Ice Cubes : వేసవిలో చర్మ సౌందర్యానికి ఐస్ క్యూబ్స్!
కొందరు ఎక్కువ సమయం నిద్రపోయినా, లేదంటే రకరకాల కారణాల వల్ల కళ్లు ఉబ్బిపోతాయి. అలాంటి వారు ఐసుముక్కల్ని జిప్‌లాక్ బ్యాగుల్లో ఉంచి కళ్ల మీద పెట్టుకోవాలి. కళ్లకు హాయిగా అనిపిస్తుంది. అలర్జీలూ దూరమవుతాయి.

Ice Cubes
Ice Cubes : ఐస్ క్యూబ్స్‌తో ఎన్నో లాభాలు ఉన్నాయి. వేసవి వచ్చిందంటే పండ్ల రసాల్లో వేసేందుకు ఫ్రిజ్‌లో ఐసుముక్కల్ని ఉంచుతారు. వేసవిలో సౌందర్యపోషణకు ఫ్రిజ్ లో ఉంచే ఐస్ క్యూబ్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్న విషయం చాలా మందికి తెలియదు. కళ్ళచుట్టూ నల్లని వలయాలుంటే ఐస్ క్యూబ్స్ తో సత్వర ఫలితాన్ని పొందవచ్చు. ముందుగా రెండుచెంచాల పుదీనా పేస్టు, నాలుగుచెంచాల పాలను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ట్రేల్లో పోసి డీప్ ఫ్రీజర్ లో పెట్టాలి. ఐస్ క్యూబ్స్ తయారైన తర్వాత దానిని తీసి ప్రతిరోజూ కళ్ళచుట్టూ మెల్లగా రాసుకోవాలి. ఇలా కనీసం ఓ వారం చేస్తే నల్లని వలయాలు మాయమైపోతాయి.
నీటిలో తాజారోజ్ వాటర్ కలిపి ఐస్ క్యూబ్ లను తయారు చేసుకోవాలి. ఈ రోజ్ వాటర్ ఐస్ క్యూబ్ లకు పోడిచేనసిన కర్పూరాన్ని కలిపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమలు ఇట్టే పోతాయి. మొటిమలు వేడి వాతావరణంలో చాలా మంటగా, నొప్పిగా అనిపిస్ధాయి. దీన్నుంచి తక్షణ ఉపశమనం పొందాలంటే పొడి వస్త్రంలో ఐసు ముక్కల్ని ఉంచి మొటిమలు ఉన్న ప్రాంతంలో అద్దాలి. ఇలా ఓ పదినిమిషాలు చేయడం వల్ల హాయిగా అనిపిస్తుంది. మొటిమలు త్వరగా తగ్గిపోతాయి.
డీప్ ప్రీజర్ లో ఉంచిన తాజా పళ్లరసం, పుల్లని పెరుగు, లేదా ఏదైనా వెజిటబుల్ నూనెను ముఖం అంతా రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి స్కిన్ టోనర్లుగా పనిచేస్తాయి. చర్మగ్రంథులు పెద్దగా కావడం, చర్మం సాగడం ఉండటం లాంటి సమస్యలు కొంతమందిని ఇబ్బంది పెడతాయి. ఇలాంటివారు ఐసుముక్కలను ముఖంపై రుద్దుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది. సున్నిత చర్మం ఉన్నవారికి ఈ కాలంలో చాలా సమస్యలుంటాయి. చర్మం కందిపోయినట్టు అయితే ఆ ప్రాంతంలో పొడి తువాలులో ఐసు ముక్కల్ని ఉంచి అద్దితే సమస్య దూరమవుతుంది. రక్తప్రసరణ సక్రమంగా అంది చర్మం నిగారింపునూ సంతరించుకుంటుంది.
కొందరు ఎక్కువ సమయం నిద్రపోయినా, లేదంటే రకరకాల కారణాల వల్ల కళ్లు ఉబ్బిపోతాయి. అలాంటి వారు ఐసుముక్కల్ని జిప్‌లాక్ బ్యాగుల్లో ఉంచి కళ్ల మీద పెట్టుకోవాలి. కళ్లకు హాయిగా అనిపిస్తుంది. అలర్జీలూ తొలగిపోతాయి. తరచూ ప్రయాణాలు చేసేవారి ముఖం అలసటగా ఉంటుంది. అలాంటి వారు ఐసుముక్కలతో ముఖంపై రుద్దుకోవాలి. చల్లదనం అలసటని దూరం చేస్తుంది. చర్మం పునరుత్తేజితమౌతుంది.
తరచూ ఐబ్రోస్ చేయించుకుంటున్నా ఆప్రాంతంలో నొప్పి వస్తుంది. అలాంటి వారు ఐబ్రోస్ చేయించుకునే ముందు కనుబొమల వద్ద ఐసుముక్కలో రుద్ది చూడండి. నొప్పి అనిపించదు. చర్మం కందిపోదు. వయసు పెరిగేకొద్దీ ముఖంలో ముడతలు మొదలవుతాయి. అవి పెరగకుండా ఉండాలంటే ఐసు ముక్కల్ని ముడతలున్న చోట మర్దన చేసుకుంటే చాలు చర్మం మృదువుగా మారుతుంది. మురికీ, కాలుష్యం కారణంగా ముఖం జిడ్డుగా మారితే ఐసుముకల్ని మర్దన చేస్తున్నట్లుగా ముఖమంతా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పరిశుభ్రంగా మారడమే కాదు, మృదువుగానూ కనిపిస్తుంది.
ఐస్‌క్యూబ్‌కు మరిన్ని సహజసిద్ధ పదార్థాలను కలిపి ఫ్రీజ్ చేస్తే ముఖారవిందానికి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. మరుగుతున్న కప్పు నీళ్లలో రెండు చెంచాల కాఫీ పొడిని వేసి బాగా మరగనిచ్చి దింపేయాలి. చల్లార్చి ఐస్ ట్రేలో నింపి ఫ్రీజ్ చేస్తే కాఫీ క్యూబ్స్ సిద్ధం. ఇవి ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. గుప్పెడు తులసి ఆకులకు కప్పు నీటిని కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో రెండు చెంచాల కలబంద గుజ్జు వేసి బాగా కలిపి ఐస్ ట్రేలో నింపి ఫ్రీజ్ చేసుకోవాలి. ఈ ఐస్‌క్యూబ్‌తో చేసే మర్దనా యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి ముఖంపై మచ్చలను తొలగిస్తుంది.
కప్పునీటిలో చెంచా మెత్తగా చేసి ఉంచుకున్న దాల్చిన చెక్క పొడిని కలిపి ఐస్ క్యూబ్స్‌లా చేసుకోవాలి. దీంతో ముఖంపై మసాజ్ చేసి గంట తర్వాత శుభ్రపరుచుకుంటే చాలు. చర్మం ఆరోగ్యంగా మారుతుంది. రెండు గ్రీన్‌టీ బ్యాగులను మరిగే కప్పు నీటిలో వేయాలి. చల్లారిన తర్వాత క్యూబ్స్‌గా చేసుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ముఖంపై వృద్ధాప్య ఛాయలను, మొటిమలను, కంటిచుట్టూ నల్లని వలయాలను దూరం చేస్తాయి.