Saral Matsyasana : తలనొప్పి, సైనస్ ల నుండి ఉపశమనం కలిగించే సరళ మత్స్యాసనం!
చర్మం, పొట్ట భాగాలకు, మలబద్ధక సమస్యకు ఇదెంతో మంచిది. మెడ, నడుం, వెన్ను పట్టేయడం, ఒళ్లునొప్పులు, బద్ధకం, జుట్టు రాలడం, థైరాయిడ్ సమస్యలను నివారిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Simple Matsyasana that relieves headaches and sinuses!
Saral Matsyasana : ఈ కాలంలో జలుబు, దగ్గు, ఉబ్బసం, శ్వాస ఇబ్బందులు, అలర్జీలతో సతమతమవుతుంటాం. అలాంటి సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తలనొప్పి, జలుబు కావడానికి చిన్న సమస్యలే కానీ తెగ ఇబ్బంది పెడతాయి. మాటిమాటికీ ఈ సమస్యలు వస్తుంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మరేదైనా తీవ్ర అనారోగ్యం కారణంగానో లేదా వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్లనో ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి దరిచేరకుండా ఉండాలంటే యోగా బాగా తోడ్పడుతుంది. సరళ మత్స్యాసనం జలుబును తగ్గిస్తుంది. తలనొప్పినీ నివారిస్తుంది.
సరళ మత్స్యాసనం వేసే విధానం ;
వెల్లకిలా పడుకుని రెండు కాళ్లూ దగ్గరికి ఆనించాలి. చేతులు తల పక్కన భుజాల దగ్గర పెట్టి మెల్లగా తల పైకి లేపి తల పైభాగాన్ని నేల మీద ఆనించాలి. చేతులు తీసి పిరుదుల పక్కన కానీ తొడల మీద గానీ నిటారుగా పెట్టాలి. ఈ ఆసనంలో ఉండగలిగినంతసేపు ఉండి రెండు చేతులూ మళ్లీ భుజాల పక్కన పెట్టి చేతుల మీద బరువేసి తలను యథా స్థితిలో ఉంచాలి. ఒకేసారి తలను లాగకుండా చాలా నెమ్మదిగా చేయాలి. మత్స్యాసనం అంటే చేపను తలపించేలా ఉంటుంది.
సరళ మత్య్సాసనం తో లాభాలు ;
చర్మం, పొట్ట భాగాలకు, మలబద్ధక సమస్యకు ఇదెంతో మంచిది. మెడ, నడుం, వెన్ను పట్టేయడం, ఒళ్లునొప్పులు, బద్ధకం, జుట్టు రాలడం, థైరాయిడ్ సమస్యలను నివారిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సరళ మత్స్యాసనం తలనొప్పి, సైనస్‌లతో బాధపడుతున్న వారికి ఎంతో మంచిది. ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది. మెడనొప్పి ఉన్న వారికీ దీనివల్ల ఉపశమనం లభిస్తుంది.
