Storytelling Important For Children : పిల్లలకు కథలు చెప్పడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
రోజులో కాసేపు సెల్ ఫోన్ పక్కన పెట్టండి. సమయం తీరిక చేసుకుని మీ పిల్లలకు కథలు చెప్పండి. వారిలో వినే అలవాటు నేర్పండి. పిల్లలు కథలు వినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Storytelling Important For Children
Storytelling Important For Children : చిన్నతనంలో అన్నం తిననని మారాం చేస్తే అమ్మ కథలు చెబుతూ అన్నం తినిపించేది. రాత్రి నిద్రపోకపోతే తాతయ్య, నానమ్మ కథలు చెబుతుంటే పిల్లలు హాయిగా నిద్రపోయేవారు. ఇదంతా ఒకప్పుటి కాలం. ఇప్పుడు అమ్మలు పిల్లల చేతిలో సెల్ ఫోన్ పెట్టి అన్నం తినిపిస్తున్నారు. రాత్రి నిద్రపోయే దాకా పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్ ఉండాలి. అలా కథలు చెప్పే అలవాటు పెద్దల్లో.. కథలు వినే అలవాటు పిల్లలు ఉండట్లేదు. నిజానికి కథలు చెప్పడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
పిల్లలకు కథ విన్నప్పుడు వారిలో కొత్త ఆలోచనలు పుడతాయి. విలువ గురించి తెలుసుకోవడానికి వారిలో క్రియేటివిటీ పెరగడానికి సహాయపడతాయి. కల్పిత కథ అయినా, చారిత్రక కథ అయినా అది నోటితో లేదా రాత పూర్వకంగా లేదా స్క్రీన్ మీద చెప్పవచ్చు. పిల్లలకు కథలు చెప్పడం వల్ల ఏది తప్పు ఏది చెడు అనే అంశాలు వారికి తెలుస్తాయి. వారికి ఇతరుల పట్ల దయ, సానుభూతిని పెంపొందించడంలో సాయపడతాయి.
పిల్లలు కథలు విన్నప్పుడు వారికి రకరకాల వ్యక్తులు, ప్రదేశాలు, సంఘటనలు తెలుసుకుంటారు. పిల్లలు కనే కలలు నెరవేర్చుకోవడం సాధ్యమే అని మనం కథలుగా చెప్పడం ద్వారా వారిలో పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది. కథలు చెప్పినపుడు వారిలో కొత్త ఆలోచనలు పుడతాయి. ఏదైనా సమస్య ఎదురైనపుడు పరిష్కార మార్గాలు కనుగొనగలుగుతారు. కథ వింటూ భాషపై పట్టు నేర్చుకుంటారు. కొత్త పదాలు పరిచయం అవుతాయి. భయం, విచారం, సంతోషం చుట్టూ కథలో తిరిగే పాత్రల గురించి తెలుసుకోవడం ద్వారా తమలో కూడా అలాంటి భావాలు కలిగినపుడు ఎలా ఎదుర్కోవాలో వారికి అర్ధం అవుతుంది.
Coffee and Tea : పిల్లలకు కాఫీ, టీ ఇస్తున్నారా… అయితే ఇది తప్పక చదవండి
పిల్లలు కథలు వినడం వల్ల చుట్టూ ఉంటే వాతావరణం, పరిస్థితులు తెలుసుకుంటారు. కథలు వినడం కూడా సరదాగా ఉంటుంది. ఇతరులను ఎలా అర్ధం చేసుకోవాలో కూడా తెలుస్తుంది. కొన్ని దయగల, సహాయకరమైన , క్షమించే పాత్రలకు సంబంధించిన కథలు వినడం వల్ల ఇతరులతో వారి ప్రవర్తన అంచనా వేసుకోగలగుతారు. కథలు వినడం వల్ల వారిలో నైపుణ్యం పెరుగుతుంది. కాబట్టి పిల్లల కోసం రోజు కొంచెం సమయం కేటాయించండి. మీరు చదివిన మీకు తెలిసిన కథలు వారికి చెప్పండి. అలా అలవాటు చేయడం వల్ల సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి దూరమవుతారు. అదే సమయంలో కథలు వినాలి.. చదవాలనే ఆసక్తి వారిలో పెంపొందుతుంది.