Kodo Millets Benefits : శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు, మధుమేహులకు మేలు చేసే అరికెలు !
హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గించటంలో బాగా ఉపకరిస్తాయి. రక్తహీనతతో బాధపడేవారు వీటిని తినటం వల్ల రక్తం పెరుగుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు రాత్రి పూట వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల నిద్ర బాగాపడుతుంది.

Kodo Millets Benefits
Kodo Millets Benefits : చిరు ధాన్యాల్లో అరికెలు పోషక విలువలు పుష్కలంగా కలిగి ఉంటాయి. వీటినే కోడో మిల్లెట్స్ అని కూడా పిలుస్తారు. క్యాల్షియం, ఐరన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ వంటివి అరికెలలో ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. అరికెలను వివిధ రూపాల్లో ఆహారంలో చేర్చుకోవచ్చు. అన్నం, ఉప్మా వంటి వాటిని చేసుకుని తినవచ్చు.
READ ALSO : Pencil : అమ్మాయిని ఆ కంపెనీ పెన్సిల్‌తో పోల్చిన అబ్బాయి .. ఫిదా అయిపోయిన చిన్నది
అరికెలలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గిస్తాయి. మధుమేహులకు అరికెలు మంచి ఆహారం. వీటిని తింటే షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తి పెంపొందిస్తాయి. కణాలు దెబ్బ తినకుండా సురక్షితంగా ఉంచుతాయి. మహిళల్లో నెలసరి సమస్యలు తగ్గించటంతోపాటుగా, గుండె జబ్బులు వంటి తీవ్రమైన దుష్పరిణామాలు ఏర్పడకుండా నిరోధించవచ్చు.
READ ALSO : Kharif maize : ఖరీఫ్ మొక్కజొన్న సాగులో పాటించాల్సిన జాగ్రత్తలు..నాణ్యతా ప్రమాణాలు
హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గించటంలో బాగా ఉపకరిస్తాయి. రక్తహీనతతో బాధపడేవారు వీటిని తినటం వల్ల రక్తం పెరుగుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు రాత్రి పూట వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల నిద్ర బాగాపడుతుంది. శరీరంలోని క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టి క్యాన్సర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాలతో బాధపడుతున్నవారు అరికెలను తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.
READ ALSO : Persons Neck : మెడ పొడవును బట్టి వారు ఎలాంటివారో చెప్పొచ్చట..!
వీటిలో అధికమొత్తంలో మినరల్స్, విటమిన్స్ శరీరానికి అవసరమైన పోషకాలను అందించి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. క్యాల్షియం మంచి మోతాదులో ఉండటం వల్ల ఎముకల దృఢత్వానికి ,కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలను తగ్గించటానికి దోహదపడతాయి.