Orange Juice : మలబద్ధకాన్ని నివారించే ఆరెంజ్ జ్యూస్
అన్న వాహికలోని పెరిస్టాల్టిక్ ఆహార కదలికలను మెరుగుపరుస్తుంది. శరీరం నుండి వ్యర్ధాలను తొలగించి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Orange Juice (1)
Orange Juice : మనకు అందుబాటులో ఉండే పండ్ల రకాల్లో ఆరెంజ్ కూడా ఒకటి. ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నారింజలో అనేక పోషకాలు ఉన్నాయి. ఫైబర్, విటమిన్ సి, థియామిన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి ఇందులో పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు, హృదయ ఆరోగ్యానికి , ఎముకలు, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి, రక్త శుద్ధికి ఉపయోగపడతాయి. మలబద్దకాన్ని నివారించటంలో నారింజ కీలకపాత్ర పోషిస్తుంది.
జీర్ణక్రియను పెంచటానికి , రక్తంలో చక్కెరను నియంత్రించటానికి , కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో సహాయపడుతుంది. తక్కువ ప్రేగు కదలికలు ఉండి మలబద్ధకంతో బాధపడుతున్న వారు నారింజ రసం తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అసలు మలబద్దకానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ లేకపోవటమే. అయితే నారింజ లో ఉండే గుజ్జులో ఫైబర్ లభిస్తుంది. ఇది ప్రేగులను ఉత్తేజ పరుస్తుంది. శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటాన్ని సులభతరం చేస్తుంది.
అన్న వాహికలోని పెరిస్టాల్టిక్ ఆహార కదలికలను మెరుగుపరుస్తుంది. శరీరం నుండి వ్యర్ధాలను తొలగించి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. నారింజ రసాలలో మలం మృధువుగా ఉండేందుకు విటమిన్ సి, నరింగెనిన్ అనే ఫ్లెవనాయిడ్ భేదిమందుగా పనిచేస్తుందని అధ్యయనాల్లో తేలింది. కొంతమందిలో, నారింజ రసం అతిసారానికి కారణమవుతుంది. ఇందులో సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు సార్బిటాల్ వంటి వివిధ రకాల చక్కెరలను కలిగి ఉన్నందున విరేచనాలతో బాధపడుతున్న వారిలోకడుపు నొప్పిని కలిగిస్తుంది. మలబద్దకానికి అనేక ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అయితే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యుల సలహా తీసుకుని చికిత్స పొందటం మంచిది.