Home : ఇంట్లో వీటిని ఖాళీగా అస్సలు ఉంచొద్దు .. ఉంచితే దరిద్రమే..

Home : ఇంట్లో వీటిని ఖాళీగా అస్సలు ఉంచొద్దు .. ఉంచితే దరిద్రమే..

Happy home

Updated On : September 8, 2023 / 5:57 PM IST

Bad Luck Bad Luck Signs : ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మనిషి ఖాళీగా ఉండకుండా ఏదోక పనిచేస్తుండాలని అంటారు.అలాగే ఇంట్లో ఉండే వస్తువులు కూడా ఖాళీగా ఉండకూడదని పండితులు చెబుతుంటారు. అంతేకాదు వాడని వస్తువుల్ని ఇంట్లో ఉంచకూడదని చెబుతారు. ఖాళీగా ఉన్న మనిషి బుర్ర వంద దెయ్యాల కొలువు అంటారు. ఖాళీగా ఉంటే పనికిమాలిన ఆలోచనలతో నెగిటివ్ ఆలోచనలు వస్తాయని కాబట్టి మనిషికి ఏదొక వ్యాపకం ఉండాలంటారు. అలాగే మన ఇంట్లో ఉండే వస్తువులు మరీ ముఖ్యంగా కొన్ని ఖాళీగా ఉంచకూడదని అంటారు. మరి అవి ఏమిటీ… వాటిలో ఏమేమి ఉంచాలి..? అనే విషయం తెలుసుకుందాం..శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ వస్తువులు ఖాళీగా ఉంచకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా బీరువాలో ఎంతో కొంత డబ్బు ఉంచుతుంటాం. మరీ వేలల్లో కాకపోయినా కొంతైనా ఉంచుతాం.. అలాగే పర్సులు, హ్యాండ్ బ్యాగుల్లో కూడా కొంత చిల్లర అయినా ఉంచుతాం. ఈ విషయం చాలామందికి తెలిసిన విషయమే. కానీ వీటితో పాటు ఇంట్లో ఉండే కొన్నింటిని కూడా ఖాళీగా ఉంచకూడదు..అవేమిటో తెలిసేసుకుందాం..

పర్సులు, బీరువాలు,హ్యాండ్ బ్యాగులు..
మీ జేబులోని ప‌ర్సును ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. వీటిలో ఎప్పుడూ కొంత డబ్బు ఉంచుకోవాలి. శాస్త్రం ప్రకారం ఇంట్లో డ‌బ్బు ఉంచే బీరువా లేదా పర్సు పూర్తిగా ఖాళీగా ఉంటే లక్ష్మీ దేవి మీపై ఆగ్ర‌హిస్తుందట. నేను భద్రపరిచే వాటిని ఇలా ఖాళీగా ఉంచేస్తారా..?అని ఆగ్రహిస్తుందట. అలా ఒకవేళ తెలిసో తెలియకో చేస్తే ఆ పొరపాటు మరోసారి చేయకుండా జాగ్రత వహించండి. గోమతి చక్రం, పసుపుతో పాటు కొంత డబ్బును ఎర్రటి గుడ్డలో కట్టి బీరువాలో ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం..

బాత్రూమ్ లేదా వాష్ ఏరియాల్లో ఉండే బకెట్ లో నీరు..
సాధారణంగా బాత్రూమ్ అంటే ఓ బకెట్టు..ఓ మగ్గు కంపల్సరిగా ఉంచుతాం. కానీ శాస్త్ర ప్రకాశం బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచినప్పుడు అది ఖాళీగా ఉండకూడదట. దాంట్లో నీరు నింపి ఉంచితే మంచిదట. నిండుగా కాకపోయినా కొన్ని అయినా నీరు ఉండేలా చూసుకోవాలి. బకెట్‌లో నీరు లేనప్పుడు, ప్రతికూల శక్తి త్వరగా ఇంట్లోకి ప్రవేశిస్తుందట. అలాగే బాత్రూమ్ లో ఉపయోగించే బకెట్ ను నలుపు రంగుది వాడకూడదట. అలాగే విరిగిన బకెట్ ఉంటే వెంటనే తీసివేయాలి. విరిగిన బకెట్టును అస్సలు వాడకూదట.అలా నల్లని బకెట్టుగానీ..విరిగిన బకెట్టు గానీ వాడితే ఆర్థిక సమస్యలు వస్తాయట..

Krishna Janmashtami 2023 : శ్రీకృష్ణుడుకి 88 రకాల పిండి వంటలు చేసిన చంద్రమతి

పూజ‌గదిలో ఖాళీ కలశం
ఇంటికి అత్యంత పవిత్రమైన ముఖ్యమైన గది పూజ గది. చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సిన గది. అంతేకాదు పవిత్రంగాను ఉంచుకోవాలి. శాస్త్ర ప్ర‌కారం దేవుని గదిలో కలశం ఉంచకుంటే అది ఖాళీగా అస్సలు ఉండకూడదు. కలశంలో కొంచెం నీరు పోసి ఉంచాలి. క‌ల‌శ‌ పాత్రలో ఎప్పుడు నీరు ఉండేలా చూసుకోవాలి. గంగాజలం ఉంచుకుంటే మరీ మంచిది. అంతేకాదు నీటిలో కొన్ని తులసి ఆకులు వేసి ఉంచుకుంటే చాలా మంచిది. తులసి ఎంత పవిత్రమైన మొక్కో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.కలశంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే భగవంతుని అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది.

వంటగదిలో ఖాళీ బియ్య‌పు డ‌బ్బా..
వంటగది అంటే ఎన్నో రకాల ఆహార పదార్ధాలు, దినుసులు ఉంటాయి. మరీ ముఖ్యంగా బియ్యం డబ్బా ఉంటుంది.బియ్యం డబ్బా ఎప్పుడు ఖాళీగా ఉంచొద్దు. బియ్యం డబ్బా అంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవే.అందరి కడుపులు నింపే అన్నపూర్ణాదేవి కొలువై ఉండేది బియ్యపు డబ్బా. అటువంటి బియ్యం డబ్బా పూర్తి ఖాళీగా అస్సలు ఉంచకూడదు. కొన్ని అయినా ఉంచాలి. శుక్రవారం నాడు బియ్యం డబ్బా శుభ్రం చేయకూడదు.

మన ఇంట్లో ఉండే ఇటువంటి వస్తువులు ఎప్పుడు నిండుగా ఉంటే మంచిది.అలా సాధ్యం కాని పక్షంలో కొంతైనా ఉంచాలి. అంతే తప్ప ఖాళీగా ఎట్టి పరిస్థితుల్లోను ఉంచకూడదని పండితులు చెబుతున్నారు. కొరత, లోటు వంటివి మనో వ్యాకులతకు దారి తీస్తాయి. వెలితి అనేది మనిషికి ఉండకూడదు.అది మనస్సులో అయినా ఇంటిలో అయినా..అలా ఉండకూడదంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాగే మానసిక ప్రశాంతత కోసం పచ్చని మొక్కలను ఇంటిలో అక్కడక్కడా పెట్టుకుంటే మనస్సుకు హాయిగా అనిపిస్తుంది.