Green Apple : అనారోగ్య సమస్యలు ఆమడదూరం… గ్రీన్ ఆపిల్ తో…
గ్రీన్ ఆపిల్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల జీవక్రియలు మెరుగై ప్రేగు వ్యవస్ధలు శుభ్రపడి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇనుము, రాగి, జింక్, మాంగనీస్ , పొటాషియం వంటి ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Green Apple
Green Apple : గ్రీన్ ఆపిల్ ఆరోగ్యవంతమైన పండ్లలో ఒకటిగా చెప్పవచ్చు. ఆకుపచ్చ రంగులో ఉండే ఈ ఆపిల్ లో ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. పుల్లిని, తియ్యని రుచి కలిగి ఉండే ఈ ఆపిల్ ను చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ తినేందుకు ఇష్టపడుతుంటారు. ప్రతిరోజు మన రోజువారి ఆహారంలో ఒక గ్రీన్ ఆపల్ పండును బాగం చేసుకుంటే అనేక రకాల రోగాలు మనదరి చేరకుండా చూసుకోవచ్చు.
గ్రీన్ ఆపిల్ పండులో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు జీర్ణ వ్యవస్ధలోపాలను సరిదిద్దటంలో తోడ్పడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ ను కరిగించం, రక్త పోటు సమస్యలను పోగొట్టటంలో సహాయకారిగా పనిచేస్తుంది. తద్వారా గుండె జబ్బుల సమస్యలు ఉత్పన్న కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
గ్రీన్ ఆపిల్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వల్ల జీవక్రియలు మెరుగై ప్రేగు వ్యవస్ధలు శుభ్రపడి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇనుము, రాగి, జింక్, మాంగనీస్ , పొటాషియం వంటి ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆపిల్ ఇనుము శరీరంలో ఆక్సిజన్ స్ధాయిలను పెంపొందిస్తుంది. తక్కువ కొ్వ్వు ఉండటం కారణంగా గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా సహాయపడుతుంది.
శరీరంలో కణాల పునర్నిర్మానం, కణాల పునరుత్తేజానికి , గ్రీన్ ఆపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు తోడ్పతాయి. చర్మం కాంతి వంతంగా ఉండటమే కాకుండా కాలేయం రక్షణకు ఉపయోగపడుతుంది. థైరాయిడ్ గ్రంధి సమస్యలు, కీళ్లసంబంధిత వ్యాధులను నివారిస్తుంది. మతిమరుపుతో బాధపడేవారు రోజుకు ఒక గ్రీన్ ఆపిల్ తీసుకుంటే ఆసమస్యనుండి ఈజీగా బయటపడవచ్చు. ముఖ్యంగా చిన్నారులకు రోజుకు యాపిల్ ఇవ్వటం వల్ల వారి భవిష్యత్తు ఆరోగ్యం ఆనందమయంగా సాగుతుంది.
మొటిమలు నివారించటంతోపాటు, కళ్ళక్రింద ఉండే నల్లటి వలయాలు తొలగిపోయేలా చేస్తుంది. ఒత్తిడి కారణంగా వచ్చే మైగ్రేన్ తలనొప్పి నుండి విముక్తికి గ్రీన్ యాపిల్ తినటం మంచిది. జుట్టు పెరుగుదలకు, చుండ్రు నివారణకు, జుట్టురాలే సమస్యను తొలగిస్తుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది. మెదడులో ఎసిటైల్ కోలీన్ స్రావాన్ని పెంచటం ద్వారా న్యూరో ట్రాన్స్ మిటర్ల పనితీరు మెరుగై అల్జీమర్స్ సమస్య నుండి విముక్తి లభించేలా చేస్తుంది. యాపిల్ తినేవారిలో కాలేయ, పేగు, రొమ్ము క్యాన్సర్లు దరిచేరవు.