Benefits Of Kiwi Fruit
Kiwi Fruit : మనం రోజువారిగా తీసుకునే ఆహారంలో తాజా పండ్లు , కూరగాయల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. వాటి ద్వారా విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ వంటి పోషకాలు అందుతాయి. పుచ్చకాయ నుండి అరటి పండు వరకు, మనం తీసుకునే ప్రతి పండు మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే అలాంటి పండ్లలో కివీ పండుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిలో ఉన్న పోషకాల కారణంగా ప్రపంచం మొత్తం దీనిని గుర్తించింది. చైనీయులు ఈ పండును బాగా ఇష్టంగా తింటారు. దీనిని గూస్ బెర్రీ, యాంగ్ తావ్ గా పిలుస్తారు.
అది అందించే అద్భుతమైన ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ కె, ఇ లు సంవృద్ధిగా లభిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడే ఫోలేట్ , పొటాషియం, ఉంటాయి. ఈ జ్యుసి పండు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. చర్మ ఆరోగ్యం నుండి రోగనిరోధక శక్తి వరకు ఇది అందించే ప్రయోజనాలు అన్నీఇన్నీకావు.
కివీపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు;
1. కివిలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన, మృదువుగా ఉండే చర్మానికి కీలకమైన పోషకం. USDA డేటా ప్రకారం, ఒక 100-గ్రాముల కివి రోజువారీ విటమిన్ సి అవసరంలో 154% వరకు అందిస్తుంది. కివిలో వృద్ధాప్యం, ముడతలను నిరోధించే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. కివీని పచ్చిగా తినవచ్చు లేదంటే చర్మానికి పేస్ట్ గా చేసి అప్లై చేసుకోవచ్చు. చర్మాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్స్ కివీలో పండులో ఉన్నాయి. సూర్యరశ్మి, వాయు కాలుష్యం, పొగ వల్ల చర్మం పాడవకుండా ఉండేందుకు కివీ దోహదపడుతుంది.
2. కివీ పండులో అద్భుతమైన పొటాషియం కంటెంట్ కారణంగా రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది స్ట్రోక్ మరియు టైప్-2 మధుమేహం వంటి ఇతర వ్యాధులపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది.
READ ALSO : Summer Health Care : వేసవి కాలం వచ్చేసింది.. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరమే!
3. జీర్ణక్రియకు కివీ చాలా మంచిది. ప్రతి 100 గ్రాముల కివీ 3 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. USDA డేటా ప్రకారం రోజువారీ ఫైబర్ తీసుకోవడంలో 12% వరకు కివీని తీసుకోవటం ద్వారా పొందవచ్చు. డైటరీ ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండటానికి సహాయపడుతుంది.
సాఫీగా మరియు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కివిలో ప్రోటీన్-కరిగిపోయే ఎంజైమ్ ఉంది, ఇది తిన్నఆహారాన్ని చాలా వేగంగా అమైనో ఆమ్లాలుగా విభజించడంలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
4. కివీ పండు నిద్రలేమిని పోగొడుతుంది. నిద్రపోవడానికి సహాయపడుతుంది. కివి పండులో సెరోటోనిన్ వంటి సమ్మేళనాలు ఉన్నందున రాత్రి నిద్రపోవడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కివీ వినియోగం నిద్ర భంగం నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.
READ ALSO : Sapota Fruits : వేసవి కాలంలో రోజుకు రెండు సపోటా పండ్లు తింటే చాలు…మంచి ఆరోగ్యం మీ సొంతం!
5. కేన్సర్ కు కారణమయ్యే జన్యుపరమైన కారకాలను నివారిస్తుంది. కేన్సర్ రావటానికి కారణమయ్యే కారకాలతో పోరాడుతుంది.
6. కివీ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కొలెస్ట్రాల్ ను అదుపులో ఉండే లా చేస్తాయి. కంటి సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. చూపు మెరుగుపరుస్తుంది.
7. కివీ పండు గుజ్జును ఫేస్ మాస్క్ గా ఉపయోగించవచ్చు. కేశ సంరక్షణకు గుజ్జును షాంపులా వాడుకోవచ్చు. జుట్టు రాలటాన్ని అరికడుతుంది.
8. శరీరంలో ఉండే అనవసరపు టాక్సిన్లని అరికట్టేందుకు కివి పండు దోహదపడుతుంది.