికం, పుట్టగొడుగులు, బఠానీలు, వంటి తాజా ఆకుకూరలు, కూరగాయలు తినేలా చూడాలి.
తక్కువ కొవ్వు ఉండే సలాడ్‌లు, సూప్‌లు తినేలా పిల్లలను ప్రోత్సహించాలి. వైట్ షుగర్, క్యాండీలు, చాక్లెట్లు, షుగర్ ఫుడ్స్ తినటం మానుకోవాలి. ఆపిల్, పియర్, బొప్పాయి, కస్తూరి పుచ్చకాయ, నారింజ, జామ, నిమ్మ, దానిమ్మ వంటి పండ్లు, గింజలు తినాలి. డీప్ ఫ్రైడ్ ఫుడ్‌లను నివారించండి. ప్రతిరోజూ కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం, యోగా, వ్యాయామం వంటివి చేయటం అలవాటుగా చేసుకోవాలి. ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలి వల్ల మధుమేహాన్ని పిల్లల దరిచేరకుండా చూడవచ్చు.