Andhrapradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ గ్రామాల పరిధిలోని ప్రజలకు భారీ శుభవార్త

Andhrapradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన రాజధాని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

1/8ap capital amaravati
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన రాజధాని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
2/8
రాజధాని అమరావతి జోన్-8 ప్రాంతంలోని నాలుగు గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికోసం ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది.
3/8
కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టనుంది.
4/8
రూ.1358 కోట్లతో అభివృద్ది పనులు చేసేందుకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా సంస్థకు కాంట్రాక్టు అప్పగించింది. ఎల్1 బిడ్‌ను ఆమోదించి పనిని అప్పగిస్తూ ఎడీసీఎల్ తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
5/8
గ్రామాల పరిధిలో లే-అవుట్‌లలో రోడ్లు, డ్రెయిన్లు, నీటి సరఫరా, మురుగునీరు పారుదల నిర్మాణాలు. విద్యుత్ & ఐసీటీకోసం యుటిలిటీ డక్ట్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా పునర్వినియోగ వాటర్ లైన్, అవెన్యూ ప్లాంటేషన్, గ్రీనరీ అభివృద్ధితోపాటు తదితరుల పనులు చేపట్టనున్నారు.
6/8
అభివృద్ధి పనులకోసం అవసరమైన నిధులు, తదుపరి చర్యలు తీసుకోవాలని అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) ఎండీకి ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
7/8
ల్యాండ్ పూలింగ్ గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా భూములిచ్చిన రైతులు, గ్రామాల ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
8/8
భూములిచ్చిన గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా, ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం ద్వారా అమరావతి రాజధాని ప్రాంతాన్ని దేశంలోనే ఒక ఆదర్శ అభివృద్ధి నమూనాగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.