Ys Jagan: వైసీపీలో వర్గపోరు..! ఇప్పటి నుంచే టికెట్ ఫైట్..? జగన్ ఎలా చెక్ పెట్టబోతున్నారు

2024 ఎన్నికలకు ముందు భారీగా నియోజకవర్గ ఇంచార్జ్‌లను మార్చేశారు జగన్. ఆ మార్పులతో వ్యతిరేక ఫలితాలు చవి చూడాల్సి వచ్చింది. (Ys Jagan)

Ys Jagan: వైసీపీలో వర్గపోరు..! ఇప్పటి నుంచే టికెట్ ఫైట్..? జగన్ ఎలా చెక్ పెట్టబోతున్నారు

Ys Jagan Mohan Reddy Representative Image (Image Credit To Original Source)

Updated On : January 2, 2026 / 9:37 PM IST

 

  • నియోజకవర్గాల్లో రసవత్తరంగా టికెట్‌ ఫైట్‌
  • ఇద్దరు, ముగ్గురు నేతల పోటాపోటీ యాక్టివిటీ
  • దాదాపు 50 నియోజకవర్గాల్లో ఇంటిపోరు
  • సీట్లు పెరిగితే ఆధిపత్య పోరుకు చెక్ పడే ఛాన్స్

 

Ys Jagan: వైసీపీలో డిఫరెంట్ సినారియో. కొందరు లీడర్లు సైలెంట్‌ మోడ్‌లో ఉంటే.. మరికొందరు ఇప్పటి నుంచే టికెట్ రేసులో రచ్చకెక్కుతున్నారు. డబుల్స్‌తో.. వైసీపీ హైకమాండ్‌కు ట్రబుల్స్ తప్పట్లేదు. ఈ సమస్య పెద్దగానే ఉంది.. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు నేతల మధ్య పోటీ క్యాడర్‌ను అయోమయంలో పడేస్తుంది. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 50 నియోజకర్గాల కుంపట్లు.. వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారాయట. వర్గపోరుకు జగన్ ఎలా చెక్ పెట్టబోతున్నారు? నేతలకు సీట్లు ఎలా అడ్జస్ట్ చేయబోతున్నారు?

గతమంతా ఓ లెక్క. 2024 నుంచి ఇంకో లెక్క అన్నట్లు ఉంది వైసీపీ పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి ఫ్యాన్ పార్టీ డిఫరెంట్‌ సిచ్యువేషన్స్‌ను ఫేస్ చేస్తోంది. ఓవైపు సైలెంట్‌ అయిన నియోజకవర్గ ఇంచార్జ్‌లు.. మరోవైపు అయోమయంలో క్యాడర్..యాక్టీవ్‌గా లేని అధిష్టానం అన్నట్లుగా..అంతా గజిబిజి గందరగోళం అన్నట్లుగా ఉందట సీన్. ఇది చాలదన్నట్లు..అసలే ప్రతిపక్షంలో ఉన్నామంటే..చాలా నియోజకవర్గాల్లో వర్గపోరు హెడెక్‌గా మారిందట.
50 నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు..

కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇప్పటినుంచే టికెట్ ఫైట్ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు నేతలు. నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల కోసం ఓవైపు.. తాము రేసులో ఉన్నామని చెప్పుకునేందుకు నేతలు ఆరాటపడుతున్నారట. పోటాపోటీగా యాక్టివిటీ చేస్తూ..క్యాడర్‌ను డైలమాలో పడేస్తున్నారట. దాదాపు 50 నియోజకవర్గాల్లో నేతల ఆధిపత్య పోరు హైకమాండ్‌కు తలనొప్పులు తెచ్చి పెడుతోందట.

2024 ఎన్నికలకు ముందు భారీగా నియోజకవర్గ ఇంచార్జ్‌లను మార్చేశారు జగన్. ఆ మార్పులతో వైసీపీ అనుకున్న రిజల్ట్‌ సాధించకపోగా..వ్యతిరేక ఫలితాలు చవి చూడాల్సి వచ్చింది. ఆ మార్పులతో ఇప్పటికీ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకే నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. వారి మధ్య పోటీని కంట్రోల్ చేయడానికి డీలిమిటేషన్ అస్త్రం తీసుకొస్తున్నారు అధినేత జగన్.

Ysrcp

Ysrcp Representative Image (Image Credit To Original Source)

లీడర్ల టికెట్ ఫైట్‌తో వైసీపీలో రచ్చ రచ్చ..

ఏపీలో నియోజకవర్గాల పెంపుపై ఆశావహులు చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఇక వైసీపీలో అయితే ఆ లిస్ట్ చాలానే ఉంది. చాలా వరకు నియోజకవర్గాల్లో ఇద్దరు నేతలు..కొన్నిచోట్ల ముగ్గురు లీడర్లు పోటీ పడుతున్నారు. ఇంచార్జ్ ఒకరికి మాత్రమే అవకాశం ఉన్నా..మిగిలిన వాళ్లు సెకండ్ పవర్ సెంటర్‌గా తయారవుతున్నారు. దీంతో పార్టీ క్యాడర్, నియోజకవర్గ స్థాయి నుంచి మండల, గ్రామస్థాయి నేతలు ఎటూ తేల్చుకోలేని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. లీడర్ల టికెట్ ఫైట్‌తో వైసీపీలో రాజకీయ రచ్చకు రోడ్డెక్కుతోంది.

2024 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల ఇంచార్జులను పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు చేశారు జగన్. దీంతో చాలామందికి పోటీకి అవకాశం లేకుండా పోయింది. కొత్త వారికి అవకాశాలు వచ్చాయి. కొందరికి స్థాన చలనాలు కలిగాయి. అయితే ఎన్నికల్లో ఓటమితో ఇప్పుడు ఆ మార్పులే తలనొప్పిగా మారాయి. పాత కొత్త ఇంచార్జ్‌లు ఒకే నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నారు. వీరికి తోడు కొత్తగా పోటీ చేయ్యాలనుకునే వారు యాడ్ అవుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఇంచార్జ్ కోసం ద్విముఖ త్రిముఖ పోటీ నడుస్తుంది.

ఆధిప్యత పోరుతో అయోమయంలో క్యాడర్..

ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, పైచేయి సాధించడం కోసం చేస్తున్న ఫీట్లు చూస్తూ పార్టీ క్యాడర్ ఎవరివైపు నడవాలో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు, పంచాయితీలు తాడేపల్లికి ఎక్కువగా వస్తున్నాయట. అయితే వీటిపై అధినేత జగన్ నేరుగా నేతలను పిలిపించి మాట్లాడుతున్నారట. ఎక్కడెక్కడైతే ఇద్దరు, ముగ్గురు నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారో..వాళ్లందరిపైనా డీలిమిటేషన్ అస్త్రం వాడుతున్నారట జగన్. విభేదాలతో మొదటికే మోసం వస్తుందని.. కలిసి పని చేసి పార్టీని బలోపేతం చెయాలని కోరుతున్నారట.

కొత్తగా నియోజకవర్గాలు పెరుగుతున్నాయి.. అందరికీ అవకాశాలు వస్తాయని భరోసా కల్పిస్తున్నారట జగన్. ఇప్పట్లో నియోజకవర్గ ఇంచార్జ్‌లను మార్చే ఆలోచన తనకు లేదని..విభేదాలు పెట్టుకుంటే క్యాడర్ ఇబ్బంది పడతారని లీడర్లకు దిశానిర్దేశం చేస్తున్నారట. ఇక మహిళలకు సీట్లు పెరుగుతాయని.. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని క్లాస్ తీసుకుంటున్నారట జగన్. డీలిమిషన్ అయితే సరే కాకపోతే ఈ డబుల్స్‌తో వస్తున్న ట్రబుల్స్‌ను ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ గ్రామాల పరిధిలోని ప్రజలకు భారీ శుభవార్త