Pencil : అమ్మాయిని ఆ కంపెనీ పెన్సిల్‌తో పోల్చిన అబ్బాయి .. ఫిదా అయిపోయిన చిన్నది

అలాంటి  ఓ అబ్బాయి ఓ అమ్మాయిని చూసి ఫిదా అయిపోయాడు. తన ఫీలింగ్స్ ను వినూత్నంగా చెప్పాడు. పెన్సిల్ తో పోలుస్తు యూనిక్ గా చెప్పిన అతని ఫీలింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pencil : అమ్మాయిని ఆ కంపెనీ పెన్సిల్‌తో పోల్చిన అబ్బాయి .. ఫిదా అయిపోయిన చిన్నది

Man Innovative Pickup Line Pencil

Apsara Pencil : అమ్మాయిలు సన్నగా నాజూగ్గా కనిపిస్తే వావ్ ఏముంది…? అంటూ అబ్బాయిలు తెగ లుక్కులిచ్చేస్తుంటారు. అందంగా ఉన్న అమ్మాయిల్ని ‘అప్సర’లతో పోలుస్తుంటారు. అలాంటి  ఓ అబ్బాయి ఓ అమ్మాయిని చూసి ఫిదా అయిపోయాడు. తన ఫీలింగ్స్ ను వినూత్నంగా చెప్పాడు. ‘అప్సర’లా ఉన్నావు అని చెప్పేందుకు తన తెలివితేటల్ని వాడుతు..చాక చక్యంగా..నొప్పించిక తానొవ్వక అన్నట్లుగా వినూత్నగా ఆమెకు తెలియజేశాడు. ఆ అబ్బాయి ఎంతో తెలివిగా ఆ అమ్మాయికి ఓ  స్లిప్  ఇచ్చాడు. ఆ స్లిప్ లో అతను రాసిన పదాలకు ఆ అమ్మాయి ఫిదా అయిపోయింది. ఆ స్లిప్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది.

పూణెలో రోడ్డు మీద నడిచి వెళ్తున్న ఆమెకు ఓ కుర్రాడు ఎదురయ్యాడు. ఓ అబ్బాయి ఆమె వద్దకు వచ్చి ‘‘ఇదేదో కిందపడిపోయింది ఇది మీదేనా’’అంటూ ఓ స్లిప్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఆమె అతను ఇచ్చింది తీసుకుని చూసి షాక్ అయ్యింది. స్లిప్ తెరిచి చూసింది. తరువాత చిన్నగా నవ్వుకుంది. ఇంతకీ ఆ స్లిప్ లో ఏముందంటే..‘‘ మీరు పెన్సిలా (Pencil)? దూరం నుంచి అప్సర (Apsara)లా కనిపిస్తున్నారు“ అంటూ చివర్లో స్మైల్ సింబల్ వేశాడు.

Copa Airlines flight : విమానంలో డైపర్‌ కలకలం .. బాంబు అనుకుని ఎమర్జెన్సీ ల్యాండింగ్..

ఆ స్లిప్‌లో రాసి ఉన్న మేటర్ ను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆనక ఫిదా అయింది. అప్సర పెన్సిల్‌ ను ఇలా కూడా ఉపయోగిస్తారా..? అని అనుకుని చిన్నగా నవ్వుకుంది. తనకు కాంప్లిమెంట్ ఇచ్చిన విధానం నచ్చి ఆ స్లిప్‌ను ఫొటో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి క్రియేటివిటీ కనిపిస్తే నెటిజన్లు వదులుతారా ఏంటీ..తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఐడియా బాగుంది.. దీనిని నేను ట్రై చేస్తానని ఒకరంటే..చాలా ప్రేమతో రాశాడు త్వరగా ఓకే చెప్పండి అంటూ మరొకరు..ఆ స్లిప్‌నకు లామినేట్ చేసి ఉంచుకోండి.. గుడ్ మెమరీ అంటూ ఇంకొరు ఇలా రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు చేశారు.