Fatty Liver Disease : శరీర భాగాల్లో ఈ 5 ప్రదేశాల్లో వాపు వస్తే అది ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతమా !

పొత్తికడుపు వాపుకు గురికావటం అనేది కొవ్వు కాలేయ వ్యాధికి సంబంధించిన అత్యంత సాధారణ సంకేతాలలో ఒకటి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల పొత్తికడుపులో వాపు ఏర్పడుతుంది. సాధారణంగా నిలబడి ఉన్నప్పుడు గమనించవచ్చు.

Fatty Liver Disease : శరీర భాగాల్లో ఈ 5 ప్రదేశాల్లో వాపు వస్తే అది ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతమా !

Fatty Liver Disease

Fatty Liver Disease : ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది కాలేయంలో కొవ్వు పేరుకుపోయే పరిస్ధితి. ఇది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఫ్యాటీలివర్ వ్యాధి సాధారణంగా లక్షణరహితంగా ఉంటుంది. అయితే కొన్ని శరీర భాగాలు ఫ్యాటీ లివర్ సమస్య కారణంగా వాపుకు గురవుతాయి. ఈ లక్షణాల ద్వారా ఫ్యాటీ లివర్ సమస్య ఉనికిని గుర్తించవచ్చు. ఐదు శరీర భాగాలు ఉబ్బిపోయి ఉంటే కాలేయంలో కొవ్వు పెరిగిందని అర్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : Fatty Liver Problem : ఫ్యాటీ లివర్ సమస్య మానసిక ఆరోగ్యాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుందో తెలుసా ?

పొత్తికడుపు: పొత్తికడుపు వాపుకు గురికావటం అనేది కొవ్వు కాలేయ వ్యాధికి సంబంధించిన అత్యంత సాధారణ సంకేతాలలో ఒకటి. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల పొత్తికడుపులో వాపు ఏర్పడుతుంది. సాధారణంగా నిలబడి ఉన్నప్పుడు గమనించవచ్చు. పక్కటెముకకు దిగువన ఉన్న ప్రదేశంలో ఉబ్బినట్లు కనిపించవచ్చు. వాపు నొప్పి , సున్నితత్వంతో ఉంటే వీలైనంత త్వరగా వైద్యుడిని కలిసి చికిత్స పొందటం మంచిది.

READ ALSO : Non-Alcoholic Fatty Liver : ప్రాణాంతకంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్.. సమస్య నుండి బయటపడేందుకు మార్గాలు

చీలమండలు: చీలమండల వాపులు ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతం. కాలేయంలో అధిక కొవ్వు ఉన్నప్పుడు శరీరంలో ద్రవం పేరుకుపోతుంది. దీని వలన చీలమండలు , పాదాలలో ద్రవం పేరుకుపోతుంది. చీలమండలు వాపు ఉంటే, అది కేవలం ఫ్యాటీ లివర్ డిసీజ్ కంటే తీవ్రమైన ఏదో ఒక అనారోగ్య సంకేతం కావచ్చు కనుక వైద్య సహాయం పొందటం అవసరం.

READ ALSO : లివర్‌ను కాపాడే ఫుడ్స్ ఇవే!

కళ్ళు: కళ్లలో వాపు కూడా ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతం. కాలేయంలో చాలా కొవ్వు ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది, దీని వలన కళ్ల చుట్టూ ద్రవం పేరుకుపోతుంది. కళ్ళు ఉబ్బుతాయి. ఈ లక్షణాన్ని విస్మరించకూడదు. ఎందుకంటే ఇది పరిస్ధితి మరింత తీవ్రమౌతున్నదానికి సంకేతం కావచ్చు.

READ ALSO : Non-Alcoholic Fatty Liver : నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యా? ఎందుకిలా ?

పాదాలు: కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు, వ్యర్థ ఉత్పత్తులను ప్రాసెస్ చేయకుండా నిరోధించడం వల్ల పాదాలు ఉబ్బుతాయి. పాదాల్లో నొప్పి ఉంటే వెంటనే వైద్యుడిని కలిసి తగిని చికిత్స పొందటం మంచిది.

READ ALSO : Liver Health : లివర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు ఇవే!

కీళ్ళు: కీళ్ల నొప్పులు, దృఢత్వం కూడా ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతం కావచ్చు. కాలేయంలో ఎక్కువ కొవ్వు కారణంగా శరీరంలో ద్రవం పేరుకుపోయి, ఈ ద్రవం కీళ్ల చుట్టూ చేరి వాటిని గట్టిగా మారుస్తాయి. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకోవాలి.