Vitamin-D
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం అన్నది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ విటమిన్ సూర్యరశ్మి,గుడ్లు, మొక్కలు, చేపలు, గొర్రెమాంసం మొదలైన వాటి లభిస్తుంది, అయితే వివిధ కారణాల వల్ల విటమిన్ డి లోపం కేసులు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. ఇంట్లో కూర్చోవడం, ఎక్కువగా సన్‌స్క్రీన్ రాయటం, ఇవన్నీ విటమిన్ డి లోపానికి కారణాలు. ఎముక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేసే కాల్షియం తయారీతో సహా వివిధ విధులను నిర్వహించడానికి శరీరానికి డి విటమిన్ అవసరం. తరుచుగా అలసటకు గురవటం, అనారోగ్య సంబంధ సమస్యలు చుట్టుముడుతుంటే విటమిన్ డి స్థాయిలను పరీక్షల ద్వారా తెలుసుకోవాలి.
READ ALSO : Fatty Liver Disease : ప్రాణాలు తీస్తున్న ఫ్యాటీ లివర్ ఇకనైనా జాగ్రత్త పడండి
విటమిన్ డి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.. సూర్యరశ్మి నుండి UV-B కి బహిర్గతం అయిన తర్వాత ఇది శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. విటమిన్ D అనేది ఎముక పెరుగుదల, జీవక్రియ ప్రక్రియలో ఒక స్టెరాయిడ్ హార్మోన్ గా ఉపయోగపడుతుంది. అవయవాలు, మూత్రపిండాలు ,కాలేయానికి క్రియాశీలకమైనది. ఇది కొవ్వులో కరిగే విటమిన్ గా నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ డి లోపం
విటమిన్ డి లోపం ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే, తగినంత సూర్యరశ్మిని పొందటం ద్వారా తిరిగి ఆలోటును భర్తీ చేయవచ్చు. విటమిన్ డి కి ప్రధాన మూలం సూర్యుడు. మాన శరీరానికి సూర్యరశ్మి తగిలినప్పుడు సంశ్లేషణ చెంది విటమిన్ డి అందుతుంది. ఇంటి లోపల ఎక్కువ సమయం ఉండటం , ఎండకు దూరంగా ఉండటం వలన, చాలా మంది విటమిన్ డి లోపం ముప్పును ఎదుర్కొంటున్నారు.
READ ALSO : Fatty Liver Disease : శరీర భాగాల్లో ఈ 5 ప్రదేశాల్లో వాపు వస్తే అది ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతమా !
ఎయిర్ కండిషన్డ్ రూమ్‌లలో కూర్చోవడానికి ఇష్టపడే వ్యక్తులకు సూర్యరశ్మి తగలదు. అలాంటి వారిలో విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉంటాయి. చర్మాన్ని టానింగ్ నుండి రక్షించడానికి సన్‌స్క్రీన్ లోషన్ ధరించడం కూడా సూర్యుడి నుండి డి విటమిన్ సరిగా అందకపోవడానికి మరొక కారణం. విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్ అయినందున శరీరంలో శోషణకు గురికాదు. కొవ్వును నివారించడం వల్ల విటమిన్ డి లోపం తలెత్తుతుంది. విటమిన్ డి లోపం ఉండే గర్భిణీలు పుట్టిన పిల్లలు దానిని ప్రభావానికి లోనయ్యే ప్రమాదం ఉంటుంది. వారిలో ఎముకల పెరుగుదల , జీవక్రియ లోపాలు తలెత్తుతాయి.
READ ALSO : Heart Attack Cases : కొవిడ్ రోగులకు గుండెపోటు ఎందుకు వస్తుందంటే…ఐసీఎంఆర్ పరిశోధనల్లో తేలిన నిజం
విటమిన్ డి లోపం లక్షణాలు
విటమిన్ D లోపం వల్ల పిల్లలలో రికెట్స్, పెద్దలలో ఆస్టియోమలాసియా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రెండు సమస్యలు వల్ల కాల్షియం లోపం ఏర్పడి ఎముకలను పెళుసుగా చేస్తుంది. విటమిన్ D లోపం కారణంగా అలసట, రోగనిరోధక వ్యవస్థ బలహీనం కావటం వంటివి చోటు చేసుకుంటాయి. డిప్రెషన్ , విటమిన్ డి లోపం మధ్య సంబంధం ఉన్నట్లు పలు అధ్యయనాల్లో లేతింది. అదే క్రమంలో విటమిన్ డి అధికంగా తీసుకోవడం కూడా అంతే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO : Chicken liver : ఎముకలు, కండరాలకు మేలు చేసే…. చికెన్ లివర్
విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి ఆహారలు, జీవనశైలి మార్పులు
విటమిన్ డి రెండు రూపాల్లో లభిస్తుంది. డి 2 మొక్కల ద్వారా లభిస్తుంది మరియు విటమిన్ డి 3 జంతువుల ఆహారం, సూర్యకాంతి ద్వారా లభిస్తుంది. ఆహార వనరులలో బలవర్థకమైన పాలు, తృణధాన్యాలు, గుడ్డు, కొవ్వు చేపలు, లివర్ మొదలైనవి ఉన్నాయి.
READ ALSO : మీ ఎముకలు ఆరోగ్యంగా ఉన్నాయా?
విటమిన్ డి మంచి మోతాదులో పొందాలంటే ఉదయం సమయంలో సుమారు 10-15 నిమిషాల పాటు సూర్యరశ్మిలో ఉండటం మంచిది. ఎండవేళలో తోటపనిని ఒక అభిరుచిగా మలచుకోవాలి. లేదా ప్రతిరోజూ మొక్కలకు నీరు పెట్టడం ద్వారా ఎండ తగిలి సూర్యరశ్మిని పొందవచ్చు. సమతులాహారం ద్వారా విటమిన్ డి ని పొందవచ్చు. ఉదయం సూర్య నమస్కారాల సాధన చేయడం వల్ల శరీరానికి సూర్యకాంతి తగిలి విటమిన్ డి లభిస్తుంది.