Coconut Chutney : కొబ్బరి చట్నీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు! రోజువారిగా మితంగా తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో?

కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది అజీర్ణం, అతిసారం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. కొబ్బరి చట్నీ తీసుకోవడం వల్ల మీ కడుపులో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది.

Coconut Chutney : కొబ్బరి చట్నీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు! రోజువారిగా మితంగా తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో?

Many Health Benefits of Coconut Chutney! Control blood pressure if taken daily in moderation?

Updated On : October 20, 2022 / 5:19 PM IST

Coconut Chutney : కొబ్బరి మన ఆరోగ్యానికి చాలా మంచిచేస్తుంది.కొబ్బరిని వివిధ రూపాల్లో ఆహారంగా తీసుకోవచ్చు. ఏ రూపంలో తీసుకున్నా దీని వల్ల మన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరిని పచ్చడిగా చేసుకుని తినవచ్చు. ఇలా తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

కొబ్బరి చట్నీతో ప్రయోజనాలు ;

1. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారికి కొబ్బరి చట్నీ చాలా మంచిది. ఇది శరీరంలో రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.

2. కొబ్బరి చట్నీలో దాదాపు 2 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఒక గిన్నెలో చట్నీలో 2 గ్రాముల కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, సోడియం ఉంటాయి. కొబ్బరి చట్నీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజంతా మిమ్మల్ని చురుగ్గా ,శక్తివంతంగా చేస్తుంది.

3. బరువు తగ్గాలన్న ప్రయత్నాల్లో ఉన్నవారికి కొబ్బరి చట్నీ బాగా ఉపకరిస్తుంది. రోజువారిగా కొబ్బరి చట్నీ తింటే రక్త హీనతను నివారించ వచ్చు. శరీరంలో రక్తం పెరుగుతుంది.

4. కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది అజీర్ణం, అతిసారం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. కొబ్బరి చట్నీ తీసుకోవడం వల్ల మీ కడుపులో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. రోగాలు దరిచేరవు.

5. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. కొబ్బరి చట్నీలో శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నందున ఎక్కువ మోతాదులో తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని పూర్తిగా తినండి. కొబ్బరి చట్నీని తక్కువ పరిమాణంలో అంటే రోజుకు 2 నుండి 3 టీస్పూన్లు తీసుకుంటే సరిపోతుంది.

కొబ్బరి చట్నీ తయారీ ;

కొబ్బ‌రి చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలకు సంబంధించి ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు అర క‌ప్పు, వేయించి పొట్టు తీసిన ప‌ల్లీలు రెండు టేబుల్ స్పూన్స్, కొద్దిగా వేయించిన పుట్నాల ప‌ప్పు ఒక‌టేబుల్ స్పూన్, వేయించిన ప‌చ్చి మిర్చి త‌గిన‌న్ని, ఉప్పు త‌గినంత‌, నీళ్లు త‌గిన‌న్ని, వెల్లుల్లి రెబ్బ‌లు 5 లేదా 6 తీసుకోవాలి.

ముందుగా ఒక జార్ లో ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌ల‌ను, ప‌ల్లీల‌ను, పుట్నాల‌ను, ప‌చ్చి మిర్చిని వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్ల‌ను, ఉప్పును, వెల్లుల్లి రెబ్బ‌ల‌ను వేసి మిక్సీ ప‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి కాగిన త‌రువాత తాళింపు ప‌దార్థాల‌ను వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపును ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న చ‌ట్నీలో వేసి క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రి చ‌ట్నీ త‌యార‌వుతుంది.