Hair Problems : జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా? ఆలివ్ అయిల్‌ తో పరిష్కారం!

తలస్నానం చేసినా కొన్నిసార్లు జుట్టులో మెరుపు కనిపించదు. బలహీనంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కాచి చల్లార్చిన గ్రీన్‌ టీని ఆలివ్‌ నూనెలో కలిపి జుట్టుకి రాసి ఆరనివ్వాలి. తర్వాత గంటాగి తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మెరుపూ కనిపిస్తుంది.

Hair Problems : జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా? ఆలివ్ అయిల్‌ తో పరిష్కారం!

Suffering from hair problems? The solution with olive oil!

Updated On : November 8, 2022 / 11:27 AM IST

Hair Problems : జుట్టు నల్లగా, ఒత్తుగా ఉండాలని చాలా మంది కోరుకుంటుంటారు. కానీ హార్మోన్ల ప్రభావం, అనారోగ్యాలు వంటివాటితో పాటు మరికొన్ని కారణాలు తోడైతే జుట్టు రాలడం సమస్యగా మారుతుంది. జుట్టు సమస్యలతో బాధపడేవారు ఆందోళన చెందకుండా ఆలివ్ అయిల్‌ వాడితే పరిష్కారం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఆలివ్‌ నూనెలో ఉండే విటమిన్‌-ఇ, తోపాటు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి తలమీద ఉన్న చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

తలపై ఆలివ్ ఆయిల్ తో మర్దన చేయడం వల్ల జుట్టు పొడిబారిపోవడం, తెల్లబడటం, వంటి సమస్యలు తగ్గడంతోబాటు కుదుళ్లు దృఢంగా మారతాయి. జుట్టు పొడిబారి చిక్కుగా మారిపోయింది. ఆలివ్‌ నూనెని తలకు పట్టించి పదినిమిషాలు మర్దన చేస్తే సరిపోతుంది. తర్వాత మాడుకి తగిలేలా ఆవిరి పట్టి షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టుకి నిగారింపు సంతరించుకుంటుంది.

తలస్నానం చేసినా కొన్నిసార్లు జుట్టులో మెరుపు కనిపించదు. బలహీనంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కాచి చల్లార్చిన గ్రీన్‌ టీని ఆలివ్‌ నూనెలో కలిపి జుట్టుకి రాసి ఆరనివ్వాలి. తర్వాత గంటాగి తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మెరుపూ కనిపిస్తుంది. చుండ్రు కారణంగా పొడిబారిపోయిన జుట్టుకి ఆలివ్‌నూనెతో మర్దన చేయడం వల్ల మంచి పలితం ఉంటుంది. ఆలివ్‌ నూనెతో మర్దన చేయడం వల్ల ఎండవేడిమి కారణంగా ఆగిపోయిన మెలనిన్‌ వర్ణద్రవ్యం తిరిగి ఉత్పత్తి అవుతుంది. దీంతో కురులు నల్లగా నిగనిగలాడతాయి.

జుట్టు బలహీనంగా మారి ఊడిపోతున్నప్పుడు కొబ్బరిపాలల్లో చెంచా ఆలివ్‌నూనె, కాస్త కలబంద గుజ్జు, మూడు గుడ్లలోని తెల్లసొన కలిపి బాగా గిలకొట్టి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట తర్వాత గాఢత తక్కువ షాంపుతో తలస్నానం చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే నాలుగుచుక్కల అల్లం రసంలో కొద్దిగా ఆలివ్‌నూనె చేర్చి జుట్టు కుదళ్లకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు దృఢంగా మారతాయి.

ఆలివ్ ఆయిల్‌లో వెల్లుల్లి పొట్టును కాల్చిన పొడిని కలిపి తలకు రాసుకుంటే జుట్టు త్వరగా నెరవదు. ఆలివ్‌ ఆయిల్‌లో కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి, తలకు అప్లై చేయాలి. తర్వాత తలస్నానం చేస్తే జుట్టు మెత్తగా మారుతుంది. వెంట్రుకలు రాలిపోవటాన్ని నివారించవచ్చు.