Coffee and Tea : పిల్లలకు కాఫీ, టీ ఇస్తున్నారా… అయితే ఇది తప్పక చదవండి

మనం తాగే కాఫీ గానీ, టీలో గానీ కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. దీని వల్లనే మనకు టీ, కాఫీలు తాగగానే రిలాక్స్ గా అనిపిస్తుంది. కానీ, ఇది అతిగా తీసుకుంటే మంచిది కాదు. ఇక పిల్లల విషయంలో మరీ నష్టం చేస్తుంది.

Coffee and Tea : పిల్లలకు కాఫీ, టీ ఇస్తున్నారా… అయితే ఇది తప్పక చదవండి

Giving coffee and tea to children

Updated On : July 24, 2023 / 7:54 PM IST

Coffee and Tea : పొద్దున లేవగానే ‘చాయ్’ అంటూ అడిగే పిల్లలు ఉంటారు. పెద్దవాళ్లతో పాటు టీ, కాఫీ తాగాలనే తాపత్రయం ఉండే పిల్లల్ని చూస్తూనే ఉంటాం. అడుగుతున్నారు కదా.. అని మురిపెంగా తాగిస్తే మాత్రం మంచిది కాదంటున్నారు పిల్లల నిపుణులు.

READ ALSO : Lose Weight : బరువు తగ్గడానికి కాఫీ ఎలా తాగాలి? బ్లాక్ కాఫీ మంచిదా.. మిల్క్ కాఫీ మంచిదా?

పిల్లలకు ప్రతిరోజూ రెండు సార్లయినా పాలు తాగిస్తాం. కానీ కొంతమంది పిల్లలు పాలు తాగాలంటే పారిపోతుంటారు. పాల వాసన ఇష్టం లేదని మారాం చేస్తుంటారు. ఇలాంటప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పాలలో ఒక టీ చుక్క వేసి, టీ అనిఇచ్చేవాళ్లూ ఉంటారు. కానీ కొంచెం తాగిస్తే ఏమవుతుందిలేఅనిటీనో, కాఫీనో తమతో పాటు పిల్లలకూ ఇచ్చేవాళ్లు ఉంటారు. కానీ పన్నెండేళ్ల లోపు పిల్లలకు కాఫీ, టీలు ఎక్కువగా ఇస్తే దుష్ప్రభావాలుంటాయి.

పెద్ద వాళ్లు అయితే రోజుకి కనీసం రెండుసార్లయినా కాఫీ, టీలు తీసుకుంటుంటారు. కొందరైతే రోజుకి అయిదారుసార్లుటీనో, కాఫీనోతాగేవాళ్లూ ఉంటారు. కొందరు తల్లులు స్ట్రిక్ట్ గా ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు పిల్లలు మొండికేస్తున్నారనో, ఏడుస్తున్నారనో, మురిపెంతోనో ప్రతిసారీ వాళ్లతో పాటు ఇలా టీ, కాఫీలను వాళ్లకూ ఇస్తుంటారు. ఒక్కసారికి కొంచెం తాగితే ఏమయిందని… అనే పెద్దవాళ్లూ ఉంటుంటారు. అలాంటి ఆలోచనాధోరణిఉన్నవాళ్లను ఇది చదవమని చెప్పండి.

READ ALSO : Reduce Stress : ఒత్తిడి తగ్గించుకునేందుకు కాఫీ, టీలు మోతాదుకు మించి తాగితే ఎముకలు పెళుసుగా మారతాయ్!

ఇవే నష్టాలు :

మనం తాగే కాఫీ గానీ, టీలో గానీ కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. దీని వల్లనే మనకు టీ, కాఫీలు తాగగానే రిలాక్స్ గా అనిపిస్తుంది. కానీ, ఇది అతిగా తీసుకుంటే మంచిది కాదు. ఇక పిల్లల విషయంలో మరీ నష్టం చేస్తుంది. ఎదిగే పిల్లలకు కాల్షియం, ఐరన్ లాంటి సూక్ష్మ పోషకాలు సరైన మోతాదులో అందాలి. కానీ కెఫీన్ శరీరం కాల్షియంను సరిగా గ్రహించకుండా నివారిస్తుంది. అందువల్ల కాఫీ, టీలు ఎక్కువగా తాగే పిల్లల్లో కాల్షియం తగ్గిపోయి, ఎదుగుదలకు ఆటంకం రావచ్చు.

READ ALSO : Health : రోజంతా చురుకుగా ఉండాలంటే ఉదయం టీ, కాఫీలకు బదులుగా?

ఎప్పుడో ఒకసారి అతి కొద్ది మోతాదులో తాగితే పరవాలేదు గానీ, మరీ ఎక్కువగా కాఫీ, టీలు తీసుకుంటే పిల్లల గుండె, మెదడు పనితీరుపై దుష్ప్రభావం పడుతుంది. కాఫీ, టీలు ఎక్కువగా తాగే పిల్లలు సరిగా నిద్రపోరు. వీళ్లలో నిద్రలేమి సమస్య తలెత్తేందుకు ఆస్కారం ఉంటుంది. కాఫీ, టీలలో కెఫీన్ తో పాటు చక్కెర ఉండటం వల్ల దంతాలపై ప్రభావం పడుతుంది. వీటిని ఎక్కువగా తీసుకునే పిల్లల్లో దంతాల మెరుపు తగ్గి, పసుపు రంగు ఏర్పడే అవకాశం ఉంటుంది.

కాఫీ, టీలు తాగే పిల్లల్లో కడుపులో డిస్ కంఫర్ట్ ఏర్పడవచ్చు. బరువు ఎక్కువగా కూడా పెరుగుతారు. చల్లని వాతావరణం అని పదే పదే ఎక్కువగా కాఫీ, టీలు తాగితే డీహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఉంది. సహజంగానే కాఫీ, టీలు డీహైడ్రేట్ చేస్తాయి. వీటిలోని చక్కెర శరీరంలో ఉండే నీటిని గ్రహించి, మరింత డీహైడ్రేట్ చేస్తుంది. సులువుగా డీహైడ్రేషన్ కు లోనయ్యే పిల్లలకు కాఫీ, టీలు అసలే ఇవ్వొద్దు.

READ ALSO : Tea And Coffee : రోజు టీ, కాఫీలు తాగేస్తున్నారా? అయితే వాటిని తాగే ముందు నీటిని తీసుకోవటం అలవాటుగా మార్చుకోండి! ఎందుకో తెలుసా?

కాఫీ, టీల వల్ల ఇన్ని నష్టాలు ఉంటాయి కాబట్టే పన్నెండేళ్ల వయసు దాటని పిల్లలకు కాఫీ, టీలు అసలే ఇవ్వొద్దు. ఎప్పుడైనా ఇవ్వాల్సి వచ్చినా వారానికి రెండు కప్పులకు మించి అసలే ఇవ్వకూడదంటున్నరు నిపుణులు. ఇంకా చెప్పాలంటే నార్మల్ కాఫీ, టీల కు బదులుగా అల్లం టీ, సోంపు టీ, హెర్బల్ టీ, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ లాంటివి ఇవ్వొచ్చు.