Organic Salts Mars : అంగారకుడిపై సేంద్రీయ లవణాలు.. కనిపెట్టిన నాసా రోవర్లు.. జీవం ఉన్నట్టేనా?
అంగారక గ్రహంపై అసలు జీవం ఉందా? లేదా కనిపెట్టేందుకు ఎన్నోఏళ్లుగా నాసా పరిశోధన చేస్తూనే ఉంది. నాసా సైంటిస్టులు అంగారకుడిపైకి అనేక రోవర్లను పంపి మరి అక్కడి జీవానికి సంబంధించి ఏమైనా ఆనవాళ్లు దొరకుతాయా?

Nasa Collects Organic Salts On Mars (1)
Organic molecules Salts on Mars : అంగారక గ్రహంపై అసలు జీవం ఉందా? లేదా కనిపెట్టేందుకు ఎన్నోఏళ్లుగా నాసా పరిశోధన చేస్తూనే ఉంది. నాసా సైంటిస్టులు అంగారకుడిపైకి అనేక రోవర్లను పంపి మరి అక్కడి జీవానికి సంబంధించి ఏమైనా ఆనవాళ్లు దొరకుతాయా? పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మార్స్ ఉపరితలంపై అంతుచిక్కని ఎన్నో అద్భుతమైన ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి. ఇప్పటివరకూ దొరికిన ఆధారాలను బట్టి పరిశీలిస్తే.. రెడ్ ప్లానెట్‌పై ఒకప్పుడు జీవం ఉండేదనే వాదన బలంగా వినిపిస్తోంది.
నాసా రోవర్ల అన్వేషణలోనూ ఇదే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మార్స్ ఉపరితలంపై ఆర్గానిక్ మాలిక్యులెస్ (సేంద్రీయ అణువులు) ఉన్నాయని గుర్తించారు నాసా పరిశోధకులు. అంగారక గ్రహంపై Organic Salts ఉన్నాయని ఇప్పుడు నాసా పరిశోధకులు బలంగా విశ్వసిస్తున్నారు. దీనికి సంబంధించి పరిశోధనను Journal of Geophysical Research: Planetsలో ప్రచురించారు. నాసా రోవర్ శాంపిల్స్ యానాలిసిస్ (SAM) మార్స్ ఉపరితలంపై లభించిన సేంద్రీయ లవణాల శాంపిల్స్ ను ఆటోమాటెడ్ కెమిస్ట్రీ ల్యాబ్‌లో పరీక్షించారు.
ఇంతకీ ఈ సేంద్రీయ లవణాలు ఎక్కడినుంచి మార్స్ పై వచ్చాయి అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. మార్స్‌పై సేంద్రీయ లవణాలు ఉన్నాయంటే.. అక్కడ కచ్చితంగా జీవం ఉండి ఉంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. సేంద్రీయ అణువులను కూడా ఉత్పత్తి చేయగల అణువులు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. కానీ, ఈ లవణాలతో జీవితానికి సంబంధించిన ఆధారాలను బయటకు వస్తాయని అంటున్నారు. అంగారక గ్రహంపై ఎక్కడైనా కేంద్రీకృతమైన సేంద్రీయ లవణాలు ఉన్నాయని నిర్ధారిస్తే.. ఆ ప్రాంతాలను మరింత
పరిశోధించాలని భావిస్తున్నామని తెలిపారు.