Nervous Weakness : నరాల వీక్నెస్ తో ఇబ్బంది పడుతున్నారా? సమస్య నుండి బయటపడాలంటే?

కూరగాయలు ఆకుకూరలు మరియు దుంపలు ఇవి మాత్రమే కాదు. ధాన్యాలు విత్తనాలను కూడా ప్రధాన ఆహార భాగాలుగా మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఈ ధాన్యాలు మరియు విత్తనాలలో మాంసకృత్తుల తో పాటు శరీరానికి కావలసిన విటమిన్లు శాతము అధికంగా ఉంటుంది.

Nervous Weakness : నరాల వీక్నెస్ తో ఇబ్బంది పడుతున్నారా? సమస్య నుండి బయటపడాలంటే?

Suffering from nervous weakness? To get out of the problem?

Updated On : October 19, 2022 / 1:20 PM IST

Nervous Weakness : న‌రాల వీక్నెస్‌ పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మందిలో క‌నిపిస్తుంది. నేటి రోజుల్లో అతి చిన్న వయసులోనే దీనితో ఇబ్బంది పడుతున్నవారు చాలా మంది ఉన్నారు. సాధారణంగా వయసు పైబడిన వారిలో రావాల్సిన నరాల వీక్నెస్ సమస్య అనేక కారణాల వల్ల 40 నుండి 50 సంవత్సరాల మధ్యలోనే ఈ సమస్య ఎదురవుతుంది. న‌రాల బ‌ల‌హీన‌త ఉన్న వారిలో ఏ చిన్న బరువు లేపినా చేతులు జివ్వున లాగేయడం వల్ల కష్టమైన పనులు చేయడానికి వీలు లేకుండా ఉంటుంది. న‌డిచినా వ‌ణుకు రావ‌డం, తీవ్ర అల‌స‌ట‌, తిమ్ముర్లు ఇలా ర‌క‌ర‌కాల ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి.వీటిని ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌రాదు.

నరాల వీక్నెస్ రావడానికి పోషకాలు లేని ఆహారం తీసుకోవడం. ప్రధానంగా బి విటమిన్ మరియు బి కాంప్లెక్స్ విటమిన్ ఆహారంలో లోపించటం కారణంగానే నరాల వీక్నెస్ వస్తుంది. బీ కాంప్లెక్స్ విటమిన్లు గింజధాన్యాలు యొక్క పొట్టులో అధికంగా లభిస్తాయి. గింజలు, ధాన్యాల యొక్క పై పొరలలో బి కాంప్లెక్స్ విటమిన్ అధిక శాతంలో లభిస్తుంది. పాలిష్ పట్టిన ఆహారాన్ని తీసుకోవటం వల్ల బీ కాంప్లెక్స్ లోపం ఏర్పడుతుంది. దీంతో నరాల వీక్నేస్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.

నరాల వీక్నెస్ సమస్యను అదిగమించాలంటే ;

కూరగాయలు ఆకుకూరలు మరియు దుంపలు ఇవి మాత్రమే కాదు. ధాన్యాలు విత్తనాలను కూడా ప్రధాన ఆహార భాగాలుగా మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఈ ధాన్యాలు మరియు విత్తనాలలో మాంసకృత్తుల తో పాటు శరీరానికి కావలసిన విటమిన్లు శాతము అధికంగా ఉంటుంది. అయితే వీటిని పాలిష్ పట్టి తినడం వల్ల మనకు అందాల్సిన పోషకాలు కోల్పోతున్నాం. పాలిష్ పట్టిన వాటిని తినడం వీలైనంత త్వరగా మానివేయాలి.

పాలిష్ పట్టని బియ్యము తో అన్నము, రాగి సంగటి, జొన్న సంగటి ని ప్రధాన ఆహారంగా తీసుకోవాలి. ఈ గింజ ధాన్యాలలో పైపొర లో అధిక శాతంలో బీ-కాంప్లెక్స్ విటమిన్లు ఉండటం వల్ల ఇవి శరీరానికి ముఖ్యంగా నరాలకు ఉపయోగపడతాయి. ముడి ధాన్యాలు పిండి చేసుకుని నేరుగా ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సక్రమంగా లభిస్తాయి. దీని ద్వారా నరాల వీక్నెస్ సమస్యను తొలగించుకోవచ్చు.

బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు, పెసలు కందులు మరియు మినుములు మొదలగు వాటి నన్నింటిని వీలైనంతవరకు పొట్టు తీయకుండానే రవ్వ మరియు పిండి చేసుకుని ఆహారంలో చేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల నరాల వీక్నెస్ సమస్యకు ఎలాంటి మందులు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఎదిగే వయస్సు పిల్లలకు వీటిని ఇవ్వటం ద్వారా దేహ దారుఢ్యాన్ని పెంపొందించుకోవచ్చు.