India Knife Laws : మీ ఇంట్లో 6 అంగుళాల కంటే పెద్ద కత్తి ఉందా? దానికి లైసెన్స్ ఉందా? లేదంటే జైలు శిక్షే..

ప్రతి ఇంట్లో ముఖ్యంగా వంటింట్లో కూరగాయలు కట్ చేయడానికి కత్తిని వాడుతుంటాం. మీరు వాడే కత్తి 6 అంగుళాల పొడవు దాటి ఉంటే చట్ట విరుద్ధం. మీపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. అది రుజువైతే జైలు శిక్ష పడుతుంది.

India  Knife Laws : మీ ఇంట్లో 6 అంగుళాల కంటే పెద్ద కత్తి ఉందా? దానికి లైసెన్స్ ఉందా? లేదంటే జైలు శిక్షే..

India Knife Laws

Updated On : August 9, 2023 / 3:13 PM IST

India Knife Laws : ప్రతి ఇంట్లో కూరగాయలు కోయడానికి కత్తిని వాడతారు. కొన్నింటికి పెద్ద కత్తిని వాడతారు. కత్తి వాడుతున్నాం సరే.. నిర్దిష్ట పరిమాణం దాటిన కత్తి మన ఇంట్లో ఉంటే చట్ట విరుద్ధమని మీకు తెలుసా? మీ ఇంట్లో 6 అంగుళాల కంటే పెద్ద కత్తి ఉండి దానికి లైసెన్స్ లేకపోతే నేరంగా పరిగణిస్తారు. అందుకు జైలు శిక్ష కూడా విధిస్తారు.

South Korea : 960 సార్లు పరీక్ష రాసి డ్రైవింగ్ లైసెన్స్‌ సాధించిన 69 ఏళ్ల మహిళ .. ఆమె పట్టుదలకు హ్యుందాయ్‌ కారు గిఫ్టు

కత్తికి లైసెన్స్ ఏంటి? అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీ ఇంట్లో అవసరాల కోసం వాడే కత్తికి నిర్దిష్టమైన పరిమాణం ఉంటుంది. అది దాటి మీరు వాడుతున్నట్లైతే ఖచ్చితంగా దానికి లైసెన్స్ ఉండాలి. ఎవరైనా దాని గురించి మీ మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ కత్తిని స్వాధీనం చేసుకోవచ్చు. ఆ తరువాత శిక్షించబడవచ్చును. మీ వంట గదిలో 6 అంగుళాల కంటే పెద్దదైన కత్తి ఉంటే వెంటనే లైసెన్స్ పొందండి.. లేదంటే దానిని తీసేయండి.

 

కత్తి లైసెన్స్ ఎలా పొందాలి?  అని చాలామందికి డౌట్ రావచ్చు. ఇందుకోసం జిల్లా అధికారి కార్యాలయానికి వెళ్లాలి. లేదంటే కమిషనరేట్ వ్యవస్థ అమలులో ఉన్న సిటీ అయితే రెసిడెంట్ పోలీస్ కమిషనర్ ఆఫీస్‌కి వెళ్లి అప్లై చేసుకోవచ్చును. అప్లై చేసేటపుడు అసలు మీకు అంత పెద్ద కత్తి ఎందుకు అవసరమో తప్పనిసరిగా చెప్పాలి. దీంతో పాటు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

Electric Scooters in India : కొత్త ఈవీ స్కూటర్ కొంటున్నారా? 2023లో టాప్ 7 చౌకైన తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. లైసెన్స్ లేకుండానే నడపొచ్చు!

కత్తి లైసెన్స్ కోసం బర్త్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్, క్యారెక్టర్ సర్టిఫికేట్, ఇన్‌కం సర్టిఫికేట్, మీరు చేసే ఉద్యోగం, లేదా వ్యాపారానికి సంబంధించిన వివరాలు, బ్యాంకు వివరాలు అప్లికేషన్‌తో పాటు ఇవ్వాలి. మీ దరఖాస్తు అందుకున్నాక మూడు ప్రాంతాలకు వెళ్తుంది. మీ అప్లికేష్ ముందు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు, SDS కార్యాలయానికి పంపిస్తారు. ఆ తరువాత ఇంటెలిజెన్స్ డిపార్టె మెంట్‌కు వెళ్తుంది. ఇక అప్లై చేసుకున్న వారి గురించి పూర్తి తనిఖీలు జరుగుతాయి. గతంలో అతనిపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే విషయాన్ని కూడా తనిఖీ చేస్తారు. వారి మానసిక పరిస్థితిపై కూడా ఆరా తీస్తారు.

 

ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యాకే జిల్లా మేజిస్ట్రేట్ లేదా పోలీస్ కమిషనర్ లైసెన్స్ జారీ చేయడంపై నిర్ణయం తీసుకుంటారు. లైసెన్స్ పొందిన తరువాత దానికి 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. ఏటా ఆ కత్తి లైసెన్స్ రెన్యువల్ కోసం సంవత్సరానికి రూ.100 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీ ఇంట్లో ఉన్న కత్తికి లైసెన్స్ పొందవచ్చును.

Delhi Highcourt: రూ.2,000 నోట్ల మార్పిడికి ఐడి ప్రూఫ్ తప్పనిసరిపై కీలక తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు