Drinking Water : మంచినీరు త్రాగే సమయంలో ఈ నియమాలు పాటించకుంటే…..

కూర్చుని నీరు తాగటం వల్ల శరీరం నీటి సక్రమంగా గ్రహించేందుకు అవకాశం ఉంటుంది. ప్రతిరోజు 8గ్లాసులు లేదా ఆయుర్వేద నిపుణులు చెబుతున్నప్రకారం 2.50 లీటర్ల నీటిని తాగటం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

Drinking Water : మంచినీరు త్రాగే సమయంలో ఈ నియమాలు పాటించకుంటే…..

Water

Updated On : August 12, 2021 / 12:09 PM IST

Drinking Water : మనిషి జీవనానికి నీరు చాలా ముఖ్యమైనది. ఆరోగ్యరక్షణకు నీరు ఎంతగానో దోహదపడుతుంది. ఆహారం తిన్నతరువాత, దాహం వేస్తున్న సమయంలో మంచినీటిని తాగుతాం. నీటిని తాగే సమయంలో కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలా మంది నీరు తాగే సమయంలో నిలబడి నీళ్ళు తాగుతారు. మరికొందరు పడుకుని నీళ్ళు తాగుతారు. ఇంకొందరు కూర్చొని నీళ్ళు తాగుతారు. ఇలా వివిధ రకాల పద్దతుల్లో నీళ్ళు తాగుతుంటారు.

నీరుతాగే విధానంలో సరైన పద్దతి పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిలబడి , పడుకుని నీళ్ళు తాగే విధానం ఏమాత్రం మంచిది కాదు. నీటిని కూర్చుని మాత్రమే తాగాలి. కొందరు వేగంగా నీరు సేవించేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా చేయటం వల్ల ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. నీటిని కూర్చుని మెల్లిగా గుక్క గుక్క తాగుతూ ఉంటే ఆరోగ్యానికి ఎంతగానో మేలు కలుగుతుంది.

కూర్చుని నీరు తాగటం వల్ల శరీరం నీటిని సక్రమంగా గ్రహించేందుకు అవకాశం ఉంటుంది. ప్రతిరోజు 8గ్లాసులు లేదా ఆయుర్వేద నిపుణులు చెబుతున్నప్రకారం 2.50 లీటర్ల నీటిని తాగటం ఆరోగ్యానికి శ్రేయస్కరం. గోరువెచ్చగా ఉన్న నీటినే తీసుకోవాలి. కూలింగ్ వాటర్ ను తాగటం అంతశ్రేయస్కరం కాదు. కూలింగ్ వాటర్ ను తాగటం వల్ల అనేక రకాల అజీర్ణం, గ్యాస్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.

నీరు తగినంత మోతాదులో తీసుకోకుంటే జీర్ణసంబంధిత సమస్యలతోపాటు, తలనొప్పి సమస్య వస్తుంది. బోజనం చేయటానికి 45 నిమిషాల ముందు, బోజనం చేశాక 45 నిమిషాల తరువాత నీరు సేవిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. బోజనం చేస్తున్న మధ్యలో నీటిని తాగటం వల్ల జీర్ణరసాలకు ఆటంకం ఏర్పడి గ్యాస్, అజీర్ణ సమస్యలు ఉత్పన్నమౌతాయి.