Viagra-Style Drugs : 80 ఏళ్లలోనూ రికార్డు స్థాయిలో వయాగ్రా వాడేస్తున్నారు.. 102 ఏళ్ల వృద్ధుడు తెగ వాడేస్తున్నాడట!

రొమాన్స్ భావన కలిగే వారిలో ఎక్కువ మంది పురుషులు 80ఏళ్లు పైబడినవారే ఉన్నారట.. వీరంతా తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వయాగ్రా వంటి డ్రగ్స్ రికార్డు స్థాయిలో వాడుతున్నారని ఓ సర్వేలో తేలింది.

Viagra-Style Drugs : 80 ఏళ్లలోనూ రికార్డు స్థాయిలో వయాగ్రా వాడేస్తున్నారు.. 102 ఏళ్ల వృద్ధుడు తెగ వాడేస్తున్నాడట!

Viagra Style Drugs

Updated On : June 26, 2021 / 8:55 PM IST

Viagra-Style Drugs : రొమాన్స్ వంటి కోరికలకు వయస్సుతో సంబంధం లేదు.. ఏ వయస్సులోనైనా రొమాన్స్ చేయాలనే భావన కలుగుతుంది అంటున్నారు నిపుణులు. లైంగిక జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవడంతో పాటు.. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాలామంది రొమాన్స్ కోసం పరితపిస్తుంటారట.. అందులో ఎక్కువ మంది పురుషులు 80ఏళ్లు పైబడినవారే ఉన్నారట.. వీరంతా తమ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వయాగ్రా వంటి డ్రగ్స్ రికార్డు స్థాయిలో వాడుతున్నారని ఓ సర్వేలో తేలింది. అందులో 102 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడట.. ఈ డ్రగ్స్ వాడకం ద్వారా ఐదేళ్లలో వారిలో రొమాన్స్ చేయాలనే భావన 42శాతం పెరిగినట్టు గుర్తించారు.

గత ఏడాదిలో 1లక్ష 80వేల వయాగ్రా రకమైన డ్రగ్స్ ప్రిస్ర్కిప్షన్స్ ప్రకారం అందించారట.. అందులో ఎక్కువమంది పురుషులు 80ఏళ్ల వయస్సు ఉన్నవారే ఎక్కువగా ఉండగా.. 90ఏళ్ల వయస్సు ఉన్న పురుషుల్లో 5వేల మంది ఉన్నారు. వారిలో 102 ఏళ్ల వ్యక్తి కూడా వయాగ్రా రకం మందులు వాడినట్టు గణాంకాల్లో తేలింది. ఇటీవల కాలంలో ఈ రకం డ్రగ్స్ 99ఏళ్లు, 100 ఏళ్లు, 101 ఏళ్ల వయస్సు ఉన్నవారికి కూడా అందించినట్టు డేటాలో తేలింది. గత ఏడాదిలో మొత్తంగా 4.4 మిలియన్ల ప్రిస్ర్కిప్షన్లు ఉండగా.. వాటి ధర 21.3 మిలియన్ల పౌండ్లుగా NHS గణాంకాల్లో పేర్కొంది. అంతకుముందు ఏడాది కంటే.. ఈ గణాంకాలు మూడు శాతం మేర నెమ్మదిగా తగ్గినట్టు తేలింది. ఎక్కువ మందిలో 80ఏళ్ల వయస్సు వారే ఉండగా.. ఆ తర్వాతి వయస్సు వారి సంఖ్య క్రమంగా పెరిగినట్టు డేటా తెలిపింది.

కెంట్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ Frank Furedi ప్రకారం.. 80ఏళ్ల వయస్సు వారే ఎక్కువగా వయాగ్రా వాడుతున్నారంటే.. అందులో ఆశ్చర్యమేమి లేదని అంటున్నారు. లైంగిక జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవాలనే వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిందని ఆయన తెలిపారు. ప్రపంచంలో చాలామంది వృద్ధాప్య దశకు చేరుకున్నప్పటికీ.. ఒత్తిడిని తగ్గించుకునేందుకు తమ లైంగిక జీవనాన్ని కొనసాగించేందుకు ఇష్టపడతారట.. లైంగిక సమస్యలను ఎదుర్కొనేవారే ఎక్కువగా ఈ వయాగ్రా మందులను వాడినట్టు అన్ని ప్రిస్క్రిప్షన్‌లు NHS గణాంకాలలో ఉన్నాయి. వాస్తవానికి చాలామందికి వయాగ్రా అంటేనే ఎక్కువగా తెలుసు.. ఇప్పటివరకు అత్యంత ప్రాచుర్యం పొందింది సిల్డెనాఫిల్.. ఇది వయాగ్రా అనే పదానికి మరో పేరుగా పిలుస్తుంటారు.