Copa Airlines flight : విమానంలో డైపర్‌ కలకలం .. బాంబు అనుకుని ఎమర్జెన్సీ ల్యాండింగ్..

గాల్లో దూసుకుపోతున్న ఓ విమానంలో ఓ డ్రైపర్ పెద్ద కలకలమే సృష్టించింది. ప్రయాణీకులను హడలెత్తించింది. విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండ్ చేయించింది.

Copa Airlines flight : విమానంలో డైపర్‌ కలకలం .. బాంబు అనుకుని ఎమర్జెన్సీ ల్యాండింగ్..

Adult Diaper.. Copa Airlines flight

Adult Diaper.. Copa Airlines flight : గాల్లో దూసుకుపోతున్న ఓ విమానంలో ఓ డ్రైపర్ పెద్ద కలకలమే సృష్టించింది. ప్రయాణీకులను హడలెత్తించింది. విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండ్ చేయించింది. శుక్రవారం కోపా ఎయిర్ లైన్స్ ను ఓ డ్రైపర్ అత్యవసర ల్యాండింగ్ చేయించిన ఈ వింత ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానంలో ఓ డ్రైపర్ ను చూసి బాంబు అనుకుని ప్రయాణీకులు నానా హంగామా చేశారు. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అందరినీ కిందకు దించి విమానాన్ని అణువణువు గాలించారు.

అమెరికాలోని పనామా నగరంలోని టోకుమెన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడాలోని తంపాకు బయలుదేరింది కోపా ఎయిర్ లైన్స్ విమానం. విమానం టేకాఫ్ తీసుకున్న ఓ గంటకు ఓ ప్రయాణీకుడు టాయిలెట్ లోకి వెళ్లగా అక్కడ అనుమానాస్పదంగా ఒకటి కనిపించింది. అదే విషయాన్ని విమాన సిబ్బంది చెప్పాడు. వారు దాన్ని పరిశించి భయపడ్డారు. అదేమిటో తెలియకపోయినా బాంబు భావించి భయపడ్డారు. ఆ విషయాన్ని పైలట్ దృష్టికి తీసుకెళ్లారు. అతను అధికారులకు సమాచారం అందించగా వారి సూచనల మేరకు విమానాన్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చి పనామా ఎయిర్ పోర్టులో ఎమర్జన్సీ లాండ్ చేశారు పైలట్.

Sudha Murty : సుధామూర్తి సిబ్బందినంటూ డబ్బులు వసూళ్లు .. వ్యక్తి అరెస్ట్, ఇద్దరు మహిళలపై కేసు నమోదు

విమానంలో ఉన్న మొత్తం 144మంది ప్రయాణీకులను కిందకు దించారు. విమానంలో బాంబ్ స్క్వాడ్ గాలించింది. కానీ ఎక్కడా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. విమానం సిబ్బంది సూచనల మేరకు మరోసారి బాత్రూమ్ లో అణువణువు గాలించగా అక్కడ ఓ అడల్ట్ డైపర్ గా గుర్తించింది. అది బాంబు కాదని అడల్ట్ డైపర్ అని తేల్చటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో విమానం ఆలస్యంగా ఫ్లోరిడాకు బయలుదేరింది. ఈ ఘటన గురించి నేషనల్ పోలిస్ ఆఫ్ పనామా ట్విట్టర్ లో షేర్ చేసింది.