Watermelon Juice : ఎండ వేడి నుండి రక్షించటంతోపాటుగా, చర్మానికి సహజ సిద్దమైన టోనర్‌గా ఉపయోగపడే పుచ్చకాయ జ్యూస్!

పుచ్చకాయలో ఉండే నీటి శాతం వల్ల చర్మం తాజాగా వుంటుంది. పుచ్చకాయలో సహజ పదార్ధాలు ఉన్నాయి, ఇవి చర్మ కణజాలాలను టోన్ చేస్తాయి. ఈ పండు మీ చర్మానికి సహజ టోనర్‌గా పనిచేస్తుంది. జిడ్డుగల చర్మం కలిగిన వారికి పుచ్చకాయ టోనర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.

Watermelon Juice : ఎండ వేడి నుండి రక్షించటంతోపాటుగా, చర్మానికి సహజ  సిద్దమైన టోనర్‌గా ఉపయోగపడే పుచ్చకాయ జ్యూస్!

Watermelon Juice :

Watermelon Juice : వేస‌వి కాలంలో పుచ్చ‌కాయ‌లు విరివిగా లభిస్తాయి. ప్రస్తుతం అన్ని కాలాల్లో పుచ్చకాయలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే పుచ్చ‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే వేడి తగ్గి చల్లదనాన్ని ఇస్తుంది. ఎండ వేడి వ‌ల్ల క‌లిగే నీర‌సాన్ని త‌గ్గించ‌డంలో పుచ్చ‌కాయ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. పుచ్చ‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరం కోల్పోయిన ఎల‌క్ట్రోలైట్స్ ను తిరిగి పొంద‌వ‌చ్చు.

పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. ఇది మలబద్ధకం మరియు గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పుచ్చకాయలో విటమిన్ ఏ, బీ1, సీలు పుష్కలంగా వున్నాయి. సహజంగా వేసవి కాలం మన ముఖం యొక్క సహజమైన మెరుపును దూరం చేస్తుంది. మన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచకపోతే డల్ గా కనిపిస్తుంది.

పుచ్చకాయలో ఉండే నీటి శాతం వల్ల చర్మం తాజాగా వుంటుంది. పుచ్చకాయలో సహజ పదార్ధాలు ఉన్నాయి, ఇవి చర్మ కణజాలాలను టోన్ చేస్తాయి. ఈ పండు మీ చర్మానికి సహజ టోనర్‌గా పనిచేస్తుంది. జిడ్డుగల చర్మం కలిగిన వారికి పుచ్చకాయ టోనర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఎ ఉంటుంది, ఇది మీ చర్మ రంధ్రాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. చర్మంలో నూనె ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఇది మొటిమల బారిన పడకుండా రక్షిస్తుంది.

పుచ్చకాయ తింటే మయిశ్చరైజర్స్ వాడాల్సిన పని లేదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయ ముక్కకు తేనెను అద్ది ముఖంపై మృదువుగా మర్దన చేస్తే ఎండ వేడికి కమిలిన చర్మం కాంతివంతంగా మారుతుంది. పుచ్చకాయ రసానికి పెరుగు కలిపి అప్లై చేస్తే చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. అంటే పుచ్చకాయ సహజ సిద్దమైన టోనర్‌గా పనిచేస్తుంది.

చర్మం జిడ్డుగా తయారై మొటిమలు ఎక్కువగా ఉన్నవారు పుచ్చకాయ రసాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే మొటిమలు ఇట్టే తొలగిపోతాయి. పుచ్చకాయలోని విటమిన్ ఎ చర్మంలోని జిడ్డును తగ్గిస్తే, అందులోని నీటి శాతం ముఖాన్ని మరింత కాంతివంతం చేసి చర్మాన్ని తాజాగా మెరిసిపోయాలా చేస్తుంది.

పుచ్చకాయ రసానికి శనగపిండి కలిపి స్క్రబ్‌గా ముఖానికి అప్లై చేయొచ్చు. దాంతో బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యాంటీఆక్సిడెంట్లతో నిండిన పుచ్చకాయ చర్మంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. చర్మం మృదువుగా మరియు యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. పుచ్చకాయను చర్మంపై ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారడం మరియు నిస్తేజాన్ని దూరం చేస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా మరియు తేమగా కనిపించేలా చేస్తుంది.