Self Motivation : చేసిన తప్పును చెరిపేయాలంటే ఇలా సమాధానం చెప్పాలి..
జీవితంలో కొన్ని పొరపాట్లు జరిగిపోతాయి. అక్కడితో జీవితం అయిపోయిందనుకుంటే భవిష్యత్ ఉండదు. పడిన మచ్చను చెరిపేసుకోవాలంటే..సమాధానం ఎలా చెప్పాలి?

Self Motivation
Self Motivation : తెలిసో.. తెలియకో జీవితంలో పొరపాట్లు చేస్తారు. అవి ఒక్కోసారి చెరగని ముద్రలా వెంటాడుతుంటాయి. గతం తాలుకూ పొరపాట్ల నుంచి బయటపడాలంటే ఎవరికి వారు మారాలి. తమ జీవితంలో జరిగిన పొరపాటును చెరిపేయాలంటే దానికి సమాధానం సక్సెస్ మాత్రమే.
99 మంచి పనులు చేసి 1 చిన్న మిస్టేక్ చేసినా 99 మంచిపనులు అందరూ మర్చిపోతారు. ఆ ఒక్క మిస్టేక్ తో చెడ్డ పేరు వచ్చేస్తుంది. జరిగిన పొరపాటును వెంటనే ఎవరూ తీయలేరు. అందరూ మర్చిపోయేలా చేయలేరు. అలాగని అందరూ తమని తక్కువగా చూస్తున్నారని, హేళన చేస్తున్నారని కృంగి పోవడం సరికాదు. అప్పుడు ఏం చేయాలి? అంటే సక్సెస్‌తో సమాధానం చెప్పాలి. అటువంటి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వడం సవాల్ అయినా ముందుకి వెళ్లాలి.
Viral Video : ఆత్మీయులు ఎవరో ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? జాస్మిన్ అరోరా స్టోరీ చదవండి
చాలామందిలో వారి మీద వారికి నమ్మకం ఉండదు. ఈ పని చేయలేను.. ఈ పని రాదు.. నేను ముందుకు వెళ్లలేను..అని తమ మీద తాము డౌట్ పడతారు. అలా డౌట్ పడటం మానేయాలి. మనం సక్సెస్ కాకుండా ఆపేది సెల్ఫ్ డౌట్. దానిని పక్కన పెట్టి అడుగు ముందుకు వెయ్యాలి.
పొరపాటు జరిగిపోయిన తర్వాత చాలామంది రిగ్రెట్ ఫీల్ అవుతారు. అప్పుడు అలా ఎందుకు చేసాను? అలా చేయకుండా ఉండాల్సింది అనుకుంటూ బాధ పడతారు. ఇలా చేసిన పనికి రిగ్రెట్ ఫీలైతే వారికి ఫ్యూచర్ కనిపించదు. ఇక కొందరిలో నిర్లిప్తత కనిపిస్తుంది. ఎంత సేపు నాకు లక్ లేదు.. నాకు ఛాన్స్ లు రావు.. నేను ఏ పని చేసినా అవ్వదు ఇలా ఎప్పుడూ నిరాశలో ఉంటారు. సో.. ఇలాంటి వారు ఈ ఆలోచనలు మానేయకపోతే మీ పొరపాట్లను సరి చేసుకోలేరు. సక్సెస్ అవ్వలేరు.
Parenting Tips : మీ పిల్లల్ని సమానంగా చూస్తున్నారా?.. లేదంటే..
పొరపాటు జరిగిపోయింది.. దానిని పట్టుకుని వేలాడుతూ కూర్చుంటే జీవితంలో ఇంకేమీ మిగలదు. ముందు గిల్టీగా ఫీలవ్వడం మానేయాలి. పాస్ట్ ఈజ్ పాస్ట్.. భవిష్యత్తులో తనపై పడిన మచ్చను చెరిపేసుకోవాలంటే తన మీద తాను నమ్మకంతో ముందుకి నడవాలి. ఎలాంటి ఫెయిల్యూర్ కి అయినా దొరికే ఆన్సర్ ఒక్కటే. అదే ‘సక్సెస్’. మన ఓటమిని చెరిపేసే మంత్ర అది. గతంలో చేసిన తప్పులను సరి చేసుకోవడాని మిమ్మల్ని మీరు మళ్లీ ప్రూవ్ చేసుకోవడానికి ఒకే ఒక మంత్ర ‘సక్సెస్’. దానిని సాధించాలంటే మీమీద మీరు నమ్మకంతో ముందుకు సాగిపోవడమే.